రాబోయే పండుగలను.. శరదృతువు సీజన్‌ను దృష్టిలో ఉంచుకుని చాలామంది కొత్త ప్రదేశాలను సందర్శించాలనుకుంటారు. ఈ తరుణంలో అమెరికాకు చెందిన వెకేషన్ రెంటల్ కంపెనీ 'ఎయిర్‌బీఎన్‌బీ' (Airbnb) భారతీయ ప్రయాణికుల కోసం ప్రత్యేక ప్రయాణ అనుభవాలను అందించడానికి టాప్ ట్రెండింగ్ ప్రదేశాలను వెల్లడించింది. ఇందులో కాన్పూర్, లక్షద్వీప్, ఉజ్జయిని వంటివి ఉన్నాయి.
కాన్పూర్‌లో దసరా ఉత్సవాలను ఆడంబరంగా నిర్వహిస్తారు. ఉష్ణమండల ఆకర్షణకు ప్రసిద్ధి చెందిన లక్షద్వీప్ కూడా పర్యాటకానికి అనుకూలంగా ఉంటుంది. ఇక ఉజ్జయినిలో ఆధ్యాత్మిక శోభను చూడవచ్చు. ఇవన్నీ సహజ సౌందర్యమైన సాంస్కృతిని.. వాటి ప్రాముఖ్యతను తెలియజేసే గమ్యస్థానాలు.
అంతర్జాతీయ ప్రదేశాల కోసం అన్వేషించేవారికి టోక్యో, అమాల్ఫీ, బాకు వంటివి చెప్పుకోదగ్గవి. టోక్యోలోని పార్కులు సందర్శకులను ఎంతగానో ఆకట్టుకుంటాయి. అమాల్ఫీ తీరం పర్యాటకులకు ప్రశాంతమైన వాతావరణం అందిస్తాయి. బాకు ప్రాంతం వాస్తుశిల్పం, గొప్ప చరిత్రను తెలియజేస్తాయి. భారతీయ పర్యాటకులు మంచి ప్రదేశాలను సందర్శించాలనుకున్నప్పుడు ఇవన్నీ మరుపురాని మధురమైన అనుభూతులను అందిస్తాయి.
ఓ వైపు పండుగ సీజన్, మరోవైపు శరదృతువు.. ఈ సమయంలో భారతీయులు దేశీయ, అంతర్జాతీయ పర్యాటక ప్రదేశాలను సందర్శించాలనుకుంటారు. అలాంటి ఈ ప్రదేశాలు చాలా అనుకూలంగా ఉంటాయని ఎయిర్‌బీఎన్‌బీ జనరల్ మేనేజర్ 'అమన్‌ప్రీత్ బజాజ్' పేర్కొన్నారు.
ప్రపంచ పర్యాటక దినోత్సవం (సెప్టెంబర్ 27) సమీపిస్తోంది. ఈ ఏడాది వరల్డ్ టూరిజం డే థీమ్ "పర్యాటకం మరియు శాంతి". దీని అర్థం ఏమిటంటే ప్రపంచ దేశాల మధ్య శాంతి, సంస్కృతుల మీద అవగాహన కల్పించడం. పర్యాటకులు విభిన్న ప్రకృతి దృశ్యాలను.. మెరుగైన అనుభవాలను అన్వేషించడానికి టూరిజం ఎంతో ఉపయోగపడుతుంది.
Comments
Please login to add a commentAdd a comment