తెలుగింటి సంప్రదాయం డ్రెస్సింగ్‌లో కనిపించాలి. స్టైల్ లో ఏ మాత్రం తగ్గకూడదు వెస్ట్రన్ వేర్ అనిపించకూడదు సౌకర్యం లో బెస్ట్ చాయిస్ అవ్వాలి... పండగ హంగులు ఔరా అనిపించాలి. ఇండియన్ వేర్ నే డిఫరెంట్‌గా ధరించాలి. దసరా వేడుకలో మరింత స్టైలిష్‌గా కనువిందు చేసే మోడ్రన్ హంగులివి.
శారీ గౌన్
కుట్టిన చీరలు, ధోతీ చీరలు, ప్యాంట్ తరహా చీరలు, కేప్ స్టైల్ డ్రేప్స్... వంటి వినూత్న పద్ధతులు ప్రాచుర్యం పొందుతున్నాయి. ఎన్నో విభిన్న డిజైన్లలో ఆకట్టుకుంటున్న శారీ గౌన్, షరారా శారీ ధరిస్తే చాలా స్టైలిష్‌గా, తేలికగా, రోజంతా సౌకర్యవంతంగా హుషారుగా ఉంచుతుంది.
ఎంబ్రాయిడరీ బ్లేజర్
బ్లేజర్లు కార్పొరేట్ రంగానికి మాత్రమే పరిమితం అనుకుంటారు చాలామంది. కానీ, ఎంబ్రాయిడరీ బ్లేజర్‌ను డ్రేప్డ్ స్కర్ట్ లేదా ధోతీ ప్యాంట్‌తో స్టైల్ చేయచ్చు. నడుము భాగాన్ని బెల్ట్‌తో అలంకరిస్తే ఈ డ్రెస్ బెస్ట్ మార్కులు కొట్టేస్తుంది.
గవ్వల కుర్తీ
ధోతీ ప్యాంట్ డ్రేప్డ్ స్కర్ట్‌లకు గవ్వలు, అద్దాలతో ఎంబ్రాయిడరీ చేసిన కేప్ లేదా షార్ట్ కుర్తీతో స్టైల్ చేయచ్చు. ఫ్లోరల్ ఎంబ్రాయిడరీ ΄్యాటర్న్ ఉన్న లెహెంగా లేదా పలాజో సెట్ కూడా పండగ కళను తెప్పిస్తుంది.
సౌకర్యంగా!
సల్వార్ కమీజ్ అయితే ప్రకాశవంతమైన రంగులు ఉన్నవి ఎంచుకోవాలి. పిల్లలతో సరి΄ోలే దుస్తులను ధరించడం వల్ల ఒకే కుటుంబ రూ΄ాన్ని సృష్టించవచ్చు. పండగ కళ రావాలనే ఆలోచనతో పిల్లలకు గాడీ ఎంబ్రాయిడరీ దుస్తులు వేయకూడదు. వారి డ్రెస్సులు సౌకర్యంగా ఉండాలి. ఆభరణాలు మేనికి గుచ్చుకోకుండా ఉండేవి ఎంచుకోవాలి. భారీ ఆభరణాలను ఉపయోగించే బదులు బ్యాంగిల్స్, జూకాలు తక్కువ బరువున్న యాక్ససరీస్‌ను ఉపయోగించాలి.
(చదవండి: ఏజ్ ఈజ్ జస్ట్ నెంబర్..!)
Comments
Please login to add a commentAdd a comment