తెలంగాణలో అమ్మవారిని పుష్పాలతో బతుకమ్మలా తయారు చేసుకుని ఆరాధిస్తారు. ఇది ప్రకృతి ఆరాధనకు చిహ్నంగా, తెలంగాణ సాంస్కృతిక వైభవానికి అద్దంపట్టేలా సాగే పండుగ బతుకమ్మ. ఈ వేడుకలు ఏడో రోజుకి చేరుకున్నాయి.
ఏడో రోజు వేపకాయల బతుకమ్మగా గౌరమ్మను ఆరాధిస్తారు. ఈ రోజు బతుకమ్మను తంగేడు, గునుగు, చామంతి, గులాబి పూలతో ఏడంతరాలు పేర్చి ఆటపాటలతో సంబరంగా జరుపుకుంటారు. నిన్న అలిగిన బతుకమ్మతో మూగబోయిన ప్రతి ఇల్లు ఇవాళ పూల జాతరలా సందడిగా ఉంటుంది.
ఈ బతుకమ్మకు బియ్యంపిండిని బాగా వేయించి వేపపండ్లు ఆకారంగా తయారుచేసి నైవేద్యంగా సమర్పిస్తారు. వాటినే పేరంటాళ్లు వాయనంగా ఇచ్చుకుంటారు. లేదా పప్పు, బెల్లంలను కూడా బతుకమ్మకు నైవేద్యంగా పెడతారు. తమ కష్టాలన్నీ తొలగిపోయి జీవితాలు పూల మకరందం వలె సుమనోహరంగా సాగిపోవాలని ప్రార్థిస్తారు.
(చదవండి: బతుకమ్మ దశ దిశలా చాటే సంస్కృతి)
Comments
Please login to add a commentAdd a comment