
సాక్షి,యాదాద్రి భువనగిరిజిల్లా: దసరా పండుగ సొంతూళ్లలో జరుపుకునేందుకు హైదరాబాద్ వాసులు గ్రామాల బాట పట్టారు. చాలా మంది తమ సొంత కార్లలోనే ఊళ్లకు పయనమయ్యారు.
చౌటుప్పల్ మండలంలోని పంతంగి టోల్‌ప్లాజా వద్ద వాహనాలు బారులు తీరాయి. దీంతో హైదరాబాద్-విజయవాడ రూట్‌లో భారీగా ట్రాఫిక్‌జామ్ అయింది.
కిలోమీటర్ మేర వాహనాలు నిలిచిపోవడంతో ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు. మరోపక్క దసరాకు పల్లెబాట పట్టిన ప్రయాణికులతో హైదరాబాద్ నుంచి వెళ్లే రైళ్లు, బస్సులు కిటకిటలాడుతున్నాయి.
ఇదీ చదవండి: తెలంగాణలో సద్దుల బతుకమ్మ సంబరాలు
Comments
Please login to add a commentAdd a comment