దేవీ నవరాత్రుల్లో అమ్మవారికి నైవేద్యం అనగానే పులిహోర, పాయసంలేదా క్షీరాన్నం గుర్తొస్తాయి. తొమ్మిది రోజుల పాటు, తొమ్మిది అవతారాల్లో జగన్మాతకు మొక్కుతారు. తొమ్మిది రకాల నైవేద్యాలతో దుర్గాదేవిని పూజిస్తారు. ఒంటిపూట మాత్రమే భోజనం చేస్తూ రెండోపూట పండ్లు, ఫలహారాలతో ఉపవాసాలు కూడా చేస్తారు. మరి ఉపవాస సమయంలో రాత్రిపూట తేలిగ్గా జీర్ణమయ్యే సగ్గుబియ్యంతో చేసుకునే కిచిడీ గురించి తెలుసుకుందాం.
సగ్గుబియ్యం ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది.సులభంగా తయారు చేసుకోవచ్చు కూడా. సగ్గుబియ్యంలో ఫైబర్, పొటాషియం, ఫాస్ఫరస్ వంటి పోషకాలు ఉంటాయి.
సగ్గుబియ్యం లేదా సాబుదానా కిచిడీకి కావాల్సిన పదార్థాలు
సగ్గుబియ్యం, ఒక కప్పు, ఒక బంగాళదుంప - పెద్దది అయితే ఒకటి, చిన్నవి రెండు
పచ్చిమిరపకాయలు నాలుగైదు,నెయ్యి , కొద్దిగా అల్లం ముక్క,ఉప్పు,
తయారీ
సగ్గుబియ్యాన్ని నీటిలో కడిగి, నీళ్లు తీసేసి మూడు గంటలు నానబెట్టాలి.
పల్లీలను వేయించి, పొట్టుతీసి, చల్లారాక కొద్దిగా ఉప్పు వేసి మిక్సీ పట్టుకోవాలి.
అలాగే బంగాళాదుంపును ఉడికించి పొట్టు తీసి చిన్న ముక్కులుగా కట్ చేసి ఉంచుకోవాలి.
ఇప్పుడు స్టవ్ మీద బాండ్లీ పెట్టి కొద్దిగి నెయ్యి వేసుకోవాలి. ఇది వేడెక్కాక జీలకర్ర, అల్లం, పచిమిర్చి, కరివేపాకు వేసి వేయించుకోవాలి. ఇపుడు ఉడికించిన ఆలూ ముక్కల్ని వేసుకోవాలి. బాగా వేగిన తరువాత ముందుగా నానబెట్టుకున్న సగ్గుబియ్యాన్ని వేయాలి. కొద్ది సేపు వేగాక, రెండు కప్పుల నీళ్లు పోసి సన్న మంట మీద ఉడకనివ్వాలి. ఇపుడు పల్లీల పౌడరు వేసి బాగా కలపాలి. ఒక్కసారి రుచి చూసుకొని కొత్తిమీర చల్లుకుంటే సరిపోతుంది.
సగ్గుబియ్యం చాట్
సగ్గుబియ్యం చాట్ తయారీకి కావాల్సిన పదార్థాలు: 1 కప్పు సగ్గుబియ్యం, ఉడికించి, తరిగిన బంగాళాదుంప ముక్కలు, టమోటా,కప్పు చట్నీ, ఫాస్టింగ్ రాక్ సాల్ట్, నల్ల మిరియాలు, వేరుశెనగలు, చీజ్ అవసరం.
తయారీ ముందుగా సగ్గుబియ్యాన్నినీటిలో గంటసేపు నానబెట్టాలి. తరువాత వేరుశెనగలను వేయించాలి. ఇప్పుడు బంగాళదుంపలను ఉడకబెట్టి చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. అన్ని పదార్థాలను ఒక గిన్నెలో వేసి పెరుగు, చట్నీ కలపండి. ఉప్పు, మసాలాలు వేసి బాగా కలపాలి. అంతే సగ్గుబియ్యం చాట్ రెడీ
Comments
Please login to add a commentAdd a comment