
ఒక లీటరు నీటిలో మల్లె, జాజి వంటి పూలకు లేదా గులాబీ రెక్కలను వేసి మరిగించి చల్లారిన తర్వాత స్నానం చేసే నీటిలో కలుపుకోవాలి. ఇలా చేయడం వల్ల రోజంతా తాజాగా, హాయిగా, ఆహ్లాదంగా అనిపిస్తుంది. ఇది నాచురల్ డియోడరెంట్‌గా పనిచేస్తుంది.
తాజా పూలు సాధ్యం కానప్పుడు ఈ పూల తాలూకు సువాసనతోకూడిన ఎసెన్షియల్ ఆయిల్ వాడవచ్చు. స్నానం చేసే నీటిలో రెండు చుక్కల ఎసెన్షియల్ ఆయిల్ వేస్తే సరిపోతుంది. ఈ ఆయిల్స్ వాడేటప్పుడు ముందుగా అర మగ్గు నీటిలో ఆయిల్ వేసి బాగా కలిసిన తర్వాత ఆ మిశ్రమాన్ని మొత్తం నీటిలో పోయాలి.
Comments
Please login to add a commentAdd a comment