మొటిమలు, వాటి వల్ల ఏర్పడే మచ్చలు ముఖ సౌందర్యాన్ని దెబ్బతీస్తుంటాయి. ముఖ్యంగా టీనేజ్‌లో ఈ సమస్య తీవ్రంగా ఉంటుంది. చిత్రంలోని ‘సోలావేవ్ లైట్ థెరపీ డివైస్’ ముఖంపై పేరుకున్న జిడ్డును, మొటిమలను, వాటి కారణంగా కలిగిన మచ్చలను ఇట్టే తొలగిస్తుంది. అంతేకాకుండా బ్లాక్ హెడ్స్, వైట్ హెడ్స్ వంటి సమస్యలను తగ్గిస్తుంది.
ఈ డివైస్.. చర్మానికి పూర్తిగా సురక్షితమైనది. బ్లూ కలర్ లేదా రెడ్ కలర్ అనే రెండు ఆప్షన్స్‌తో ఇది ఏమాత్రం నొప్పి లేకుండా చికిత్స అందిస్తుంది. దీన్ని సుమారు తొమ్మిదిసార్లు వినియోగిస్తే, 90 శాతం వరకు ఫలితం కనిపిస్తుంది.
దీన్ని ఉపయోగించడం చాలా తేలిక. పరికరాన్ని ఆఫ్ చేయాలన్నా, ఆఫ్ చేయాలన్నా ముందున్న బటన్‌ని ఒక సెకను పాటు ప్రెస్ చేసి ఉంచితే సరిపోతుంది. ఈ మెషిన్‌ని సుమారు 3 నిమిషాలు ఆన్ చేసి, ఆప్షన్ ఎంపిక చేసుకుని, సమస్య ఉన్న ప్రదేశంలో ఉంచితే సరిపోతుంది. నిజానికి ఈ డివైస్ ప్రతి మూడు నిమిషాలకొకసారి ఆటోమేటిక్‌గా ఆఫ్ అవుతుంది.
ఇది వేలెడంత పొడవుతో చేతిలో ఇమిడేంత చిన్నగా ఉంటుంది. దాంతో దీన్ని పట్టుకోవడం, ఇతర ప్రదేశాలకు తీసుకుని వెళ్లడం చాలా సులభం. ముందుగా క్లీనింగ్ జెల్‌ని అవసరం అయిన చోట అప్లై చేసుకుని, మొటిమలు లేదా మచ్చలున్న భాగంలో ఈ డివైస్ హెడ్‌ని ఆనించి ఉంచితే ట్రీట్‌మెంట్ నడుస్తుంది. ఇది బ్యాటరీ సాయంతో పని చేస్తుంది. దీని ధర 69 డాలర్లు (రూ.5,825). ఇలాంటి డివైస్‌లకు ఆన్‌లైన్‌లో మంచి డిమాండ్ ఉంది. ముందే వినియోగదారుల రివ్యూస్ ఫాలో అయ్యి ఆర్డర్ చేసుకోవడం ఉత్తమం.
(చదవండి: ఏంటిది.. చేపకు ఆపరేషన్ చేశారా..!)
Comments
Please login to add a commentAdd a comment