![Beauty Tips For Skin Glow - Sakshi](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2022/04/15/Untitled-2_1.jpg.webp?itok=Ptgznrs7)
కప్పు శనగపిండిలో, పావు కప్పు పచ్చిపాలు, ఐదు టేబుల్ స్పూన్ల కల్లుప్పు, రెండు టీస్పూన్ల ఆలివ్ ఆయిల్, రెండు టేబుల్ స్పూన్ల అలోవెర జెల్ వేసి బాగా కలపాలి.
స్నానం చేసే ముందు ఈ మిశ్రమాన్ని ముఖానికి, శరీరానికి రాసుకుని ఐదు నిమిషాల పాటు మర్దన చేయాలి.
తర్వాత గోరు వెచ్చని నీటితో స్నానం చేయాలి. శుభ్రంగా తడి తుడుచుకుని మాయిశ్చరైజర్ రాసుకుంటే చర్మంపై పేరుకుపోయిన మురికి, జిడ్డు వదిలి చర్మం కోమలంగా మారుతుంది.
ఈ మిశ్రమాన్ని సబ్బుకు బదులుగా వాడుకోవడం వల్ల చర్మం సహజ సిద్ధమైన నిగారింపుని సంతరించుకుంటుంది.
Comments
Please login to add a commentAdd a comment