Sago
-
నవరాత్రుల ఉపవాసాలు : ఈజీగా, హెల్దీగా సగ్గుబియ్యం కిచిడీ
దేవీ నవరాత్రుల్లో అమ్మవారికి నైవేద్యం అనగానే పులిహోర, పాయసంలేదా క్షీరాన్నం గుర్తొస్తాయి. తొమ్మిది రోజుల పాటు, తొమ్మిది అవతారాల్లో జగన్మాతకు మొక్కుతారు. తొమ్మిది రకాల నైవేద్యాలతో దుర్గాదేవిని పూజిస్తారు. ఒంటిపూట మాత్రమే భోజనం చేస్తూ రెండోపూట పండ్లు, ఫలహారాలతో ఉపవాసాలు కూడా చేస్తారు. మరి ఉపవాస సమయంలో రాత్రిపూట తేలిగ్గా జీర్ణమయ్యే సగ్గుబియ్యంతో చేసుకునే కిచిడీ గురించి తెలుసుకుందాం.సగ్గుబియ్యం ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది.సులభంగా తయారు చేసుకోవచ్చు కూడా. సగ్గుబియ్యంలో ఫైబర్, పొటాషియం, ఫాస్ఫరస్ వంటి పోషకాలు ఉంటాయి.సగ్గుబియ్యం లేదా సాబుదానా కిచిడీకి కావాల్సిన పదార్థాలుసగ్గుబియ్యం, ఒక కప్పు, ఒక బంగాళదుంప - పెద్దది అయితే ఒకటి, చిన్నవి రెండుపచ్చిమిరపకాయలు నాలుగైదు,నెయ్యి , కొద్దిగా అల్లం ముక్క,ఉప్పు, తయారీసగ్గుబియ్యాన్ని నీటిలో కడిగి, నీళ్లు తీసేసి మూడు గంటలు నానబెట్టాలి.పల్లీలను వేయించి, పొట్టుతీసి, చల్లారాక కొద్దిగా ఉప్పు వేసి మిక్సీ పట్టుకోవాలి.అలాగే బంగాళాదుంపును ఉడికించి పొట్టు తీసి చిన్న ముక్కులుగా కట్ చేసి ఉంచుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద బాండ్లీ పెట్టి కొద్దిగి నెయ్యి వేసుకోవాలి. ఇది వేడెక్కాక జీలకర్ర, అల్లం, పచిమిర్చి, కరివేపాకు వేసి వేయించుకోవాలి. ఇపుడు ఉడికించిన ఆలూ ముక్కల్ని వేసుకోవాలి. బాగా వేగిన తరువాత ముందుగా నానబెట్టుకున్న సగ్గుబియ్యాన్ని వేయాలి. కొద్ది సేపు వేగాక, రెండు కప్పుల నీళ్లు పోసి సన్న మంట మీద ఉడకనివ్వాలి. ఇపుడు పల్లీల పౌడరు వేసి బాగా కలపాలి. ఒక్కసారి రుచి చూసుకొని కొత్తిమీర చల్లుకుంటే సరిపోతుంది. సగ్గుబియ్యం చాట్సగ్గుబియ్యం చాట్ తయారీకి కావాల్సిన పదార్థాలు: 1 కప్పు సగ్గుబియ్యం, ఉడికించి, తరిగిన బంగాళాదుంప ముక్కలు, టమోటా,కప్పు చట్నీ, ఫాస్టింగ్ రాక్ సాల్ట్, నల్ల మిరియాలు, వేరుశెనగలు, చీజ్ అవసరం.తయారీ ముందుగా సగ్గుబియ్యాన్నినీటిలో గంటసేపు నానబెట్టాలి. తరువాత వేరుశెనగలను వేయించాలి. ఇప్పుడు బంగాళదుంపలను ఉడకబెట్టి చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. అన్ని పదార్థాలను ఒక గిన్నెలో వేసి పెరుగు, చట్నీ కలపండి. ఉప్పు, మసాలాలు వేసి బాగా కలపాలి. అంతే సగ్గుబియ్యం చాట్ రెడీ -
వేసవిలో తాపం తగ్గేలా సగ్గుబియ్యంతో హల్వా చేద్దాం ఇలా!
చలికాలం... సగ్గుబియ్యం హల్వా తింటే జలుబు చేస్తోందా! అయితే... ఇదే మంచి సమయం. ఎండల్లో వండుకుందాం. సగ్గుబియ్యం చలవ చేస్తుంది... ఎండ తాపాన్ని తగ్గిస్తుంది. దహీ... కేసర్... కోవాతోపాటు పొటాటోతోనూ కలిసిపోతుంది. ఈవెనింగ్ స్నాక్ అవుతుంది...లంచ్‌లో మెయిన్ కోర్స్ అవుతుంది. భోజనం తర్వాత డెజర్ట్ గానూ సర్దుకుపోతుంది. అలాంటి సగ్గుబియ్యంతో సాబుదానా హల్వా చేద్దామిలా!. తయారీకి కావాల్సిన పదార్థాలు: సగ్గుబియ్యం– కప్పు చక్కెర – కప్పు నెయ్యి – 3 టేబుల్ స్పూన్లు ఫుడ్ కలర్– చిటికెడు ఏలకుల పొడి– అర టీ స్పూన్ జీడిపప్పు – 2 టేబుల్ స్పూన్లు కిస్మిస్ – టేబుల్ స్పూన్ పాల కోవా– 2 టేబుల్ స్పూన్లు లేదా చిక్కటి పాలు కప్పు; నీరు – 2 కప్పులు. తయారీ విధానం: సగ్గుబియ్యాన్ని కడిగి నీరు పోసి ప్రెషర్ కుక్కర్లో రెండు విజిల్స్ వచ్చే వరకు ఉడికించాలి. బాణలిలో నెయ్యి వేడి చేసి జీడిపప్పు, కిస్మిస్లను వేయించాలి. వేగిన జీడిపప్పు, కిస్మిస్ను తీసి పక్కన పెట్టి అదే బాణలిలో ఉడికిన సగ్గుబియ్యం, చక్కెర, ఫుడ్ కలర్ వేసి కలుపుతూ ఉడికించాలి. మిశ్రమం దగ్గరయ్యేటప్పుడు పాల కోవా వేసి కలపాలి. కోవా లేకపోతే పాలు పోసి, ఏలకుల పొడి వేసి దగ్గరయ్యే వరకు కలుపుతూ ఉడికించాలి. చివరగా వేయించిన జీడిపప్పు, కిస్మిస్లను వేసి కలిపితే సాబుదానా హల్వా రెడీ. (చదవండి: మసాలా ఎక్కువై కూర పాడవ్వకూడదంటే ఇలా చేయండి! టేస్ట్ అదిరిపోతుంది) -
ఇడ్లీ, దోశ బ్రేక్‌ఫాస్ట్‌లను ఇలా సరికొత్త రుచితో వండుకొని తింటే..
అప్పుడే ఎండలు మండి పోతున్నాయి. పెరిగిన ఉష్ణోగ్రతల్లో రోజూ తినే ఇడ్లీ, దోశ, వడలు అంతగా సహించవు. రుచి లేదని బ్రేక్‌ఫాస్ట్ తినకుండా ఉండలేం కాబట్టి ఇడ్లీ, దోశల తయారీలో కొన్ని కొత్త పదార్థాలను జోడించి వండితే.. రెండు తినేవారు నాలుగు తింటారు. బ్రేక్‌ఫాస్ట్‌లను సరికొత్త రుచితో ఎలా వండుకోవచ్చో చూద్దాం.. సొరకాయ దోశ కావలసినవి.. మీడియం సైజు సొరకాయ – ఒకటి, బియ్యప్పిండి – ఒకటిన్నర కప్పు, బొంబాయి రవ్వ – అరకప్పు, ఉప్పు – రుచికి సరిపడా, నీళ్లు – నాలుగు కప్పులు, ఉల్లిపాయ – ఒకటి(సన్నగా తరగాలి), పచ్చిమిర్చి – రెండు(సన్నగా తరగాలి), జీలకర్ర – టీస్పూను, కొత్తిమీర తరుగు – రెండు టేబుల్ స్పూన్లు, ఆయిల్ – దోశ వేయించడానికి సరిపడా. తయారీ: ►ముందుగా సొరకాయ తొక్క తీసి శుభ్రంగా కడగాలి. తరువాత గింజలు తీసేసి ముక్కలుగా తరగాలి. ►ముక్కలను మెత్తగా పేస్టులా చేసుకోవాలి. ►ఈ పేస్టుని ఒక పెద్దగిన్నెలో వేసి బియ్యప్పిండి, బొంబాయి రవ్వ, రుచికి సరిపడా ఉప్పు, నాలుగు కప్పుల నీళ్లుపోసి బాగా కలపాలి. ►ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి తరుగు, కొత్తిమీర, జీలకర్ర వేసి కలిపి ఇరవై నిమిషాల పాటు పక్కనపెట్టాలి. ►తరువాత వేడెక్కిన పెనం మీద కొద్దిగా ఆయిల్ చల్లుకుని దోశలా పోసుకోవాలి. ►దోశను రెండువైపుల క్రిస్పీగా కాల్చితే సొరకాయ దోశ రెడీ. చదవండి: Lassi: లేతకొబ్బరి కోరు, జీడిపప్పు, కిస్మిస్, చెర్రీలు వేసుకున్నారంటే! సగ్గుబియ్యం ఇడ్లీ కావలసినవి: సగ్గుబియ్యం – కప్పు, ఇడ్లీ రవ్వ – కప్పు, పుల్లటి పెరుగు – రెండు కప్పులు, బేకింగ్ సోడా – పావు టీస్పూను, ఉప్పు – రుచికి సరిపడా, జీడిపప్పు – 8 తయారీ: ►ముందుగా సగ్గుబియ్యం, ఇడ్లీ రవ్వలను కడగాలి. ►ఒక పెద్దగిన్నెలో సగ్గుబియ్యం, ఇడ్లీ రవ్వ, పెరుగు పేసి కలపాలి. ►ఈ మిశ్రమంలో రెండు కప్పులు నీళ్లుపోసి కలిపి రాత్రంతా నానబెట్టుకోవాలి. సమయం లేనప్పుడు కనీసం ఎనిమిది గంటలైనా నానబెట్టాలి. ►నానిన పిండికి రుచికి సరిపడా ఉప్పు, బేకింగ్ సోడా వేసి కలపాలి. ►ఇడ్లీ ప్లేటుకు కాస్త ఆయిల్ రాసి జీడిపప్పులు వేసి, వీటిపైన పిండిని వేయాలి. సిమ్‌లో పదిహేను నిమిషాలు ఉడికిస్తే సగ్గుబియ్యం ఇడ్లీ రెడీ. ఏ చట్నీతోనైనా ఈ ఇడ్లీ చాలా బావుంటుంది. -
సగ్గు బియ్యం పరాఠా.. ఈజీగా చేసేస్తారా!
వానలు పడుతుంటే వేడివేడిగా కరకరలాడే పదార్థాలు తినాలనిపిస్తుంది జిహ్వకు.. ఎప్పుడూ నూనెలో వేయించి తినాలంటే కొంచెం ఇబ్బందే.. తక్కువ నూనెతో కరకరలాడే సగ్గు బియ్యం వంటకాలు చేసుకుని... వాన బిందువులను చూస్తూ, తియ్యటి గుండ్రటి సగ్గు బియ్యం బిందువుల వంటకాలు ఆస్వాదిద్దాం.. పరాఠా కావలసినవి: సగ్గు బియ్యం – ఒక కప్పు; పల్లీలు – అర కప్పు; నీళ్లు – ఒక కప్పు; పచ్చి మిర్చి – 2; వెల్లుల్లి రెబ్బలు – 4; ఉడికించిన బంగాళ దుంపలు – 2; కొత్తిమీర – ఒక టీ స్పూను; జీలకర్ర – ఒక టీ స్పూను; ఎండు మిర్చి – 2; ఉప్పు – తగినంత; నూనె/నెయ్యి – తగినంత తయారీ: ►ఒక పాత్రలో సగ్గు బియ్యం వేసి రెండుమూడు సార్లు బాగా కడిగి, నీరు వంపేయాలి ►స్టౌ మీద బాణలిలో పల్లీలు వేసి బాగా వేయించి చల్లార్చాలి ►మిక్సీ జార్లో పల్లీలు, పచ్చి మిర్చి, వెల్లుల్లి వేసి బరకగా మిక్సీ పట్టి, సగ్గు బియ్యానికి జత చేయాలి ►ఉడికించిన బంగాళ దుంపలను తురుముతూ జత చేయాలి ►కొత్తిమీర, జీలకర్ర, ఎండు మిర్చి లేదా మిరప కారం, ఉప్పు జత చేసి బాగా కలపాలి ►పాలిథిన్ కవర్ మీద కానీ, బటర్ పేపర్ మీద కానీ కొద్దిగా నూనె పూయాలి ►తయారుచేసి ఉంచుకున్న మిశ్రమాన్ని కొద్దిగా తీసుకుని, గుండ్రంగా రొట్టెలా ఒత్తాలి ►స్టౌ మీద పెనం వేడయ్యాక కొద్దిగా నూనె వేసి తయారుచేసి ఉంచుకున్న పరాఠాను వేసి నాలుగు నిమిషాల పాటు మీడియం మంట మీద కాలాక, రెండో వైపు తిప్పి, అటు వైపు కూడా మూడు నాలుగు నిమిషాలు కాల్చాక, ప్లేట్లోకి తీసుకోవాలి ►పెరుగు చట్నీతో తింటే రుచిగా ఉంటాయి. ఢోక్లా కావలసినవి: సగ్గు బియ్యం – ఒక కప్పు (నానబెట్టాలి); సామలు – ఒక కప్పు; పెరుగు – ఒక కప్పు; నూనె – ఒక టేబుల్ స్పూను; ఆవాలు – ఒక టీ స్పూను; పచ్చి మిర్చి తరుగు – ఒక టీ స్పూను; ఇంగువ – చిటికెడు; కరివేపాకు – 2 రెమ్మలు; మసాలా కారం – ఒక టీ స్పూను; (మిరప కారం, జీలకర్ర పొడి, నల్ల ఉప్పు, చిటికెడు ఉప్పు, చిటికెడు మిరియాల పొడి కలిపితే మసాలా కారం) తయారీ: ► మిక్సీలో సగ్గు బియ్యం, సామలు, పెరుగు వేసి మెత్తగా చేయాలి ► ఉప్పు జత చేసి దోసెల పిండిలా అయ్యేలా కలపాలి ► స్టౌ మీద కుకర్‌లో నీళ్లు పోసి మరిగించాలి ► ఈ లోగా ఒక స్టీల్ ప్లేట్‌కి నూనె పూసి, మసాలా కారం చిలకరించాలి ► తయారు చేసి ఉంచుకున్న పిండిని సగం వేసి సమానంగా పరిచి, మరుగుతున్న నీళ్ల మీద ఒక ప్లేట్ ఉంచి, ఆ పైన ఈ ప్లేట్ ఉంచి, పైన పల్చటి వస్త్రం కప్పి, ఆ పైన మూత ఉంచాలి ► 20 నిమిషాల తరవాత మంట ఆపి, మూత తీయాలి ∙ఇదే విధంగా మిగతా సగ భాగం కూడా తయారు చేయాలి ► బాగా చల్లారాక ఒక ప్లేట్ లోకి ఆ ప్లేట్‌ను బోర్లించి జాగ్రత్తగా వేరు చేసి, ఆ పైన గ్రీన్ చట్నీ వేసి, ఆ పైన రెండో పొర ఉంచాలి ►స్టౌ మీద బాణలిలో రెండు స్పూన్ల నూనె వేసి కాగాక, ఆవాలు, పచ్చి మిర్చి తరుగు, ఇంగువ వేసి వేయించి దింపేయాలి ►కరివేపాకు జత చేసి, బాగా కలిపి, ఢోక్లా మీద సమానంగా పోసి, నలు చదరంగా కట్ చేయాలి. (గ్రీన్ చట్నీ: మిక్సీలో పుదీనా, కొత్తిమీర, పచ్చి మిర్చి, ఉప్పు, నల్ల ఉప్పు, కొద్దిగా నీళ్లు వేసి మెత్తగా చేసి, ఒక గిన్నెలోకి తీసుకోవాలి ►నిమ్మ రసం జత చేసి బాగా కలిపితే గ్రీన్ చట్నీ సిద్ధమవుతుంది) పొంగనాలు కావలసినవి: సగ్గు బియ్యం–ఒక కప్పు; ఉడికించిన బంగాళ దుంపలు – 2; కొత్తిమీర తరుగు – ఒక టేబుల్ స్పూను; పచ్చి మిర్చి తరుగు – ఒక టీ స్పూను; అల్లం తురుము – ఒక టీ స్పూను; జీలకర్ర – ఒక టీ స్పూను; ఉప్పు – తగినంత; నూనె – తగినంత తయారీ: ►స్టౌ మీద బాణలిలో నూనె లేకుండా సగ్గు బియ్యాన్ని రెండు నిమిషాలు ఆపకుండా కలుపుతూ వేయించాలి (తడి పోయి పొడి చేయడానికి వీలుగా ఉంటుంది) ∙ప్లేట్లో పోసి చల్లారాక మిక్సీలో వేసి మెత్తగా పొడి చేయాలి ►ఒక పాత్రలో సగ్గు బియ్యం పిండికి కొద్దికొద్దిగా నీళ్లు పోస్తూ, దోసెల పిండి కంటె కొద్దిగా గట్టిగా కలపాలి ►ఒక పాత్రలో బంగాళదుంపలు వేసి మెత్తగా చేయాలి ►సగ్గు బియ్యం పిండి జత చేసి కలపాలి ►కొత్తిమీర తరుగు, పచ్చి మిర్చి తరుగు జత చేసి మరోమారు కలపాలి ►అల్లం తురుము, జీలకర్ర, ఉప్పు జత చేసి మరోమారు బాగా కలపాలి ►కొద్దిగా నీళ్లు జత చేసి దోసెల పిండిలా అయ్యేలా కలిపి మూత ఉంచి, సుమారు అర గంట సేపు నానబెట్టాలి ►స్టౌ మీద పొంగనాల స్టాండ్ ఉంచి, నూనె పూసి, ఒక్కో గుంటలోను తగినంత పిండి వేసి, మూత ఉంచాలి ►మీడియం మంట మీద సుమారు పది నిమిషాలు ఉంచాక, పొంగనాలను తిరగేసి, మరో ఐదు నిమిషాలు ఉంచి తీసేయాలి.