తెలంగాణ ప్రకృతి పండుగ అయిన బతుకమ్మ సంబరాలు ఆరో రోజుకి చేరుకున్నాయి. ఆరో రోజు బతుకమ్మ అత్యంత స్పెషల్. ఎందుకంటే పేరుకి తగిన విధంగా ఆరోజు ఆరాధన విలక్షణంగా ఉంటుంది. మరీ ఇంతకీ ఈ రోజు ఏం చేస్తారంటే..
ఆ రోజు ఎవరూ బతుకమ్మను ఆడరు. అంటే.. దీనికి సంబంధించి ఒక కథ ప్రచారంలో ఉంది. దేవి భాగవతంలో అమ్మవారి మహాకాళి, మహాలక్ష్మి, మహా సరస్వతి రూపాలలో రాక్షస సంహారం చేశారు. బండాసురుడు ని, చండ ముండల్ని సంహరించిన తర్వాత రాక్షస సంహారం చేసిన అమ్మవారు బాగా అలసిపోయారు.
ఆరోజు ఆమెకు విశ్రాంతి ఇవ్వాలని భావించి మహిళలు ఆరో రోజు బతుకమ్మను పేర్చరు. ఎవరు బతుకమ్మను ఆడరు. దీనినే అర్రెం అని, అలసిన బతుకమ్మ అని పిలుస్తారు. ఆరోజు అలిగిన బతుకమ్మ వల్ల ఎవరు వేడుకలు జరపరు.మళ్లీ ఏడవ రోజు బతుకమ్మ పండుగను ఘనంగా జరుపుకుంటారు.
మరొక కథనం ప్రకారం..దేవీభాగవతంలో మహాకాళి, మహాసరస్వతితో పాటు మహాలక్ష్మి రూపాలలో అమ్మవారు రాక్షసుల్ని సంహరించడంతో అమ్మవార్లు బాగా అలసిపోయారట. అందుకే అమ్మకి విశ్రాంతి కల్పించాలన్న ఉద్దేశంతోనే భక్తులు బతుకమ్మను ఒకరోజు వాయిదా వేసినట్టు చెబుతున్నారు. మరుసటి రోజు నుంచి యథావిధిగా బతుకమ్మలు పేర్చి వేడుకలు జరుపుకుంటూ ఉంటారు. అలానే ఎప్పటిలానే అమ్మవారికి పలు నైవేద్యాలు సమర్పిస్తారు.
నైవేద్యం: స్త్రీలంతా ఉపవాసం ఉండి ఆమె అలక తీరాలని ప్రార్థిస్తారు. పైగా ఈ రోజు అమ్మవారు అలకతో ఉండటం వల్ల బతుకమ్మకు ఎలాంటి నైవేద్యం సమర్పించరు.
(చదవండి: శరన్నవరాత్రులు..ఐదోరోజు మహాచండీ అలంకారం..!)
Comments
Please login to add a commentAdd a comment