చాలామంది ప్యాక్ చేసిన ఆహార పదార్థాలను కొనేస్తారే గానీ ఆ ప్రొడక్ట్ నాసిరకమైనదా? కాదా? అనేది చెక్ చెయ్యరు. తీరా కొని తినేశాక అస్వస్థతకు గురయ్యేంత వరకు మేలుకోరు కొంతమంది. అంతేగాదు కొందరూ కొన్ని బ్రాండెడ్ కంపెనీ నుంచి కొన్న ఉత్పత్తులు కదా..! అన్న ధీమాతో అస్సలు లేబుల్ చెక్ చెయ్యరు. ఎవరికో అక్కడ కొనడం వల్ల ఈ సమస్య వచ్చిందనో లేక ఆహార భద్రతా అధికారుల చెక్కింగ్‌ల వల్లో అసలు విషయం బయటపడితేగానీ తేరుకోరు. ఇలా అస్సలు చెయ్యద్దని అంటున్నారు ఫుడ్ సేఫ్టీ అధికారులు. ఏ బ్రాండ్‌కి సంబంధించిన ప్యాకింగ్ చేసిన ఆహార పదార్థాలైన దాని లేబుల్‌పై ఈ సమాచారం తప్పనిసరిగా ఉండాలి. అవేంటంటే..
ఈ రోజు జూన్ ఏడోవ తేదీ ప్రపంచ ఆహార భద్రతా దినోత్సవం. ఇవాళ ప్రపంచవ్యాప్తంగా ఆహార భద్రతా ప్రమాణాలపై దృష్టి సారించడం, తీసుకోవాలసిన చర్యలు గురించి చర్చలు, అవగాహన శిబిరాలు నిర్వహిస్తారు. అయితే ఇటీవల పలు ప్రముఖ ఫుడ్ స్టోరేజ్‌లపై జరిగిన వరుస తనిఖీల్లో గడవు తీరిన వాటిని ఫుడ్ ప్యాకెట్లను విక్రయిస్తున్నట్లు పెద్ద కలకలం రేగింది. ఈ నేపథ్యంలో ఈ నకిలీ ఫుడ్ ప్రొడక్ట్స్‌ని ఎలా నివారించాలి. వాటిని ఎలా గుర్తించాలి సవివరంగా తెలుసుకుందాం.
ప్రాసెస్ లేదా ప్యాక్ చేసిన ఆహార పదార్థాలను ఎక్కువ వినయోగిస్తున్నాం కాబట్టి తప్పని సరిగా ఆ ఉత్పత్తులకు సంబంధించిన లేబుల్ ఉంటుంది. దానిలో ఉత్పత్తికి సంబంధించిన ఇలాంటి సమాచారం మొత్తం ఉంటేనే కొనాలి . అవేంటంటే..
ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ లోగో..
ఉత్తత్తులపై ఫుడ్ సేప్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా(ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ) లోగో ఉండాలి. ఇది ప్రభుత్వం నిర్దేశించిన భద్రత ప్రమాణాలకు అనుగుణంగా ఉందని సూచిస్తుంది. కాబట్టి ప్రొడక్ట్స్‌పై ఈ లోగో ఉంతో లేదో తనిఖీ చేయండి
గడువు తేది:
ఆహార ఉత్పత్తులపై గడువుత తేదీ కచ్చితంగా ఉండాలి. అది ఉందో లేదో చూడండి. దానిపై గడవు తీరిపోయినట్లు తేదీ ఉంటే వెంటనే వాటిని కొనుగోలు చేయకండి.
పోషకాహార సమాచారం:
ఆ ఉత్పత్తిలో ఉండే కేలరీలు, కొవ్వు పదార్థాలు, చక్కెర కంటెంట్ ఇతర పోషకాలకు సంబంధించన సమాచారం అంతా ఉందో లేదో చూడంది. ఇది మీకు ఈ ఉత్పత్తిని తీసుకోవచ్చో లేదా తెలియజేస్తుంది. అంతేగాదు ఆర్యోకరమైనదే తీసుకుంటున్నామో లేదో కూడా తెలుస్తుంది.
పదార్థాల జాబితా..
ఏ పదార్థాలతో దాన్ని తయారు చేశారనే సమాచారం కూడా ఉండాలి. దీన్ని బట్టి ఆయా పదార్థాలు మీకు పడనవి అయితే వెంటనే ఆప్రొడక్ట్ కొనుగోలు చేయకుండా ఉంటారు. ఇతర సమస్యలు తలెత్తవు కూడా.
జీఎంఓ ఉచిత లేబుల్
ఆహారంలో జన్యు మార్పు చెందిన జీవులను నివారించాలనుకుంటే నాన్ జీఎంవో ప్రాజెక్ట్ వెరిఫైడ్ ఉత్పత్తులను ఎంచుకోండి. దీనిలో జన్యుపరంగా మార్పు చేసిన పదార్థాలు ఉండవు.
ఆర్గానిక్ సర్టిఫికేషన్..
సేంద్రీయా ఉత్పత్తులతో తయారు చేసిందనే సమాచారం ఉంటుంది. దానిపై ఇండియా ఆర్గానిక్ ఏదా యూఎస్‌డీఏ ఆర్గానిక్ వంటి గుర్తింపు పొందిన ఆర్గానిక్ సర్టిఫికేషన్‌తో ధృవీకరించబడినట్లు ఉంటుంది.
(చదవండి: జీరో-వేస్ట్ వెడ్డింగ్: శెభాష్ పూర్వీ.. పర్యావరణ హితంగా పరిణయ వేడుక)
Comments
Please login to add a commentAdd a comment