
దసరా పండగకు కొత్త బట్టలు కొనుక్కోవడం, అమ్మ చేసిన రకరకాల పిండివంటలు తినడం, సెలవలకు ఊళ్లకెళ్లడం అందరికీ తెలుసు. అయితే అంతకన్నా ముందు అసలు దసరా పండగకు ఆ పేరు ఎందుకు వచ్చిందో కూడా తెలుసుకోవాలి కదా... అక్కడికే వద్దాం... దశ అహః అంటే పది రోజులు అని అర్థం. దశ అహః అనే పదమే దశహర అయింది. దశహర, పది రోజులు అనే పదం కాలక్రమంలో ‘దసరా’ గా మారింది. దసరా అంటే పది జన్మల పాపాలను, పది రకాలైన పాపాలను పోగొట్టేది అనే అర్థం కూడా వ్యాప్తిలో ఉంది.
దుష్టరాక్షసులయిన రావణ కుంభకర్ణమేఘనాథులను సంహరించినందుకు గుర్తుగా కొన్ని ప్రాంతాలలో వారి దిష్టిబొమ్మలను తయారు చేసి టపాసులతో పేల్చేయడమో లేదా దహనం చేయడమో ఒక ఉత్సవంగా నిర్వహిస్తారు దసరా అంటే దక్షిణాదిన అమ్మవారి పూజకు ఎంత ప్రాధాన్యం ఇస్తారో, ఉత్తరాదిన రాముని లీలలను గానం చేసేందుకు అంతే ఉత్సాహం చూపుతారు.
వారి దృష్టిలో దసరా అంటే అమ్మవారు మహిషాసురుని సంహరించిన రోజు మాత్రమే కాదు, రాముడు, రావణుని చంపిన రోజు కూడా. అందుకే ఈ పది రోజుల పాటు అక్కడ రామాయణంలో ఘట్టాలను వర్ణిస్తూ.. చివరి రోజున ‘రావణ దహన్’ పేరుతో రావణుడి భారీ దిష్టిబొమ్మను దహనం చేస్తారు. దాదాపు 50 ఏళ్ల నుంచి ఈ ఉత్సవాలు జరుగుతున్నాయి. ఏటా ఈ వేడుకలు అట్టహాసంగా సాగుతాయి. ఈ వేడుకలను ప్రత్యక్షంగా చూడటానికి వేలాది భక్తులతో పాటు రాజకీయ, సినీ, పారిశ్రామిక రంగాలకు చెందిన ప్రముఖులు కూడా తరలివస్తారు.
సమయం, వ్యక్తిగత కారణాల రీత్యా కొంత మందికి రామ్‌లీలా మైదానంలో జరిగే వేడుకలను వీక్షించడం కుదరదు. చాలా మందికి ఈ వేడుకల విశిష్టత కూడా తెలియదు. ఈ నేపథ్యంలో ప్రసిద్ధ రెలీజియస్ యాప్ ‘హౌస్ ఆఫ్ గాడ్’ సరికొత్త ఆలోచనతో ముందుకొచ్చింది. రామ్‌లీలా మైదానంలో వేడుకలను ఈ యాప్ ద్వారా లైవ్ స్ట్రీమింగ్ అందించనుంది.