కూల్ వెదర్.. హాట్ బ్యూటీ | Cool weather .. Hot Beauty | Sakshi
Sakshi News home page

కూల్ వెదర్.. హాట్ బ్యూటీ

Published Thu, Dec 11 2014 11:46 PM | Last Updated on Sat, Sep 2 2017 6:00 PM

కూల్ వెదర్.. హాట్ బ్యూటీ

కూల్ వెదర్.. హాట్ బ్యూటీ

‘చలికాలం కదూ... స్కిన్ కేర్ విషయంలో జాగ్రత్తగా ఉంటాను. మాయిశ్చరైజర్స్ బాగా యూజ్ చేస్తాను’ అంటూ చెప్పింది అప్‌కమింగ్ అందాల తార నిఖితా నారాయణ్. గచ్చిబౌలిలోని విప్రోలేక్ సమీపంలో గురువారం బార్బెక్యూ నేషన్ రెస్టారెంట్ ప్రారంభోత్సవంలో మరో నటి సుచిత్రాఆనందన్‌తో మెరిసిన నిఖిత... చలికాలంలో పాటించాల్సిన టిప్స్‌ని ‘సిటీ ప్లస్’తో పంచుకుంది. సిటీలో వెదర్ బాగా కూల్‌గా ఉందంటూ... ఇలాంటి సీజన్‌లో చాలా మంది నీళ్లు తాగడం మానేస్తారని, అయితే అది సరికాదంది.
 
 నీళ్లు సరిపడనంత తాగకపోతే అది స్కిన్‌పై ప్రభావం చూపుతుందని చెప్పింది. చల్లని వెదర్‌లో హాట్ కాఫీ తాగుతుంటే ఆ మజాయే వేరంటున్న ఈ కన్నడ సుందరి... వైన్‌లూ, విస్కీలకు తాను చాలా దూరం అంది. వైన్ టేస్ట్ చేయవచ్చని ఇంట్లోవాళ్లే ప్రోత్సహించినా... తనకు ఆ టేస్ట్ నచ్చలేదంది. పైగా తనలాంటి లో బీపీ పేషెంట్స్‌కి అవి న ప్పవు కూడా అంటూ నవ్వేసింది. మన సంప్రదాయ ఆహారంలోనే సీజనల్ సమస్యలకు సమాధానాలు లభిస్తాయని, ఈ సీజన్‌లో ఇంటి వంటకాల్లో పెప్పర్ వంటివి విరివిగా వినియోగిస్తారని మీకు తెలుసు కదా అంటూ ఉదహరించింది.
 
 గ్రిల్డ్ ఫుడ్ అంటే ఎంతో ఇష్టమన్న నిఖిత... బార్బెక్యూ గచ్చిబౌలిలో ప్రారంభించడంతో తను ఉంటున్న చోటుకి అది చాలా దగ్గరగా ఉందంటూ సరదా పడిపోయింది. బాయ్‌ఫ్రెండ్ గురించి అడిగితే... ఇండస్ట్రీకి వచ్చి రెండేళ్లే అయిందనీ, అప్పుడే అలాంటివి అడిగితే ఎలా? అని చిన్నబుచ్చుకుంది. అంతకీ కావాలంటే మీరే ఎవరితోనైనా ముడిపెట్టేయండంటూ చమత్కరించిందీ మాజీ మిస్ హైదరాబాద్.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement