న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా దసరా సందడి నెలకొంది. ఈ నవరాత్రుల వేడుకల్లో దాండియాకు ఎంతో ప్రాధాన్యత ఉంది. దాండియా అనేది గుజరాత్ సంప్రదాయ నృత్యం. అయితే ఇప్పుడు దేశమంతటా దాండియాకు ఎంతో ఆదరణ లభిస్తోంది. దేశంలోని ఆ ఐదు ప్రాంతాల్లో జరిగే దాండియా వేడుకల్లో పాల్గొనాలని చాలామంది తహతహలాడుతుంటారు. మరి ఆ ప్రాంతాలెక్కడున్నాయి? అక్కడ వేడుకల్లో పాల్గొనాలంటే ఎంత రుసుము చెల్లించాలనే వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
అహ్మదాబాద్ (గుజరాత్)
గుజరాత్‌లోని పలు నగరాల్లో దాండియా వేడుకలు జరుగుతాయి. అయితే అహ్మదాబాద్‌లోని పసిఫిక్ మాల్‌లో జరిగే దాండియా నైట్‌కు ఎంతో ఆదరణ ఉంది. బుక్ మై షో తెలిపిన వివరాల ప్రకారం ఇక్కడ జరిగే దాండియా వేడుకల్లో పాల్గొనాలంటే రూ.399 చెల్లించాల్సి ఉంటుంది.
వడోదర (గుజరాత్)
వడోదరలో నిర్వహించే దాండియా నైట్‌కు దేశవ్యాప్తంగా గుర్తింపు ఉంది. ఇక్కడ దాండియా టిక్కెట్ల ధరలు రూ.400 నుండి రూ.500 వరకు ఉంటాయి. కొన్నిచోట్ల టిక్కెట్ ధర రూ. రెండువేలకు పైగానే ఉంటుంది.
థానే (మహారాష్ట్ర)
దాండియా వేడుకలు థానేలోని ఆక్ట్రాయ్ మైదానంలో జరుగుతుంటాయి. దేశవ్యాప్తంగా ఇక్కడి దాండియాకు గుర్తింపు ఉంది. దాండియా వేడుకలు చూసేందుకు సుదూర ప్రాంతాల నుంచి ఇక్కడికి తరలి వస్తుంటారు. ఈ ఈవెంట్‌లో పాల్గొనాలంటే ఒక్కొక్కరికి టిక్కెట్టు ధర రూ.300.
ఢిల్లీ
ఢిల్లీలోని రాజ్‌వాడ ప్యాలెస్‌లో దాండియా నైట్ నిర్వహిస్తారు. ఇక్కడ దాండియా ప్లేస్ 22,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉంది. ఈ ఎయిర్ కండిషన్డ్ ఏరియాలో దాండియా ఆడేందుకు సకల ఏర్పాట్లు చేశారు. ఇక్కడ జరిగే దాండియాలో పాల్గొనేవారు రూ.600 చెల్లించాల్సి ఉంటుంది.
బెంగళూరు
బెంగుళూరులోని ఎలక్ట్రానిక్ సిటీలోనూ అత్యంత వేడుకగా దాండియా నైట్ నిర్వహిస్తారు. జేపీ నగర్‌లో జరిగే ఈ ఈవెంట్‌కు వెళ్లాలంటే ఆన్‌లైన్‌లో టిక్కెట్లు బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. టిక్కెట్ ధర రూ. 100 వరకూ ఉంటుంది.
ఇది కూడా చదవండి: అయోధ్యలో నవరాత్రి వేడుకలు.. మారిన దర్శన, హారతి సమయాలు
Comments
Please login to add a commentAdd a comment