వినాయక చవితి పండగ వచ్చేసింది. ఈ నవరాత్రులు గణనాథుని సేవలో మునిగిపోతారు..భక్తులు. గణేష్ మంటపాలలో మహిళల సందడి అంతా ఇంతా కాదు. ముఖ్యంగా చాలా హౌసింగ్ సొసైటీలు, అసోసియేషన్ల ఆధ్వర్యంలో కొలువుదీరే విఘ్ననాయకుడికి రకరకాల నైవేద్యాలు సమర్పిస్తారు. భక్తి గీతాలు, శాస్త్రీయ నృత్యాలతోపాటు అనేక రకాల కార్యక్రమాలను ఏర్పాటు చేస్తారు. మగువలంతా శుభప్రదమైన ఆకుపచ్చ, ఆరెంజ్, పసుపు రంగు దుస్తుల్లో ఉత్సాహంగా పాల్గొంటారు. మరీసందర్భంలో ముఖంతోపాటు కాళ్లూ, చేతులపై కూడా శ్రద్ధ పెట్టాలి. మరి అదెలాగో చూసేద్దాం.
ఇంట్లో దొరికే వస్తువులతో మాస్క్, స్క్రబ్‌లను ప్రయత్నించాలి.
ఓట్స్- పెరుగు
టీ స్పూన్ ఓట్స్‌ను మెత్తగా పొడిగా చేసుకోవాలి. ఇందులో పెరుగు కలపాలి. ఈ మిశ్రమాన్ని కాళ్లూ చేతులకు బాగా పట్టించాలి. ఆ తరువాత బాగా రుద్దుకని చల్లటి నీళ్లతో శుభ్రంగా కడిగేయాలి.
టొమాటో స్క్రబ్
బాగా పండిన టొమాటో చక్కెర చల్లి, ముఖం, కాళ్లు, చేతులపై బాగా స్క్రబ్ చేసుకోవాలి. కొద్దిసేపు ఆర నిచ్చి చల్లని నీటితో కడిగేసుకోవాలి. అలాగే చల్లని ఐస్ క్యూబ్‌తో మృదువుగా మసాజ్ చేసి, మాయిశ్చరైజర్ పూసుకోవాలి. టమాటో గుజ్జుని కాళ్ళకి, చేతులకి రాసి మసాజ్ చేయడం వలన కాళ్లు చేతుల మీద ఉండే నలుపు తగ్గుతుంది. టొమాట విటమిన్ సి చర్మాన్ని మెరిసేలా చేయడమే కాకుండా సూర్యకిరణాల నుంచి రక్షిస్తుంది.
శనగపిండి, పెరుగు,పసుపు
శనగపిండిలో కొద్దిగా పెరుగు, పసుపు కలిపి పేస్టులా చేయాలి. ఈ పిండిని కాళ్లు, చేతులకు రాసి కాసేపు వదిలేయాలి. పెరుగులో ఉండే లాక్టిక్ యాసిడ్ సహజ బ్లీచింగ్ లాగా పని చేస్తుంది.
కీరదోసకాయ
కీరదోసకాయ గుజ్జుని కాళ్ళకి చేతులకి అప్లై చేసి ఒక 15 నిమిషాల తరువాత వాష్ చేసుకోవాలి. కీర దోసకాయలలో ఉండే విటమిన్ ఏ చర్మం ముదురు రంగులోకి మార్చే మెననిన్ ని కంట్రోల్ చేస్తుంది. నిమ్మరసంలో కూడా సహజ బ్లీచింగ్ లక్షణాలు చర్మం మెరిసే లాగా చేస్తాయి. ఇందులోని విటమిన్ సి చర్మాన్ని కాంతివంతంగా చేస్తుంది.
కాఫీ పౌడర్
ఫిల్టర్ కాఫీ పౌడర్‌లో చక్కెర కలిపి మసాజ్ చేసుకొని పదినిమిషాల తరువాత కడిగేసుకుంటే, ముఖానికి చేతులకు ఇన్‌స్టెంట్ గ్లో వస్తుంది. చందమామలా మెరిసిపోతారు.
Comments
Please login to add a commentAdd a comment