labels
-
లేబుల్.. డేంజర్ బెల్ చదివితే ఉన్న మతి పోతుంది!
ప్యాకెట్ మీద సగం కోసిన ఆరెంజ్ పెద్ద అక్షరాలతో ‘సి విటమిన్స్ సమృద్ధితో’ అని ఉంటుంది. ‘మీరు ప్యాకెట్ వెనుక ఉన్న లేబుల్ చదవండి’ అంటాడు రేవంత్ హిమత్సింగ్కా. లేబుల్ మీద 0.9 పర్సెంట్ ఆరెంజ్ ఫ్రూట్ ΄పౌడర్ అని ఉంటుంది. అంటే ఒక శాతం ఆరెంజ్, మిగిలిన 99 శాతం కెమికల్. ‘లేబుల్ చదివితే మీరు ఆ విషాన్ని ఇంటికి తేరు’ అంటాడు ఈ హెల్త్ చాంపియన్స్ . ప్రపంచ ఆహార దినోత్సవం సురక్షితమైన ఆహారాన్ని కల్పించుకోమంటోంది. ‘దేశమా... లేబుల్ చదువు’ ఉద్యమం ఒక అవసరమైన చైతన్యం.‘గుర్తు పెట్టుకోండి. ఏది ఎక్కువ రోజులు ప్యాకెట్లో నిల్వ ఉంటుందో అది మనకు ఎక్కువ అపాయం కలిగిస్తుంది’ అంటాడు రేవంత్ హిమత్ సింగ్కా. అమెరికాలో చదువుకుని, మల్టీ నేషనల్ కంపెనీలో పనిచేస్తూ అవన్నీ వదులుకొని ఇండియాలో ఫుడ్ రెవల్యూషన్ తేవాలని వచ్చేసిన ఈ కోల్‌కతా కుర్రాడు బడాబడా కంపెనీల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తున్నాడు. రావడం రావడమే ముందు బోర్నవిటా హెల్త్‌డ్రింక్ కాదని చేసిన వీడియో సంచలనం సృష్టించింది. కేంద్రప్రభుత్వం బోర్నవిటా యజమాని అయిన క్యాడ్‌బరీకి నోటీసు ఇచ్చి ఇకమీదట లేబుల్ మీద హెల్త్ డ్రింక్ అని వేయకూడదని చెప్పింది. ఆ మాట చెప్పడానికి కేంద్ర ప్రభుత్వం ఎందుకు... లేబుల్ చదివి ఉంటే మనకే తెలిసేది అంటాడు హిమత్ సింగ్కా. ఎందుకంటే 400 గ్రాముల బోర్నవిటాలో 50 గ్రాముల చక్కెర ఉంది. లిక్విడ్ గ్లూకోజ్ ఉంది. కృత్రిమ రంగులు ఉన్నాయి. నిల్వకారకాలైన రసాయనాలు ఉన్నాయి. ఇవన్నీ చూపి అతడు సంధించిన ప్రశ్నలకు గొప్ప స్పందన వచ్చింది. ప్రస్తుతం అతడు ప్యాకేజ్డ్ ఫుడ్ మీద చేస్తున్న వీడియోలు అతణ్ణి ఫుడ్ క్రూసేడర్ అని పిలిచేలా చేస్తున్నాయి.పదార్థం గుట్టు ప్యాకెట్ వెనుకకాలం చాలా మారింది. మన తాత, తండ్రులు అంగడికి వెళ్లి సరుకులు తెచ్చుకునేవారు. అవి కొన్నాళ్లకు పాడైపోయేవి. కాబట్టి అవసరమైనంత వరకే తెచ్చుకునేవారు. ఇప్పుడు మాల్, మార్ట్ల కల్చర్ వచ్చింది. ప్యాకేజ్డ్ ఫుడ్ అందుబాటులోకి వచ్చింది. వెళ్లి కొనుక్కొస్తే రెండు మూడు నెలలకు కూడా పాడుకావు. ఈ ప్యాకేజ్డ్ ఫుడ్‌ను ‘ఎఫ్ఎంసిజి’ (ఫాస్ట్ మూవింగ్ కన్సూ్యమర్ గూడ్స్) అంటారు. వీటిలో కొన్ని ‘ఆరోగ్యకరమైనవి’గా, ‘ఆరోగ్యానికి మేలు చేసేవిగా’ చెప్పుకుని అమ్మకాలు పెంచుకోవాలని చూస్తాయి.‘లేబుల్ మీద చూస్తే అవి మీకు హాని చేసేవిగా తెలుస్తుంది’ అంటాడు హిమత్ సింగ్కా. ఇవాళ దేశానికి ‘కాన్షియస్ కాపిటలిజమ్’ కావాలనేది హిమత్ నినాదం. అంటే బాధ్యతాయుతమైన పెట్టుబడిదారీ వ్యవస్థ. ముఖ్యంగా ఆహార రంగంలో ఈ బాధ్యత మరింత ఎక్కువ ఉండాలంటాడు అతను. ఇవాళ మన దేశం ఏటా 50 వేల కోట్ల రూపాయల పామాయిల్‌ను దిగుమతి చేసుకుంటోంది. దీన్ని ప్యాకేజ్డ్ ఫుడ్‌లో విస్తారంగా ఉపయోగిస్తారు. ‘హార్డ్ ఎటాక్‌లకు పామాయిల్ కూడా ఒక కారణం’ అంటాడు హిమత్.ఇంగ్లిష్‌లో చిన్న అక్షరాల్లోమ్యాంగో జ్యూస్‌ల పేరుతో ఇవాళ ఫేమస్ అయిన రెండు మూడు బ్రాండ్ల లేబుల్స్ చదివితే వాటిలో 20 శాతానికి మించిన మ్యాంగో పల్ప్ లేదని ఆ కంపెనీలే చెప్పడం కనిపిస్తుంది. వైట్ బ్రెడ్ కాదని బ్రౌన్ బ్రెడ్ తీసుకుంటున్నవాళ్లు లేబుల్ మీద చూస్తే కలర్ వల్ల మాత్రమే అది బ్రౌన్ కాని, వాస్తవానికి అది మైదాపిండి అని తెలుసుకుంటారు. కంపెనీ ఆ మాట చెప్తుందికానీ చిన్న అక్షరాల్లో, ఇంగ్లిష్‌లో చెబుతుంది. పీనట్ బటర్లోప్రోటీన్ సమృద్ధిగా ఉంటుందని యాడ్స్ చెబుతాయి. కాని పీనట్ బటర్లో క్యాలరీలు తప్ప ప్రోటీన్ 3 శాతానికి మించి ఉండదు.మన దేశంలో ఒకలా విదేశాల్లో ఒకలాఒకే వ్యాపార సంస్థ మన దేశంలో చిప్స్‌కు నాసిరకం నూనె, యూరప్‌లో నాణ్యతగల నూనె వాడుతుంది. ఎందుకంటే యూరప్‌లో నియమాలు కఠినంగా ఉంటాయి. అలాగే రెండేళ్ల లోపు పిల్లలకు అమ్మే సెరియల్స్‌లో మనదేశంలో యాడెడ్ సుగర్స్ ఉంటాయి. యూరప్‌లో ఉండవు. రెండేళ్లలోపు పిల్లలకు యాడెడ్ సుగర్స్ ఉన్న ఆహారం అంత మంచిది కాదు. తీపికి అడిక్ట్ అయిన పిల్లలు ఇంట్లో ఆరోగ్యకరమైనది పెట్టినా తినరు. అదీ కంపెనీల ఎత్తుగడ. డబ్బా ఆహారం తినే పసికందులు తర్వాతి కాలంలో స్థూలకాయం, డయబెటిస్‌తో బాధ పడే అవకాశం ఉంటుంది. ‘మా డ్రింక్ రోజూ తాగితే ΄÷డవు పెరుగుతారు’, ‘మా నూనె వాడితే గుండెకు మంచిది’... ఇలాంటివి ఏవీ నమ్మొద్దు అంటాడు హిమత్.దేశమా.. లేబుల్ చదువు...‘మీరు ఏ వస్తువు కొన్నా దాని వెనుక ఉన్న లేబుల్ చదవండి. చెడ్డ పదార్థాలు ఉంటే నాణ్యంగా తయారు చేయమని గొంతు విప్పండి. మనం ఏకమైతే సంస్థలు మారి మంచి ఉత్పత్తులు అందిస్తాయి. మన ఆరోగ్యాలు మెరుగు పడతాయి. అలాగే ప్రకటనలతో సంబంధం లేకుండా కొన్ని కంపెనీలు నాణ్యమైన పదార్థాలు అందిస్తున్నాయి. వాటిని గుర్తించి కొనడం కూడా మన పనే’ అంటాడతను. ఇవాళ ‘వరల్డ్ ఫుడ్ డే’. ‘బలవర్థకమైన, సురక్షితమైన ఆహారం ప్రతి ఒక్కరి హక్కు’. కాని మోసాన్ని గుర్తించడంలో మనమే వెనుక ఉంటే నష్టం మనకే కదా. ‘లేబుల్ పఢేగా ఇండియా’. ఇండియా.. లేబుల్ చదువు.కోర్టు కేసులు ఎదుర్కొంటూప్యాకేజ్డ్ ఫుడ్లోని మోసాలను బయట పెడుతున్నందుకు పెద్ద పెద్ద సంస్థలు హిమత్ మీద కత్తి కట్టాయి. కోర్టుకు ఈడ్చాయి. మొదట్లో భయపడినా ఇప్పుడు లెక్క చేయడం లేదు. ‘నన్ను కోర్టుకు లాగితే మిమ్మల్ని బజారుకు లాగుతా’ అంటున్నాడు హిమత్. కొన్ని కంపెనీలు రకరకాల చోట్ల కేసులు వేసి ఇబ్బంది పెడుతున్నాయి. అంటే తన ఊరి నుంచి కాకుండా వేరే ఊళ్లకు అతడు వాయిదాకు హాజరు కావాలి. -
ఫుడ్ బిజినెస్ ఆపరేటర్లకు కీలక సూచన.. ఇకపై..
ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (FSSAI).. అన్ని ఫుడ్ బిజినెస్ ఆపరేటర్లు తమ ఉత్పత్తుల మీద '100% ఫ్రూట్ జ్యూస్' అనే లేబుల్స్, అడ్వర్టైజ్మెంట్లను తీసేయాలని ఆదేశాలు జారీ చేసింది. సెప్టెంబరు 1లోపు ఇప్పటికే ఉన్న అన్ని ప్రీ-ప్రింటెడ్ ప్యాకేజింగ్ మెటీరియల్‌లను ఎగ్జాస్ట్ చేయమని కూడా సూచించింది. ఎఫ్ఎస్ఎస్ఏఐ ఈ నిర్ణయాన్ని ఎందుకు తీసుకుందనే వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.జ్యూస్ కవర్ మీద 100 శాతం నేచురల్.. తక్కువ చక్కెర కంటెంట్ అని రాసి ఉంటుంది. కానీ ఇలాంటి వాటిలో వంద శాతం ఫ్రూట్ జ్యూస్ ఉండదు. తప్పుడు సమాచారంతో కంపెనీలు ప్రజలను మోసం చేస్తున్నారు. ఫ్రెష్ జ్యూస్ చేసుకోవడం కష్టమని.. చాలామంది రెడిమేడ్ జ్యూస్‌లను కొనుగోలు చేస్తూ.. ఆరోగ్యాలు పాడు చేసుకుంటున్నారు. ఈ కారణంగానే కంపెనీలన్నీ తమ ఉత్పత్తుల మీద లేబుల్స్, అడ్వర్టైజ్మెంట్లను తొలగించాలని ఎఫ్ఎస్ఎస్ఏఐ వెల్లడించింది.ఎఫ్ఎస్ఎస్ఏఐ కొత్త రూల్స్ ప్రకారం.. కిలో జ్యూస్‌లో 15 గ్రాముల కంటే ఎక్కువ చక్కర ఉంటె స్వీట్ జ్యూస్ అని లేబుల్ వేయాలి. తాజా పండ్ల రసం కాకూండా.. ప్రాసెస్ చేసిన జ్యూస్ ఆరోగ్యానికి చాలా ప్రమాదాన్ని కలిగిస్తుంది. ఇది క్యాన్సర్ వంటి ప్రమాదకరమైన అలాగే దీర్ఘకాలిక వ్యాధులకు కారణమవుతుంది. బరువు పెరగడం, గుండె జబ్బులు వంటి వివిధ వ్యాధుల బారిన పడే అవకాశం ఉందని తెలుస్తోంది. -
ప్యాక్ చేసిన ఆహార పదార్థాల లేబుల్‌లో ఇవి ఉంటేనే కొనండి!
చాలామంది ప్యాక్ చేసిన ఆహార పదార్థాలను కొనేస్తారే గానీ ఆ ప్రొడక్ట్ నాసిరకమైనదా? కాదా? అనేది చెక్ చెయ్యరు. తీరా కొని తినేశాక అస్వస్థతకు గురయ్యేంత వరకు మేలుకోరు కొంతమంది. అంతేగాదు కొందరూ కొన్ని బ్రాండెడ్ కంపెనీ నుంచి కొన్న ఉత్పత్తులు కదా..! అన్న ధీమాతో అస్సలు లేబుల్ చెక్ చెయ్యరు. ఎవరికో అక్కడ కొనడం వల్ల ఈ సమస్య వచ్చిందనో లేక ఆహార భద్రతా అధికారుల చెక్కింగ్ల వల్లో అసలు విషయం బయటపడితేగానీ తేరుకోరు. ఇలా అస్సలు చెయ్యద్దని అంటున్నారు ఫుడ్ సేఫ్టీ అధికారులు. ఏ బ్రాండ్‌కి సంబంధించిన ప్యాకింగ్ చేసిన ఆహార పదార్థాలైన దాని లేబుల్‌పై ఈ సమాచారం తప్పనిసరిగా ఉండాలి. అవేంటంటే..ఈ రోజు జూన్ ఏడోవ తేదీ ప్రపంచ ఆహార భద్రతా దినోత్సవం. ఇవాళ ప్రపంచవ్యాప్తంగా ఆహార భద్రతా ప్రమాణాలపై దృష్టి సారించడం, తీసుకోవాలసిన చర్యలు గురించి చర్చలు, అవగాహన శిబిరాలు నిర్వహిస్తారు. అయితే ఇటీవల పలు ప్రముఖ ఫుడ్ స్టోరేజ్‌లపై జరిగిన వరుస తనిఖీల్లో గడవు తీరిన వాటిని ఫుడ్ ప్యాకెట్లను విక్రయిస్తున్నట్లు పెద్ద కలకలం రేగింది. ఈ నేపథ్యంలో ఈ నకిలీ ఫుడ్ ప్రొడక్ట్స్‌ని ఎలా నివారించాలి. వాటిని ఎలా గుర్తించాలి సవివరంగా తెలుసుకుందాం. ప్రాసెస్ లేదా ప్యాక్ చేసిన ఆహార పదార్థాలను ఎక్కువ వినయోగిస్తున్నాం కాబట్టి తప్పని సరిగా ఆ ఉత్పత్తులకు సంబంధించిన లేబుల్ ఉంటుంది. దానిలో ఉత్పత్తికి సంబంధించిన ఇలాంటి సమాచారం మొత్తం ఉంటేనే కొనాలి . అవేంటంటే..ఎఫ్ఎస్ఎస్ఏఐ లోగో..ఉత్తత్తులపై ఫుడ్ సేప్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా(ఎఫ్ఎస్ఎస్ఏఐ) లోగో ఉండాలి. ఇది ప్రభుత్వం నిర్దేశించిన భద్రత ప్రమాణాలకు అనుగుణంగా ఉందని సూచిస్తుంది. కాబట్టి ప్రొడక్ట్స్‌పై ఈ లోగో ఉంతో లేదో తనిఖీ చేయండిగడువు తేది:ఆహార ఉత్పత్తులపై గడువుత తేదీ కచ్చితంగా ఉండాలి. అది ఉందో లేదో చూడండి. దానిపై గడవు తీరిపోయినట్లు తేదీ ఉంటే వెంటనే వాటిని కొనుగోలు చేయకండి. పోషకాహార సమాచారం:ఆ ఉత్పత్తిలో ఉండే కేలరీలు, కొవ్వు పదార్థాలు, చక్కెర కంటెంట్ ఇతర పోషకాలకు సంబంధించన సమాచారం అంతా ఉందో లేదో చూడంది. ఇది మీకు ఈ ఉత్పత్తిని తీసుకోవచ్చో లేదా తెలియజేస్తుంది. అంతేగాదు ఆర్యోకరమైనదే తీసుకుంటున్నామో లేదో కూడా తెలుస్తుంది. పదార్థాల జాబితా..ఏ పదార్థాలతో దాన్ని తయారు చేశారనే సమాచారం కూడా ఉండాలి. దీన్ని బట్టి ఆయా పదార్థాలు మీకు పడనవి అయితే వెంటనే ఆప్రొడక్ట్ కొనుగోలు చేయకుండా ఉంటారు. ఇతర సమస్యలు తలెత్తవు కూడా. జీఎంఓ ఉచిత లేబుల్ఆహారంలో జన్యు మార్పు చెందిన జీవులను నివారించాలనుకుంటే నాన్ జీఎంవో ప్రాజెక్ట్ వెరిఫైడ్ ఉత్పత్తులను ఎంచుకోండి. దీనిలో జన్యుపరంగా మార్పు చేసిన పదార్థాలు ఉండవు. ఆర్గానిక్ సర్టిఫికేషన్..సేంద్రీయా ఉత్పత్తులతో తయారు చేసిందనే సమాచారం ఉంటుంది. దానిపై ఇండియా ఆర్గానిక్ ఏదా యూఎస్డీఏ ఆర్గానిక్ వంటి గుర్తింపు పొందిన ఆర్గానిక్ సర్టిఫికేషన్‌తో ధృవీకరించబడినట్లు ఉంటుంది. (చదవండి: జీరో-వేస్ట్ వెడ్డింగ్: శెభాష్ పూర్వీ.. పర్యావరణ హితంగా పరిణయ వేడుక) -
Russia-Ukraine war: యుద్ధ వ్యతిరేక లేబుళ్లు అంటించినందుకు.. రష్యా కళాకారిణికి ఏడేళ్ల జైలు
మాస్కో: సూపర్మార్కెట్లోని వస్తువులపై ఉండే ధరల లేబుళ్లను తొలగించి, వాటి స్థానంలో యుద్ధ వ్యతిరేక నినాదాలున్న లేబుళ్లు అంటించిన నేరంపై ఓ కళాకారిణికి రష్యా కోర్టు ఏడేళ్ల జైలు శిక్ష విధించింది. గత ఏడాది ఉక్రెయిన్‌పై రష్యా దాడులు మొదలయ్యాక.. సెయింట్ పీటర్స్బర్గ్కు చెందిన సాషా స్కోచిలెంకో(33) అనే కళాకారిణి స్థానిక ఫెమినిస్టు బృందం పిలుపు మేరకు స్థానిక సూపర్మార్కెట్లోని వస్తువుల ధర లేబుళ్లను తీసేసి..‘రష్యా ఆర్మీ మరియుపోల్‌లోని స్కూల్‌పై బాంబు వేసింది’... ‘రష్యా ఫాసిస్ట్ రాజ్యంగా మారి ఉక్రెయిన్‌పై దాడి చేసినందుకు మా ముత్తాత రెండో ప్రపంచ యుద్ధంలో పోరాడలేదు’ అంటూ రాసి ఉన్న కొన్ని లేబుళ్లను అంటించింది. ఈ నేరానికి అధికారులు గత ఏడాది ఏప్రిల్ అదుపులోకి తీసుకున్నారు. యుద్ధానికి వ్యతిరేకంగా ఎలాంటి వైఖరి తీసుకున్నా కఠిన శిక్షలకు అవకాశం కల్పిస్తూ పుతిన్ ప్రభుత్వం చట్టాలు తీసుకువచి్చంది. ఈ చట్టాలు అమల్లోకి వచ్చాక జరిగిన మొట్టమొదటి అరెస్ట్ ఇది. దీంతో, విచారణ సుదీర్ఘంగా సాగింది. తనపై వచి్చన ఆరోపణలను సాషా అంగీకరించింది కూడా. తీవ్ర అరోగ్య సమస్యలతో బాధపడుతున్న సాషా జైలులోనే చనిపోయే ప్రమాదముందని ఆమె తరఫు లాయర్లు తెలిపారు. అయినప్పటికీ జడ్జి ఏడేళ్ల జైలు శిక్ష విధిస్తూ తీర్పు ఇచి్చనట్లు కుటుంబసభ్యులు తెలిపారు. ఉక్రెయిన్‌పై యుద్ధాన్ని ప్రభుత్వ టీవీలో లైవ్‌లో వ్యతిరేకించారన్న ఆరోపణలపై కోర్టు ఒకటి మరినా అనే జర్నలిస్టుకు ఎనిమిదిన్నరేళ్ల జైలు శిక్ష విధించింది. యుద్ధాన్ని నిరసించిన వ్లాదిమిర్ కారా ముర్జా అనే ప్రతిపక్ష నేతకు ఏప్రిల్‌లో 25 ఏళ్ల జైలు శిక్ష పడింది. -
మందు మితంగా తాగితే మంచిదే అంటారుగా.. సుప్రీం కీలక వ్యాఖ్యలు
సాక్షి,న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో మద్యం ఉత్పత్తి, పంపిణీ, వినియోగంపై నియంత్రణ కోరుతూ దాఖలైన పిటిషన్‌ను సుప్రీంకోర్టు తిరస్కరించింది. అడ్వకేట్ అశ్విని కుమార్ ఉపాధ్యాయ్ ఈ పిటిషన్ వేశారు. సిగరెట్ ప్యాకెట్లపై ఆరోగ్యానికి హానికరం అని స్టిక్కర్లు వేసినట్లే.. మద్యం బాటిళ్లపై కూడా స్టిక్కర్లు ముద్రించేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని అత్యున్నత న్యాయస్థానాన్ని కోరారు. దీనిపై ప్రింట్, ఎలక్ట్రానిక్, సోషల్ మీడియా ద్వారా ప్రచారం నిర్వహించాలని విజ్ఞప్తి చేశారు. మద్యం ఆరోగ్యానికి హానికరం అని, స్టిక్కర్లు అంటించడం వల్ల యువతకు దీని గురించి తెలిసి మేలు జరుగుతుందని నొక్కి చెప్పారు. పిటిషన్‌ను పరిశీలించిన సిజేఐ జస్టిస్ యూయూ లలిత్ నేతృత్వంలోని ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. మద్యం మితంగా తీసుకుంటే ఆరోగ్యానికి మంచిదని కొందరు నమ్ముతారని పేర్కొంది. కానీ సిగరెట్ల విషయంలో ఇలా ఎవరూ చెప్పలేదని గుర్తు చేసింది. అందుకే మందుబాటిళ్లపై స్టిక్కర్లు అంటించాలని ఆదేశించలేమని తేల్చిచెప్పింది. పిటిషన్‌ను ఉపసంహరించుకోవాలని, లేదంటే తామే కొట్టివేస్తామని స్పష్టం చేసింది. అయితే ఈ విషయంపై లా కమిషన్ ముందుకు వెళ్లేందుకైనా తనకు అనుమతి ఇవ్వాలని పిటిషనర్ కోరగా.. సర్వోన్నత న్యాయస్థానం అందుకు నిరాకరించింది. పిటిషన్ విత్‌డ్రా చేసుకునేందుకు మాత్రమే అనుమతిస్తామని చెప్పింది. దీంతో అడ్వకేట్ తన పిటిషన్‌ను ఉపసంహరించుకున్నారు. చదవండి: ఆ దేశానికి వెళ్లే వారికి కేంద్రం హెచ్చరిక -
కాంగ్రెస్ పథకాలకు టీఆర్ఎస్ లేబుల్స్
♦ మీట్ ది ప్రెస్‌లో వీహెచ్ ♦ రాష్ట్రంలో మంత్రులకేదీ విలువ ♦ సీఎం కేసీఆరా, కేటీఆరా? ♦ టీఆర్ఎస్కు అభ్యర్థులు ♦ కరువై అరువు తెచ్చుకుంది సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ తెచ్చిన పథకాలకు, చేసిన అభివృద్ధికి టీఆర్ఎస్ లేబుల్స్ వేసుకుని ప్రచారం చేసుకుంటోందని ఏఐసీసీ కార్యదర్శి, రాజ్యసభ సభ్యుడు వి.హనుమంతరావు ధ్వజమెత్తారు. హైదరాబాద్‌ను విశ్వనగరంగా తీర్చిదిద్దడానికి కాంగ్రెస్ పునాదులు వేసిందన్నారు. తెలంగాణ వర్కింగ్ జర్నలిస్టు ఫెడరేషన్ (టీయూడబ్ల్యూజేఎఫ్), హైదరాబాద్ జర్నలిస్టు యూనియన్ సంయుక్తంగా బుధవారం నిర్వహించిన మీట్ ది ప్రెస్‌లో ఆయన మాట్లాడారు. హైదరాబాద్‌లో నలుగురు మంత్రులున్నా కేటీఆర్ పెత్తనం చెలాయిస్తున్నారని, మంత్రులకు విలువ లేకుండా పోయిందన్నారు. రాష్ట్రానికి ముఖ్యమంత్రి కేసీఆరా, కేటీఆరా అని వీహెచ్ ప్రశ్నించారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు కాంగ్రెస్ ఎన్నో ఇబ్బందులను, సమస్యలను ఎదుర్కొన్నదని వివరించారు. తెలంగాణ ఏర్పాటుకు ఆనాడు ప్రతిపక్షనేతతో సహా కాంగ్రెస్‌లోనూ కొందరు నేతలు వ్యతిరేకంగా పనిచేశారని గుర్తుచేశారు. ఆంధ్ర ప్రాంతంలో కాంగ్రెస్‌కు నష్టం జరుగుతుందని తెలిసినా, సోనియాగాంధీ తెలంగాణకు అనుకూలంగా నిర్ణయం తీసుకున్నారని వీహెచ్ గుర్తుచేశారు. గ్రేటర్ హైదరాబాద్‌లో సెటిలర్ల ఓట్లు చాలా కీలకమని, అందుకే టీఆర్ఎస్ కూడా మరోసారి మోసం చేయడానికి కల్లబొల్లి మాటలను చెబుతోందని విమర్శించారు. లంకలో పుట్టినవారంతా రాక్షసులేనని, సెటిలర్లు ద్రోహులని ఆంధ్ర వారి గౌరవాన్ని దెబ్బతీసిన కేసీఆర్ ఇప్పుడు వారిని ఆకర్షించడానికి ప్రయత్నిస్తున్నారని దుయ్యబట్టారు. ప్రతిపక్షపాత్ర పోషించడంలో కాంగ్రెస్ పార్టీ విఫలమైనట్టుగా జరుగుతున్న ప్రచారాన్ని ఖండించారు. ప్రతిపక్షపాత్రలో పీజేఆర్, జానారెడ్డిని పోల్చిచూడలేమన్నారు. ఎవరిశైలిలో వారు వ్యవహరిస్తారని, ఒకరితో మరొకరిని పోల్చిచూడకూడదన్నారు. గ్రేటర్ ఎన్నికల తర్వాత కాంగ్రెస్ పుంజుకుంటుందని, వ్యూహాత్మకంగానే మేయర్ అభ్యర్థిని ప్రకటించలేదన్నారు. టీఆర్ఎస్ ఎన్ని కుట్రలు చేసినా మేయర్ పీఠం కాంగ్రెస్‌కే దక్కుతుందని వీహెచ్ ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్‌కు అభ్యర్థులే కరువైనారని ప్రచారం చేస్తున్న టీఆర్ఎస్ అభ్యర్థుల్లో ఎక్కువగా కాంగ్రెస్ నేతలే ఉన్నారని వీహెచ్ చెప్పారు. టీఆర్ఎస్కు అభ్యర్థులు లేక కాంగ్రెస్ నుంచి, ఇతర పార్టీల నుంచి నేతలను అరువు తెచ్చుకుంటోందని ఎద్దేవా చేశారు. కార్యక్రమానికి ఫెడరేషన్ అధ్యక్షుడు సోమయ్య అధ్యక్షత వహించగా, బసవపున్నయ్య సమన్వయకర్తగా వ్యవహరించారు.