pantangi toll plaza
-
సిటీకి తిరుగు ప్రయాణం.. రోడ్లపై ఫుల్ ట్రాఫిక్ జామ్!
సాక్షి, హైదరాబాద్: దీపావళి పండుగ ముగిసింది. దీంతో, సిటీ నుంచి గ్రామాలకు వెళ్లినవారు తిరుగు ప్రయాణం అయ్యారు. ఈ క్రమంలో వాహనాలతో రహదారులు రద్దీగా మారాయి. హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారిపై వాహనాల రద్దీ పెరిగింది. ఫుల్ ట్రాఫిక్ జామ్ ఏర్పడటంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు.దీపావళికి సొంతూరుకు వెళ్లిన వారు తిరిగి హైదరాబాద్‌కు వస్తుండటంతో జాతీయ రహదారి వాహనాలతో కిక్కిరిసింది. యాదాద్రి భువనగిరి జిల్లా పంతంగి టోల్‌ప్లాజా వద్ద వాహనాలు వరుసకట్టాయి. హైదరాబాద్ శివారు అబ్దుల్లాపూర్‌మెట్ నుంచి ఎల్బీనగర్ వరకు స్వల్పంగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. విజయవాడ, నల్గొండ, ఖమ్మం, నార్కట్‌పల్లి, కోదాడ, సూర్యాపేట తదితర ప్రాంతాల నుంచి వాహనాలు వస్తున్నాయి. ఇటు, కరీంనగర్, నిజామాబాద్ నుంచి కూడా భారీగా వాహనాలు వస్తుండటంతో నగర శివారులో ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. -
దసరా ఎఫెక్ట్: పంతంగి టోల్‌ప్లాజా వద్ద ట్రాఫిక్‌జామ్
సాక్షి,యాదాద్రి భువనగిరిజిల్లా: దసరా పండుగ సొంతూళ్లలో జరుపుకునేందుకు హైదరాబాద్ వాసులు గ్రామాల బాట పట్టారు. చాలా మంది తమ సొంత కార్లలోనే ఊళ్లకు పయనమయ్యారు. చౌటుప్పల్ మండలంలోని పంతంగి టోల్‌ప్లాజా వద్ద వాహనాలు బారులు తీరాయి. దీంతో హైదరాబాద్-విజయవాడ రూట్లో భారీగా ట్రాఫిక్‌జామ్ అయింది. కిలోమీటర్ మేర వాహనాలు నిలిచిపోవడంతో ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు. మరోపక్క దసరాకు పల్లెబాట పట్టిన ప్రయాణికులతో హైదరాబాద్ నుంచి వెళ్లే రైళ్లు, బస్సులు కిటకిటలాడుతున్నాయి.ఇదీ చదవండి: తెలంగాణలో సద్దుల బతుకమ్మ సంబరాలు -
చౌటుప్పల్‌లో భారీగా ట్రాఫిక్ జాం
చౌటుప్పల్: సంక్రాంతి సెలవులు ముగిశాయి. తమ స్వగ్రామాలకు వెళ్లిన వారు అందరూ హైదరాబాద్ వంటి ప్రాంతాలకు తిరుగు పయనమయ్యారు. దీంతో వారు ప్రయాణిస్తున్న వాహనాలతో యాదాద్రి భువనగిరిజిల్లా చౌటుప్పల్ మండలంలోని పంతంగి టోల్ ప్లాజా వద్ద వాహనాల రద్దీ పెరిగింది. దీంతో చౌటుప్పల్‌లో భారీగా ట్రాఫిక్ జాం అయింది. -
సంక్రాంతి ఎఫెక్ట్.. భారీగా ట్రాఫిక్ జాం
హైదరాబాద్: సంక్రాంతి పండుగను పురస్కరించుకుని భాగ్యనగరం నుంచి గ్రామాలకు పెద్ద ఎత్తున ప్రజలు తరలివెళ్తున్నారు. దీంతో పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ జామ్ సమస్యలు తలెత్తుతున్నాయి. ముఖ్యంగా హైదరాబాద్ నుంచి ఆంధ్రప్రదేశ్ లోని పలు ప్రాంతాలకు వేల సంఖ్యలో వెళ్తున్న వాహనాలతో రద్దీ వాతావరణం కనిపిస్తోంది. దీంతో హైదరాబాద్-విజయవాడ హైవేపై నల్గొండజిల్లా చౌటుప్పల్ మండలం పంతంగి టోల్గేట్ దగ్గర భారీగా ట్రాఫిక్ జాం ఏర్పడింది. కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పన్ను చెల్లించేందుకు వాహనాలు టోల్ ప్లాజాల వద్ద ఆగడంతో రద్దీ చాలా పెరిగిపోతుందని వాహనదారులు చెబుతున్నారు. ఒకవైపు సొంత వాహనాలున్న వారు, మరోవైపు ఆర్టీసీ బస్సులు, ప్రైవేట్ వాహనాల్లో ఆంధ్ర ప్రాంతాలకు వెళ్లే వారి సంఖ్య నేడు అధికంగా ఉంది. నేడు భోగి పండుగ కాగా, రేపు (శనివారం) మకర సంక్రాంతిని కుటుంబసభ్యులతో జరుపుకోవాలని ఇళ్లకు పయనమవుతున్నారు. ఈ నేపథ్యంలో ఓవైపు నగరం ఖాళీ అవుతుంటే.. పండక్కి గ్రామాలకు వెళ్లేవారితో టోల్ ప్లాజాల వద్ద వాహనాలు బారులు తీరుతున్నాయి. -
సంక్రాంతి ఎఫెక్ట్, భారీగా ట్రాఫిక్ జాం
-
సంక్రాంతి ఎఫెక్ట్, భారీగా ట్రాఫిక్ జాం
హైదరాబాద్: హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారిపై గురువారం ఉదయం భారీగా ట్రాఫిక్ జాం అయింది. సంక్రాంతి పండగ పురస్కరించుకుని హైదరాబాద్ నగరం నుంచి ప్రజలు స్వస్థలాలకు చేరుకునేందుకు వాహనాల్లో బయలుదేరారు. హైదరాబాద్ - విజయవాడ జాతీయ రహదారి వాహనాల రాకపోకలతో మరింత రద్దీ పెరిగింది. నల్గొండ జిల్లా చౌటుప్పల్ సమీపంలోని పంతంగి టోల్ ప్లాజా వద్ద పన్ను చెల్లించేందుకు వాహనాలు నిలపడంతో భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది. దీంతో విజయవాడ నుంచి హైదరాబాద్ వైపు అలాగే హైదరాబాద్ నుంచి విజయవాడ వైపు వచ్చే వాహనాలు బారులు తీరాయి. జాతీయ రహదారిపై సుమారు రెండు కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. నకిరేకల్ సమీపంలోని కొర్లపాడు టోల్‌ప్లాజా వద్ద భారీగా వాహనాలు బారులు తీరాయి. ఆర్టీసీ బస్సులు, ప్రైవేటు వాహనాలు ప్రయాణికులతో కిక్కిరిసి పోతున్నాయి. ఈ నేపథ్యంలో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.