కొబ్బరి పాలు... పెంచే కాంతి... | To increase the light coconut milk ... | Sakshi
Sakshi News home page

కొబ్బరి పాలు... పెంచే కాంతి...

Published Sat, Sep 17 2016 10:43 PM | Last Updated on Mon, Sep 4 2017 1:53 PM

కొబ్బరి పాలు... పెంచే కాంతి...

కొబ్బరి పాలు... పెంచే కాంతి...

న్యూ ఫేస్
కొబ్బరి పాలతో చర్మానికి మెరుగైన సంరక్షణను అందజేయవచ్చు. చర్మం ఆరోగ్యంగా నిగనిగలాడుతూ ఉండాలంటే కొబ్బరిపాలు మేలైన ఎంపిక.
* పచ్చి కొబ్బరిని తురిమి, మిక్సీలో వేసి గ్రైండ్ చేసి, పాలు తీయాలి. ఈ పాలను ముఖానికి, మెడకు పట్టించి అరగంట తర్వాత చల్లని నీటితో స్నానం చేయాలి. చర్మానికి కొబ్బరి పాలలోని నూనె మంచి మాయిశ్చరైజర్‌లా పని చేసి, ముడతలను నివారిస్తుంది. చర్మం మృదువుగా మారుతుంది.
* బాగా పొడిబారినట్టుగా ఉండే చర్మానికి రాత్రి పూట కొబ్బరి పాలతో మృదువుగా మసాజ్ చేసి వదిలేయాలి. మరుసటి రోజు ఉదయానే, సున్నిపిండితో స్నానం చేయాలి. వారానికి ఒకసారి ఈ విధంగా చేసినా చర్మం పొడిబారడమనే సమస్య దరిచేరదు. చర్మకాంతీ పెరుగుతుంది.
* ఎండలో నుంచి ఇంటికి వెళ్లినప్పుడు ఫ్రిజ్‌లో ఉంచిన కొబ్బరి పాలను, దూదితో ఒళ్లంతా రాసుకొని, పది నిమిషాలు సేదదీరాలి. తర్వాత స్నానం చేస్తే ఎండవల్ల కమిలిన చర్మానికి ఉపశమనం లభిస్తుంది. మృదువుగా, కాంతిమంతంగా తయారవుతుంది.
* రెండు టీ స్పూన్ల కొబ్బరి పాలలో నాలుగు బాదంపప్పులు వేసి రాత్రిపూట నానబెట్టాలి. మరుసటి రోజు ఉదయం మెత్తగా రుబ్బి దీంట్లో టీ స్పూన్ పాల పొడి వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి, మెడకు పట్టించాలి. అరగంట తర్వాత శుభ్రం చేసుకోవాలి. వారంలో 2-3 సార్లు ఈ విధంగా చేస్తూ చర్మం మృదుత్వాన్ని కోల్పోదు. కాంతి తగ్గదు.
* మేకప్‌ని తొలగించుకున్న తర్వాత వాటిలో ఉండే గాఢ రసాయనాల వల్ల చర్మం దురద పెట్టడం, కాంతి తగ్గడం సహజం. ఇలాంటప్పుడు మేకప్ తొలగించగానే కొబ్బరి పాలను ముఖానికి, గొంతుకు, మెడకు పట్టించి మృదువుగా మునివేళ్లతో మర్దన చేయాలి.
* కొబ్బరి పాలలో ఆలివ్ ఆయిల్ కలిపి ముఖానికి మసాజ్ చేసుకుంటూ ఉంటే చర్మం మృదుత్వం, వర్చస్సు పెరుగుతాయి.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement