ముఖం తేటగా, ఆరోగ్యంగా, ప్రసన్నంగా ఉండాలని అందరూ కోరుకుంటారు. దానికి పాటించాల్సిన కొన్ని తేలికపాటి సూచనలివి.
ఆహారపరంగా...
►రోజు క్రమం తప్పకుండా అన్ని రకాల పోషకాలు అందేలా సమతులహారాన్ని నియమిత వేళలకు తీసుకుంటూ ఉండాలి. అందులో ఆకుకూరలు, కూరగాయలూ, మునగకాడల వంటి తాజా కూరలను ఎక్కువగా తీసుకోవాలి.
►ఏ సీజన్‌లో దొరికే పండ్లను ఆ సీజన్‌లో తీసుకుంటూ ఉండాలి.
►డ్రైఫ్రూట్స్ పరిమితంగా తీసుకుంటూ ఉండాలి. అందులో జీడిపప్పు వంటి కొవ్వులు ఎక్కువగా ఉండే నట్స్ కంటే బాదం పప్పు వంటి కొవ్వులు తక్కువగా ఉండే నట్స్‌ను రోజూ నాలుగు పలుకులు తినడం మంచి ఫలితాలను ఇస్తుంది.
►రోజూ కనీసం నాలుగు లీటర్లకు తగ్గకుండా నీళ్లు తాగాలి.
ఇతరత్రా జాగ్రత్తలు...
►తీక్షణమైన ఎండ/ చలి/ మంచు లేదా పొగ వంటి కాలుష్య ప్రభావాలకు ముఖం నేరుగా గురికాకూడదు.
►తేలికపాటి వ్యాయామం వల్ల ముఖానికి తగినంత రక్తప్రసరణ జరిగి ముఖం తేటగా మారుతుంది.
►ప్రతిరోజూ ప్రాణాయాయం / ధ్యానం వంటివి చేస్తూ ఉంటే ఆందోళన, మానసిక ఒత్తిడులు దూరమవుతాయి. దాంతో ముఖం ప్రశాంతంగా, ప్రనన్నతతో కనిపిస్తుంది. ప్రస్ఫుటమవుతాయి.
►రోజుకి కనీసం ఆరు నుంచి ఎనిమిది గంటలు నిద్రపోవడం వల్ల మర్నాడు ముఖం తేటగా కనపడుతుంది. రాత్రి జాగరణ వల్ల తీవ్రమైన అలసట, నిస్సత్తువలతో ముఖం కళాకాంతులు కోల్పోతుంది.
స్నానం... మేకప్...
ఇక చర్మానికి హాని కలిగించే గాఢమైన రసాయనాలు ఉండే సబ్బులు, షాంపూలకు బదులు దానికి మైల్డ్ సోప్ వాడటం మేలు. సాధ్యమైనంత వరకు క్రీములు వంటివి వాడకపోవడమే మంచిది. మహిళల విషయంలోనూ తేలికపాటి మేకప్‌తోనే మంచి ఫలితం ఉంటుంది.
Comments
Please login to add a commentAdd a comment