ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా చర్మసంరక్షణ కష్టంగా మారుతోందా? మార్కెట్‌లో దొరికే లోషన్స్, ఫేస్‌క్రీమ్స్ రాసుకుంటున్నా సమస్య తాత్కాలికంగానే అనిపిస్తోందా? అయితే సహజసిద్ధమైన చిట్కాలని ప్రయత్నించి చూడండి. కచ్చితంగా పరిష్కారం దొరుకుతుంది. స్క్రబ్, క్లీనప్ చేసుకుంటే జిడ్డు, మృతకణాలు వంటివి పూర్తిగా తొలగిపోతాయి. ఆవిరి పట్టించడం వల్ల ముఖం కాంతివంతంగా మారుతుంది. ఇక ఫేస్‌ప్యాక్ వేçసుకోవడం వల్ల చర్మం మృదువుగా మారి మచ్చలు, మొటిమలు తగ్గుతాయి. మరింకెందుకు ఆలస్యం ఇలా ట్రై చెయ్యండి.
కావల్సినవి : క్లీనప్ : ఎగ్ – 1(తెల్లసొన), పాలు – 2 టీ స్పూన్లు
స్క్రబ్ : ఆలీవ్ నూనె – 2 టీ స్పూన్లు, పంచదార – అర టీ స్పూన్లు ఓట్స్ – 2 టీ స్పూన్లు, బాదం గుజ్జు – అర టీ స్పూన్
మాస్క్ : జామకాయ గుజ్జు – 1 టేబుల్ స్పూన్, తేనె – 1 టీ స్పూన్ టమాటా జ్యూస్ – 2 టీ స్పూన్లు
తయారీ : ముందుగా గుడ్డు తెల్లసొన, పాలు ఒక బౌల్‌లో పోసుకుని బాగా కలుపుకోవాలి. ఆ మిశ్రమాన్ని ముఖానికి పట్టించి రెండు లేదా మూడు నిమిషాల తర్వాత మెత్తని క్లాత్‌తో క్లీన్ చేసుకోవాలి. ఇప్పుడు ఆలివ్ నూనె, పంచదార, ఓట్స్, బాదం గుజ్జు ఒక బౌల్‌లోకి తీసుకుని బాగా కలుపుకుని మూడు లేదా ఐదు నిమిషాల పాటు స్క్రబ్ చేసుకోవాలి. తర్వాత చల్లని నీళ్లతో ముఖాన్ని శుభ్రం చేసుకుని ఆవిరి పట్టించుకోవాలి. ఇప్పుడు జామకాయ గుజ్జు, టమాటా జ్యూస్, తేనె ఒక బౌల్‌లోకి తీసుకుని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఆ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేసుకుని, ఇరవై నిమిషాల పాటు ఆరనివ్వాలి. తర్వాత గోరువెచ్చని నీళ్లతో క్లీన్ చేసుకోవాలి. ఇలా వారానికి రెండు సార్లు చెయ్యడం వల్ల మంచి ఫలితం ఉంటుంది.
కాంతివంతమైన మెరుపు
Published Sun, Oct 14 2018 12:40 AM | Last Updated on Sun, Oct 14 2018 12:40 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment