‘పండుగ’ చేసుకోండి | Dussehra Festival 2024 | Sakshi
Sakshi News home page

‘పండుగ’ చేసుకోండి

Published Sat, Oct 5 2024 1:49 PM | Last Updated on Mon, Oct 7 2024 4:56 PM

Dussehra Festival 2024

పండుగ షాపింగ్‌కు సై.. 

దసరా–దీపావళి సీజన్‌కు పెరగనున్న జోష్‌ 

షాపింగ్‌కు ఈ ఏడాది 36.18 శాతం మంది అధికంగా మొగ్గు 

కొత్త దుస్తుల కొనుగోలుకు 86.35 శాతం మంది మక్కువ 

బంధువులు, స్నేహితులకు పండుగ కానుకలు ఇచ్చేందుకు  72.84 శాతం సుముఖత 

గృహాలంకరణకు 70.83 శాతం మంది ప్రాధాన్యం 

ఎలక్ట్రానిక్‌ వస్తువుల కొనుగోలుకు 60.92 శాతం  

భారత్‌ ల్యాబ్‌ సంస్థ, రీడిఫ్యూజన్‌ యాడ్‌ ఏజెన్సీ, లఖ్‌నవూ యూనివర్సిటీ ‘దీపావళి పల్స్‌ రిపోర్ట్‌–2024’ నివేదికలో వెల్లడి   

సాక్షి, హైదరాబాద్‌: పండుగలకు కొన్ని రోజుల ముందునుంచే పిల్లలు, పెద్దలు తేడా లేకుండా అన్ని వయసుల వారిలో కొత్త ఉత్సాహం పుట్టుకొస్తుంది. మరీ ముఖ్యంగా దసరా, దీపావళి వంటి పెద్ద పండుగలు 2, 3 వారాల వ్యవధిలోనే వస్తున్నాయంటే ఇక ఆ ఉత్సాహమే వేరు. పండుగలను ఎలా జరుపుకోవాలో, ఏమేం వస్తువులు కొనుగోలు చేయాలో అధికశాతం మంది ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటారు. ఇక.. ఈ నెల 12న విజయదశమి, 31న దీపావళి పండుగలు రానుండటంతో కొనుగోలుదారుల సందడి చెప్పనక్కర్లేదు. దసరాకు ముందే రెండు తెలుగు రాష్ట్రాల్లో తొమ్మిది రోజుల పాటు నవరాత్రి ఉత్సవాలు జరుపుకొంటారు, తెలంగాణలో ప్రకృతిపూల ఉత్సవం ‘బతుకమ్మ’తో.. ముందే పండుగ హడావుడి మొదలైపోయింది.

 దాదాపు అన్ని రాష్ట్రాల్లో దసరా, దీపావళి పండుగలు పెద్ద ఎత్తున జరుపుకోవడం తెలిసిందే. ప్రస్తుత పండుగల సీజన్‌ నేపథ్యంలో.. మిఠాయిలు, స్నాక్స్, బంధువులు, మిత్రులకు కానుకల కొనుగోలు, ఇంటి అలంకరణ సామగ్రి, కొత్త బట్టలు, టీవీలు, ఫ్రిజ్‌లు, ఇతర ఎల్రక్టానిక్‌ పరికరాలు, వస్తువులు, కార్లు, వాహనాల కొనుగోళ్లు, ముఖ్యమైన వస్తువుల కొనుగోలుకు కొనుగోలుదారులు సిద్ధమైపోయారు. తమ ప్రాధాన్యాలు, ప్రణాళికలు, అందుబాటులో ఉన్న బడ్జెట్‌కు అనుగుణంగా ఆయా మార్కెట్లకు వెళ్లి షాపింగ్‌ చేసేందుకు ఉవి్వళ్లూరుతున్నారు. గతేడాదితో పోలి్చతే ఈ ఏడాది 36.18 శాతం వినియోగదారులు ఈ పండుగల షాపింగ్‌ కోసం అధికంగా ఖర్చు చేసేందుకు ముందుకొస్తున్నారు.

 తాజాగా.. భారత్‌ ల్యాబ్‌ సంస్థ, రీడిఫ్యూజన్‌ యాడ్‌ ఏజెన్సీ, లఖ్‌నవూ యూనివర్సిటీ జరిపిన పరిశీలన ఆధారంగా ‘దీపావళి పల్స్‌ రిపోర్ట్‌–2024’ నివేదికను విడుదల చేశారు. ప్రధానంగా ఈ పరిశీలనలో వివిధ వర్గాల వినియోగదారుల షాపింగ్‌ ట్రెండ్‌ ఏ విధంగా ఉండబోతోంది?, ఈ విషయంలో కస్టమర్ల మనోభావాలు ఏ విధంగా ఉండబోతున్నాయనే దానిపై దృష్టి కేంద్రీకరించారు. దేశవ్యాప్తంగా ఒకవైపు ద్రవ్యోల్భణ పరిస్థితులు, ధరల పెరుగుదల వంటి సమస్యలున్నా పండుగ షాపింగ్‌ విషయంలో మాత్రం వెనక్కి తగ్గేది లేదన్న అభిప్రాయం వ్యక్తమైనట్లు ఆ నివేదికలో పేర్కొన్నారు. కోవిడ్‌ మహమ్మారి నుంచి పూర్తిస్థాయిలో కోలుకున్న వాతావరణంలో సంప్రదాయ కొనుగోళ్లతో పాటు బంగారు అభరణాలు కొనేందుకు కూడా వివిధ వర్గాల్లో డిమాండ్‌ పెరుగుతున్నట్టు నివేదిక వెల్లడించింది.­

వివిధ కేటగిరీల వారీగా బడ్జెట్‌ ప్లానింగ్‌ ఇలా... 
👉  ఈ పండుగ సీజన్‌లో కొనుగోలు బడ్జెట్‌ పెంపునకు 36.18 శాతం మంది మొగ్గు 
👉35.02 శాతం మంది గతేడాది మాదిరిస్థాయిలోనే కొనుగోళ్లకు సిద్ధం. 
👉 ప్రస్తుత ధరల నేపథ్యంలో తమ బడ్జెట్‌ను కొంత తగ్గిస్తామంటున్నవారు 29.52 శాతం మంది.

పండుగ కొనుగోళ్లలో వయసుల వారీగా వివరాలు
👉  20–30 ఏళ్ల మధ్యనున్న వారిలో 85 శాతం మంది పండుగ కొనుగోళ్లు చేస్తామంటున్నారు 
👉 30–40 ఏళ్ల మధ్య వారిలో 71 శాతం.. 
👉    40–50 ఏళ్ల వయసు వారిలో 66 శాతం.. 
👉   50–60 ఏళ్ల మధ్య వయసువారిలో 57 శాతం మంది..

ఫెస్టివల్‌ షాపింగ్‌కు ఆకర్షిస్తున్న వివిధ మాధ్యమాలివి..
👉  సామాజిక మాధ్యమాలు–53.7 శాతం 
👉     ఆన్‌లైన్‌ యాడ్స్‌–50.8 శాతం 
👉     ఫ్యామిలీ, ఫ్రెండ్స్‌–43.9 శాతం 
👉     టీవీ, పత్రికా ప్రకటనలు–41.2 శాతం 
👉     ఇన్‌స్టోర్‌ ప్రమోషన్స్‌–26.3 శాతం

గతేడాది పండుగ సీజన్‌ సందర్భంగా... ‘మూడ్‌ ఆఫ్‌ భారత్‌ స్టడీ’ పేరిట ఒక అధ్యయనం నిర్వహించాం. ఐతే గతేడాదికి మించి.. ఈ ఏడాది మరింత విస్తృతస్థాయిలో, లోతైన, సమగ్ర పరిశీలన నిర్వహించాం. ఇందులో భాగంగా వివిధ కేటగిరీల వారీగా కస్టమర్లు ఏయే రకాల వస్తువుల కొనుగోలుకు ప్రణాళికలు సిద్ధం చేశారో ప్రత్యేక దృష్టి నిలిపాం. ఈ అధ్యయనంలో ఆయా వయస్కులు, ఆదాయవర్గాల వారీగా ఎలాంటి కొనుగోళ్లకు సిద్ధమౌతున్నారనే దానిపై పలు ఆసక్తికరమైన అంశాలు వెల్లడయ్యాయి.
– డాక్టర్‌ సందీప్‌ గోయల్,  చైర్మన్, రీ డిఫ్యూజన్‌

ఫ్యాషన్‌.. వ్రస్తాలదే అగ్రస్థానం
👉 86.35 శాతం మంది మారుతున్న ఫ్యాషన్‌ ట్రెండ్లకు అనుగుణంగా కొత్త దుస్తుల కొనుగోలుకు సై అంటున్నారు. వీరిలో పురుషుల సంఖ్య అధికంగా ఉండడం ఆసక్తికరం. 
👉  బంధువులు, స్నేహితులకు పండుగ కానుకలు ఇచ్చేందుకు మొగ్గు చూపుతున్నవారు 72.84 శాతం 
👉  70.83 శాతం  మంది గృహాలంకరణకు ప్రాధాన్యం ఇస్తామంటున్నారు. 
👉 ఎల్రక్టానిక్‌ వస్తువుల కొనుగోలుకు మక్కువ చూపుతున్న వారు 60.92 శాతం (ఇందులోనూ పురుషుల సంఖ్యే ఎక్కువ) 
👉సంప్రదాయబద్ధంగా బంగారం కొనుగోలుకు మొగ్గుతో పాటు బంగారం రూపంలో పెట్టుబడులకు అవకాశం ఉంటుందని భావిస్తున్నవారు 55.26 శాతం 
👉  40.74 శాతం రియల్‌ ఎస్టేట్‌లో పెట్టుబడుల్లో భాగంగా ప్లాట్లు, ఫ్లాట్ల వంటివి కొనేందుకు సుముఖత వ్యక్తం చేస్తున్నారు   

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement