చర్మం నిగారింపును అందరూ కోరుకుంటారు. అందుకు సౌందర్య ఉత్పత్తుల వాడకం, ఫేషియల్స్, స్కిన్ ట్రీట్‌మెంట్లు చేయించుకుంటూ ఉంటారు. ఈ విషయాల్లో సరైన అవగాహన లేక ఉపయోగించే పద్ధతులు ఒక్కోసారి రివర్స్ అవుతుంటాయి. ముఖ్యంగా.. మొటిమలు/యాక్నే సమస్య ఉన్నవారు పార్లర్‌లో ఫేషియల్స్ చేయించుకుంటారు. మళ్లీ ఇంట్లో కొన్ని రకాల మసాజ్‌లు చేస్తుంటారు. వీటివల్ల సమస్య మరింత పెరుగుతుంది. నిపుణుల ఆధ్వర్యంలో కెమికల్ పీల్ చేయించుకుంటారు. కానీ, ట్రీట్‌మెంట్‌కి ముందు–తర్వాత వాడే ప్రొడక్ట్స్ విషయంలో జాగ్రత్తలు తీసుకోరు. దీనివల్ల సాధారణంగా ఉండే సమస్య మరింత పెరిగి, చర్మం దెబ్బతింటుంది.
మచ్చలు తగ్గాలంటే..
నలుపు/తెలుపు మచ్చలు కనిపించినప్పుడు మొదట సొంతంగా హోమ్ రెమిడీస్ చేస్తుంటారు. వీటి వల్ల కొన్ని రివర్స్ అవుతుంటాయి. దీర్ఘకాలపు సమస్యగా కూడా మారుతుంటాయి. క్రీములు, మెడిసిన్స్.. సమస్య మొదట్లోనే గుర్తించి, వాడితే చర్మ ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు.
లేజర్ చికిత్స
మచ్చలకు, కొన్ని రకాల చర్మ సమస్యలకు లేజర్ చికిత్స అవసరం అవుతుంటుంది. చికిత్స తర్వాత సరైన క్రీములను ఉపయోగించకపోతే చర్మం పొడిబారుతుంది. కొత్త మచ్చలు కూడా పుట్టుకు వస్తుంటాయి.
ఇదీ చదవండి: ఫోర్బ్స్'అత్యంత శక్తివంతమైన మహిళల' జాబితా : మరోసారి నిర్మలా సీతారామన్
ప్రొడక్ట్స్ .. అలెర్జీలు
ఆహారం పడకపోతే ఎలాంటి సమస్యలు వస్తాయో సరైనది ప్రొడక్ట్ ఉపయోగించక పోతే చర్మానికి అలాంటి అలెర్జీలు ఉత్పన్నం అవుతుంటాయి. అందుకే, ఏదైనా కొత్త ప్రొడక్ట్ వాడాలనుకున్నప్పుడు ముందుగా చర్మంపై టెస్ట్ ప్యాచ్ చేసుకోవాలి. చలికాలం పొడి చర్మం గలవారికి స్కిన్ అలెర్జీ ఎక్కువ ఉంటుంది. క్రీములు, నూనెల వాడకంలో మరికొంత జాగ్రత్త తీసుకోవాలి.
చర్మం నిగారింపు, హెయిర్ సాఫ్ట్‌నెస్ కోసం పర్మనెంట్ గ్లో వంటి చికిత్సల వైపు మొగ్గుచూపుతుంటారు. కానీ, శాశ్వత పరిష్కారం అంటూ ఉండదు. సమస్య ఉత్పన్నం కాకుండా తీసుకునే ఆహారం, పానీయాలు, తమ శరీర తత్త్వానికి ఉపయోగపడే క్రీములను వాడుతూ ఉండాలి.
– డా.స్వప్నప్రియ, డెర్మటాలజిస్ట్
Comments
Please login to add a commentAdd a comment