
సాక్షి, హైదరాబాద్: దీపావళి పండుగ ముగిసింది. దీంతో, సిటీ నుంచి గ్రామాలకు వెళ్లినవారు తిరుగు ప్రయాణం అయ్యారు. ఈ క్రమంలో వాహనాలతో రహదారులు రద్దీగా మారాయి. హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారిపై వాహనాల రద్దీ పెరిగింది. ఫుల్ ట్రాఫిక్ జామ్ ఏర్పడటంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు.
దీపావళికి సొంతూరుకు వెళ్లిన వారు తిరిగి హైదరాబాద్‌కు వస్తుండటంతో జాతీయ రహదారి వాహనాలతో కిక్కిరిసింది. యాదాద్రి భువనగిరి జిల్లా పంతంగి టోల్‌ప్లాజా వద్ద వాహనాలు వరుసకట్టాయి. హైదరాబాద్ శివారు అబ్దుల్లాపూర్‌మెట్ నుంచి ఎల్బీనగర్ వరకు స్వల్పంగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. విజయవాడ, నల్గొండ, ఖమ్మం, నార్కట్‌పల్లి, కోదాడ, సూర్యాపేట తదితర ప్రాంతాల నుంచి వాహనాలు వస్తున్నాయి. ఇటు, కరీంనగర్, నిజామాబాద్ నుంచి కూడా భారీగా వాహనాలు వస్తుండటంతో నగర శివారులో ట్రాఫిక్ జామ్ ఏర్పడింది.