
కొందరి చర్మం చూడగానే ఆరోగ్యవంతంగా కనిపించదు. చూడటానికి కూడా బాగుండదు. మరికొందరికి చర్మం పెళుసుగా ముడతలు పడినట్లు ఉంటుంది. దీంతో చాలా ఇబ్బందిగా ఫీలవుతారు. ఎన్నో రకాల క్రీంలు ఉపయోగించినా ఫలితం అంతగా ఉండదు. అలాంటప్పుడూ ఇలా చేయండి.
చర్మం ఆరోగ్యంగా కనిపించాలంటే...
చర్మం ఆరోగ్యంగా నిగనిగలాడుతూ ఉండాలంటే కొబ్బరిపాలు మేలైన ఎంపిక.
- కొబ్బరి పాలను రాత్రిపూట పడుకునేముందు తలకు పట్టించి, షవర్ క్యాప్ వేసుకోవాలి. మరుసటి రోజు ఉదయం షాంపూతో తలస్నానం చేయాలి. కొబ్బరి పాలు వెంట్రుకల కుదుళ్లకు చేరి, శిరోజాల మృదుత్వం దెబ్బతినదు.
- పచ్చి కొబ్బరిని తురిమి, మిక్సీలో గ్రైండ్ చేసి, పాలు తీయాలి. ఈ పాలను చర్మానికంతటా పట్టించి, అరగంట ఆగి, చల్లని నీటితో స్నానం చేయాలి. చర్మానికి మంచి మాయిశ్చరైజర్‌లా పని చేసి, ముడతలు తగ్గి, మృదువుగా మారిపోతుంది.
- ఎండలో నుంచి ఇంటికి వెళ్లినప్పుడు ఫ్రిజ్‌లో ఉంచిన కొబ్బరి పాలను, దూదితో ఒళ్లంతా రాసుకొని, పది నిమిషాలు సేదదీరాలి. తర్వాత స్నానం చేస్తే ఎండవల్ల కమిలిన చర్మానికి ఉపశమనం లభిస్తుంది. మృదువుగా, కాంతిమంతంగా తయారవుతుంది.
(చదవండి: క్లెన్సింగ్ నుంచి ఫేషియల్ వరకు.. ఇదొక్క బ్యూటీ ప్రొడక్ట్ ఉంటే చాలు)
Comments
Please login to add a commentAdd a comment