తెలంగాణ పెద్ద పండుగగా పేరుగాంచిన పూల సంబురం సందడే వేరు. జీవితాన్ని ఎలా అద్బుతంగా మలుచుకోవాలో నేర్పించే కలర్‌ఫుల్ పండుగా ఈ బతుకమ్మ పండుగా. తొమ్మిది రోజుల పాటు సాగే పండుగను రోజుకో ప్రత్యేక పేరుతో అందంగా పూలను పేర్చుకుని ఆనందంగా ఆడిపాడి చేసుకునే పండుగా. బతుకమ్మ సంబరాలు ఐదో రోజుకు చేరుకున్నాయి. ఈ రోజు ఆశ్వయుజ శుద్ధ చవితి (ఆదివారం) రోజున తెలంగాణ ఆడబిడ్డలంతా అట్ల బతుకమ్మగా ఆరాధిస్తారు. ఈ బతుకమ్మ ప్రత్యేకతలేంటి, ఏం నైవేద్యం సమర్పిస్తారు వంటివి తెలుసుకుందామా..!.
బతుకమ్మ వేడుకల్లో అయిదో రోజైన ఆశ్వయుజ శుద్ధ చవితి (ఆదివారం) నాడు బియ్యాన్ని నానబెట్టి, దంచి చేసిన అట్లను గౌరమ్మకు నివేదిస్తారు. కాబట్టి ‘అట్ల బతుకమ్మ’ అని పిలుస్తారు. ఈ రోజున గునుగు, చామంతి, మందార, బీర, తంగెడు, గునుగు, గుమ్మడి తదితర పూలతో అయిదు ఎత్తుల్లో లేదా ఐదు అంతరాల్లో బతుకమ్మను పేరుస్తారు.
నానబెట్టిన బియ్యం దంచి లేదా మర పట్టించి పిండిగా చేసి అట్లు పోస్తారు. అట్లను ముందుగా గౌరమ్మకు నైవేద్యంగా సమర్పిస్తారు. బతుకమ్మ ఆట పూర్తయిన తర్వాత ముతైదువులు తాము దేవతకు సమర్పించిన అట్లను ఒకరికొకరు వాయినంగా ఇచ్చి పుచ్చుకుంటారు.
(చదవండి: నవరాత్రులు..ఇవాళ లలితా త్రిపుర సుందరిగా అలంకారం..!)
Comments
Please login to add a commentAdd a comment