
తెలంగాణ అసోసియేషన్ ఆఫ్ జర్మనీ 11వ బతుకమ్మ కార్యక్రమాన్ని బెర్లిన్‌లోని గణేష్ ఆలయంలో నిర్వహించింది. ఈ సందర్భంగా, బెర్లిన్‌లోని భారత రాయబార కార్యాలయం నుంచి మంత్రి (పర్సనల్) డాక్టర్ మన్‌దీప్ సింగ్ తులి, అతని కుటుంబ సభ్యులు వేడుకలను ఘనంగా నిర్వహించారు. డాక్టర్ తులి సంప్రదాయానికి గౌరవ సూచకంగా బతుకమ్మను తలపై ఎత్తుకున్నారు.
తెలంగాణ అసోసియేషన్ ప్రెసిడెంట్, డాక్టర్ రఘు చలిగంటి, రుచికరమైన తెలంగాణ ఆహారాన్ని తయారు చేసిన వాలంటీర్లకు, ముఖ్యంగా వంట టీమ్, క్లీనింగ్ అండ్ డెకరేషన్ టీమ్‌కు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా టీఏజీ కార్యవర్గానికి చెందిన రామ్ బోయినపల్లి, శరత్ రెడ్డి కమ్డి, నటేష్ చెట్టి గౌడ్ యోగానంద్ నాంపల్లి, బాల్‌రాజ్ అందె, శ్రీనాథ్ రమణి, అమూల్య పోతుమంచి, అవినాష్ రాజు పోతుమంచి, స్వేచ్ఛా రెడ్డి బీరెడ్డి, వేణుగోపాల్‌రెడ్డి బీరెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ వేడుకలో పూజ చేసినందుకు ప్రశాంత్ గోలీకి, ఫోటోలు తీసినందుకు నిదాకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
(చదవండి: కెనడాలో ఘనంగా బతుకమ్మ పండగ సంబరాలు)
Comments
Please login to add a commentAdd a comment