
దేవీశరన్నవరాత్రి, దసరా ఉత్సవాల్లో భాగంగా.. కూరత్తాళ్వార్ వంశానికి చెందిన వేదవ్యాస భట్టార్లు గురువారం తమ ఇళ్లల్లో తమిళ సంస్కృతిలో శ్రీవారి బొమ్మల కొలువు ఏర్పాటు చేశారు. తమిళనాడులోని శ్రీరంగం, తిరుచురాపల్లికి చెందిన కూరత్తాళ్వార్ వంశానికి చెందిన వేదవ్యాస భట్టార్లు ఇనుగుర్తి మండలం కోమటిపల్లి గ్రామానికి వచ్చి స్థిరపడ్డారు.
తమ ఇళ్లల్లో వివిధ రూపాల్లో విష్ణుమూర్తుల విగ్రహాలను ఏర్పాటు చేసి నవరాత్రి వేడుకలను జరుపుకోవడం ఆనవాయితీ అని వారు తెలిపారు. – కేసముద్రం