Food Safety and Standards
-
సంక్షేమ హాస్టళ్లలో ఫుడ్ సేఫ్టీపై టాస్క్ ఫోర్స్ కమిటీ
-
ఆహార భద్రత సూచిక 2024: మరోసారి అగ్రస్థానంలో ఆ రాష్ట్రం!
ప్రజల ఆరోగ్యాన్ని పరిరక్షించడానికి, వినియోగదారుల విశ్వాసాన్ని కాపాడుకోవడానికి ఆహార భద్రతను మెరుగుపరచడం అత్యవసరం. భారతదేశం ప్రపంచ ఆర్థిక శక్తిగా ఎదుగుతున్నందున ఇది మరింత ముఖ్యం. ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (FSSAI) విడుదల చేసిన స్టేట్ ఫుడ్ సేఫ్టీ ఇండెక్స్ (SFSI) 2024 ర్యాంకింగ్‌లో మరోసారి కేరళ అగ్రస్థానంలో నిలవడం విశేషం. ఈ సూచీలో వరుసగా రెండోసారి తొలిస్థానం దక్కించుకుంది. గతేడాది రెండోస్థానంలో ఉన్న తమిళనాడు ఈసారి మొదటి స్థానానికి ఎగబాకింది. జమ్మూ కాశ్మీర్, గుజరాత్, నాగాలాండ్ మొదటి ఐదు స్థానాల్లో ఉన్నాయి. ఈ మేరకుర ఆరోగ్యమంత్రి వీణా జార్జ్ ఫేస్బుక్ పోస్ట్‌లో.. "కేరళ జాతీయ స్థాయిలో ఆహార భద్రతలో చారిత్రాత్మక విజయాన్ని సాధించింది. ఆహార భద్రతా సూచికలో జాతీయ స్థాయిలో కేరళ వరుసగా రెండవ సంవత్సరం మొదటి స్థానంలో నిలిచింది. ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియాకు చెందిన ఫుడ్ సేఫ్టీ ఇండెక్స్‌లో గతేడాది కూడా మొదటి స్థానంలోనే నిలిచింది కేరళ. ఈ విషయంలో ప్రాసిక్యూషన్ కేసులు, గుర్తింపు పొందిన ల్యాబ్‌ల సంఖ్య, ల్యాబ్‌లలో అత్యుత్తమ పరీక్ష, మొబైల్ ల్యాబ్‌ల పనితీరు, శిక్షణ , అవగాహన కార్యకలాపాలు మొదలైనవి కేరళను అగ్రస్థానంలో నిలిపాయి. అలాగే కేరళ ఈ విజయాన్ని దక్కించుకోవడంలో కృషి చేసి ఫుడ్ సేఫ్టీ డిపార్ట్మెంట్ ఉద్యోగులందరికీ అభినందనలు. అని పోస్ట్‌లో పేర్కొన్నారు వీణా జార్జ్. ఈ ఆహార భద్రతా సూచీ అనేది రాష్ట్రాల ఐదు కీలక పారామితులపై అంచనా వేస్తుంది. మానవ వనరులు, సంస్థాగత డేటా, సమ్మతి, ఆహార పరీక్ష-మౌలిక సదుపాయాలు, నిఘా, శిక్షణ, సామర్థ్యం పెంపు, వినియోగదారుల సాధికారత. ఆహార సంబంధిత వ్యాధులు, న్యూట్రాస్యూటికల్ భద్రత, ఆహారంలో ప్లాస్టిక్‌ల వల్ల ఎదురవుతున్న సవాళ్లను దృష్ట్యా..నేటి ప్రపంచంలో ఫుడ్ రెగ్యులేటర్ల ప్రాముఖ్యత పెరుగుతోందని కేంద్ర ఆరోగ్య మంత్రి జేపీ నడ్డా నొక్కి చెప్పారు. అంతేగాదు ఫుడ్ సేఫ్టీ విషయంలో నిరంతర సహకారం, ఆవిష్కరణలు, మెరుగుదల తదితరాల ఆవశ్యకత గురించి హైలెట్ చేశారు.(చదవండి: ఇదేం బ్యాగ్ రా దేవుడా..! ధర తెలిస్తే కంగుతింటారు..!) -
ప్యాక్ చేసిన ఆహార పదార్థాల లేబుల్‌లో ఇవి ఉంటేనే కొనండి!
చాలామంది ప్యాక్ చేసిన ఆహార పదార్థాలను కొనేస్తారే గానీ ఆ ప్రొడక్ట్ నాసిరకమైనదా? కాదా? అనేది చెక్ చెయ్యరు. తీరా కొని తినేశాక అస్వస్థతకు గురయ్యేంత వరకు మేలుకోరు కొంతమంది. అంతేగాదు కొందరూ కొన్ని బ్రాండెడ్ కంపెనీ నుంచి కొన్న ఉత్పత్తులు కదా..! అన్న ధీమాతో అస్సలు లేబుల్ చెక్ చెయ్యరు. ఎవరికో అక్కడ కొనడం వల్ల ఈ సమస్య వచ్చిందనో లేక ఆహార భద్రతా అధికారుల చెక్కింగ్ల వల్లో అసలు విషయం బయటపడితేగానీ తేరుకోరు. ఇలా అస్సలు చెయ్యద్దని అంటున్నారు ఫుడ్ సేఫ్టీ అధికారులు. ఏ బ్రాండ్‌కి సంబంధించిన ప్యాకింగ్ చేసిన ఆహార పదార్థాలైన దాని లేబుల్‌పై ఈ సమాచారం తప్పనిసరిగా ఉండాలి. అవేంటంటే..ఈ రోజు జూన్ ఏడోవ తేదీ ప్రపంచ ఆహార భద్రతా దినోత్సవం. ఇవాళ ప్రపంచవ్యాప్తంగా ఆహార భద్రతా ప్రమాణాలపై దృష్టి సారించడం, తీసుకోవాలసిన చర్యలు గురించి చర్చలు, అవగాహన శిబిరాలు నిర్వహిస్తారు. అయితే ఇటీవల పలు ప్రముఖ ఫుడ్ స్టోరేజ్‌లపై జరిగిన వరుస తనిఖీల్లో గడవు తీరిన వాటిని ఫుడ్ ప్యాకెట్లను విక్రయిస్తున్నట్లు పెద్ద కలకలం రేగింది. ఈ నేపథ్యంలో ఈ నకిలీ ఫుడ్ ప్రొడక్ట్స్‌ని ఎలా నివారించాలి. వాటిని ఎలా గుర్తించాలి సవివరంగా తెలుసుకుందాం. ప్రాసెస్ లేదా ప్యాక్ చేసిన ఆహార పదార్థాలను ఎక్కువ వినయోగిస్తున్నాం కాబట్టి తప్పని సరిగా ఆ ఉత్పత్తులకు సంబంధించిన లేబుల్ ఉంటుంది. దానిలో ఉత్పత్తికి సంబంధించిన ఇలాంటి సమాచారం మొత్తం ఉంటేనే కొనాలి . అవేంటంటే..ఎఫ్ఎస్ఎస్ఏఐ లోగో..ఉత్తత్తులపై ఫుడ్ సేప్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా(ఎఫ్ఎస్ఎస్ఏఐ) లోగో ఉండాలి. ఇది ప్రభుత్వం నిర్దేశించిన భద్రత ప్రమాణాలకు అనుగుణంగా ఉందని సూచిస్తుంది. కాబట్టి ప్రొడక్ట్స్‌పై ఈ లోగో ఉంతో లేదో తనిఖీ చేయండిగడువు తేది:ఆహార ఉత్పత్తులపై గడువుత తేదీ కచ్చితంగా ఉండాలి. అది ఉందో లేదో చూడండి. దానిపై గడవు తీరిపోయినట్లు తేదీ ఉంటే వెంటనే వాటిని కొనుగోలు చేయకండి. పోషకాహార సమాచారం:ఆ ఉత్పత్తిలో ఉండే కేలరీలు, కొవ్వు పదార్థాలు, చక్కెర కంటెంట్ ఇతర పోషకాలకు సంబంధించన సమాచారం అంతా ఉందో లేదో చూడంది. ఇది మీకు ఈ ఉత్పత్తిని తీసుకోవచ్చో లేదా తెలియజేస్తుంది. అంతేగాదు ఆర్యోకరమైనదే తీసుకుంటున్నామో లేదో కూడా తెలుస్తుంది. పదార్థాల జాబితా..ఏ పదార్థాలతో దాన్ని తయారు చేశారనే సమాచారం కూడా ఉండాలి. దీన్ని బట్టి ఆయా పదార్థాలు మీకు పడనవి అయితే వెంటనే ఆప్రొడక్ట్ కొనుగోలు చేయకుండా ఉంటారు. ఇతర సమస్యలు తలెత్తవు కూడా. జీఎంఓ ఉచిత లేబుల్ఆహారంలో జన్యు మార్పు చెందిన జీవులను నివారించాలనుకుంటే నాన్ జీఎంవో ప్రాజెక్ట్ వెరిఫైడ్ ఉత్పత్తులను ఎంచుకోండి. దీనిలో జన్యుపరంగా మార్పు చేసిన పదార్థాలు ఉండవు. ఆర్గానిక్ సర్టిఫికేషన్..సేంద్రీయా ఉత్పత్తులతో తయారు చేసిందనే సమాచారం ఉంటుంది. దానిపై ఇండియా ఆర్గానిక్ ఏదా యూఎస్డీఏ ఆర్గానిక్ వంటి గుర్తింపు పొందిన ఆర్గానిక్ సర్టిఫికేషన్‌తో ధృవీకరించబడినట్లు ఉంటుంది. (చదవండి: జీరో-వేస్ట్ వెడ్డింగ్: శెభాష్ పూర్వీ.. పర్యావరణ హితంగా పరిణయ వేడుక) -
World Food Safety Day 2023: కలుషితాహారానికి 4.2 లక్షల మంది బలి!
ఆహారం బాగుంటే అది మనకు జవసత్వాలనిస్తుంది. అది కలుషితమైతే మన ఆరోగ్యాన్నే దెబ్బతీస్తుంది.. ఒక్కోసారి ప్రాణాన్నే తీస్తుంది! అందుకని, మనకు ప్రమాణాలతో కూడిన శుద్ధమైన ఆహారం కావాలి. ఆహార భద్రతలో దీని పాత్ర కీలకం. అంతే కాదు, ఆహారం ద్వారా సంక్రమించే వ్యాధులను తగ్గించడంలో కూడా ఇది కీలక పాత్ర పోషిస్తుంది. కలుషిత లేదా నాణ్యత లేని ఆహారం వల్ల ప్రతి సంవత్సరం 60 కోట్ల మంది దాదాపు 200 రకాల అనారోగ్యాల పాలవుతున్నారు. బాధితుల్లో ఎక్కువ మంది పేదలు, పిల్లలు, యువతే. ఇందులో ప్రతి ఏటా 4 లక్షల 20 వేల మంది చనిపోతున్నారు. ఆహారం ద్వారా వచ్చే అనారోగ్యాలను అరికడితే ఈ మరణాలను నివారించవచ్చు. అందుకే, ఈ అంశంపై ప్రజల్లో చైతన్యాన్ని కలిగించేందుకు జూన్ 7న ప్రపంచ ఆహార భద్రతా ప్రమాణాల దినోత్సవం జరుపుకుంటున్నాం. ప్రతి 10 మందిలో ఒకరు! ►ప్రతి ఏటా ప్రపంచవ్యాప్తంగా ప్రతి పది మందిలో ఒకరు కలుషిత ఆహారం వల్ల అనారోగ్యం పాలవుతున్నారు. పేద, ధనిక అని తేడా లేదు. అన్ని దేశాల్లోనూ ఆహార నాణ్యతా సమస్యలు తలెత్తుతున్నాయి. ►బాక్టీరియా, వైరస్లు, పరాన్నజీవులు లేదా భార లోహాలు వంటి రసాయన పదార్థాలతో కలుషితమైన ఆహారం తినడం వల్ల 200కు పైగా వ్యాధులు వస్తున్నాయి. 5 సంవత్సరాల కంటే తక్కువ వయస్కులైన పిల్లలు జనాభాలో 9 శాతం ఉన్నారు, అయితే, ఆహార వ్యాధిగ్రస్తుల్లో 40 శాతం మంది వీరే. ► అందువల్ల ఆహార భద్రతా ప్రమాణాలు పాటిస్తే.. అవి అందరి ప్రాణాలనే కాదు, అనేకమంది జీవనోపాధిని కూడా కాపాడతాయి. ►వినియోగదారులను రక్షించడంలో, ఆహారోత్పత్తిపై విశ్వాసాన్ని కలిగించడంలో ఆహార భద్రతా ప్రమాణాలు కీలకపాత్ర పోషిస్తున్నాయి. ► ఐక్యరాజ్యసమితికి అనుబంధంగా 1963లో ఏర్పాటైన కోడెక్స్ అలిమెంటారియస్ కమిషన్.. గత 60 సంవత్సరాలుగా అంతర్జాతీయ ఆహార ప్రమాణాలను నిర్దేశిస్తోంది. ►236 ప్రమాణాలు, 84 మార్గదర్శకాలు, 56 ఆచరణాత్మక నియమాలు ఉన్నాయి. ఆహారంలో కలుషితాల గరిష్ట స్థాయికి సంబంధించిన 126 ప్రమాణాలను కోడెక్స్ నిర్దేశిస్తోంది. వీటితో పాటు.. ఆహారోత్పత్తుల తయారీ ప్రక్రియలో కలిపే పదార్థాలకు సంబంధించి.. పురుగుమందుల అవశేషాలు, పశువైద్యంలో వాడే ఔషధాల అవశేషాల గరిష్ట స్థాయిలకు సంబంధించిన 10 వేలకు పైగా పరిమాణాత్మక ప్రమాణాలను కోడెక్స్ అలిమెంటారియస్ కమిషన్ నిర్దేశిస్తోంది. ►పశువైద్యంలో ఉపయోగించే యాంటీమైక్రోబయల్ ఔషధాలకు లొంగని మొండి సూక్ష్మక్రిములతో సోకే ఇన్ఫెక్షన్ల కారణంగా ప్రపంచవ్యాప్తంగా ఏటా 50 లక్షల మంది మరణిస్తున్నారని అంచనా. ఈ మరణాలను తగ్గించేందుకు కూడా ఆహార భద్రతా ప్రమాణాలను కోడెక్స్ నిర్దేశిస్తోంది. 2016 నుంచి 50 అభివృద్ధి చెందుతున్న, పేద దేశాలపై ప్రత్యేక శ్రద్ధ పెడుతోంది. ► సురక్షితమైన, పోషకవంతమైన ఆహారం మేధో, శారీరక సామర్థ్యాన్ని మెరుగుపరచడం ద్వారా పిల్లల పెరుగుదలకు, అభివృద్ధికి దోహదపడుతుంది. ►ఐరాస నిర్దేశిస్తున్న సుస్థిర అభివృద్ధి లక్ష్యాల సాధనకు ఆహార భద్రతా ప్రమాణాలు ఎంతగానో తోడ్పడుతున్నాయి. – పంతంగి రాంబాబు, సీనియర్ న్యూస్ ఎడిటర్, సాక్షి సాగుబడి డెస్క్ -
ఎఫ్ఎస్ఎస్ఏఐ సీఈవోగా కమల వర్ధన రావు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఫుడ్ సేఫ్టీ, స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఎఫ్ఎస్ఎస్ఏఐ) నూతన సీఈవోగా ఐఏఎస్ అధికారి జి.కమల వర్ధన రావు బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటి వరకు ఆయన ఇండియన్ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ (ఐటీడీసీ) ఎండీగా ఉన్నారు. 1990 బ్యాచ్ కేరళ క్యాడర్‌కు చెందిన కమల వర్ధన రావు ఆ రాష్ట్ర ప్రభుత్వంలో రెండు విభాగాలకు ప్రిన్సిపల్ సెక్రటరీగా విధులు నిర్వర్తించారు. కేరళ టూరిజం సెక్రటరీగానూ పనిచేశారు. చదవండి: అలర్ట్: ఆధార్ కార్డ్ వినియోగంపై కీలక మార్గదర్శకాలు విడుదల! -
ప్రజారోగ్యం గాల్లో దీపం.. కల్తీ క్యాపిటల్‌గా మారుతున్న నగరం ?
సాక్షి, హైదరాబాద్: నగరంలో కల్తీ ఆహారం కారణంగా ఆస్పత్రులకు వెళ్తున్నవారి సంఖ్య క్రమేపీ పెరుగుతోంది. జీహెచ్ఎంసీతో పాటు ఏ ప్రభుత్వ విభాగం కూడా దీనిపై శ్రద్ధ చూపకపోవడంతో నగరంలో కల్తీకి అడ్డుకట్ట పడటం లేదు. వివిధ రంగాల్లో ముందంజలో నిలుస్తున్న హైదరాబాద్ నగరం కల్తీలో కూడా నెంబర్‌వన్‌గా మారనుందా అనే అనుమానాలు తలెత్తుతున్నాయి. నగరంలో స్ట్రీట్‌ఫుడ్ కేంద్రాలు లెక్కకు మించి ఉండటం తెలిసిందే. వారు సరైన శుచి శుభ్రత పాటించకపోవడంతో తాగే నీటి నుంచి తినే ఆహారపదార్థాల వరకు కలుషితమవుతున్నాయి. కొనుగోలుకు ముందే పప్పులు ఉప్పుల నుంచి నూనెల దాకా జరుగుతున్న కల్తీ వల్ల పరిస్థితులు మరింత విషమంగా మారుతున్నాయి. కల్తీ నియంత్రణకు చర్యలు తీసుకోవాల్సిన జీహెచ్ఎంసీ, ఐపీఎంలలోని ఫుడ్‌సేఫ్టీ అధికారులు పట్టించుకోవడం లేదు. గతంలో జీహెచ్ఎంసీలో కేవలం ముగ్గురు మాత్రమే ఫుడ్ ఇన్స్పెక్టర్లు ఉండేవారు. కోటికి జనాభా ఉన్న నగరానికి ముగ్గురు సరిపోనందునే ఆహారకల్తీని కట్టడి చేయలేకపోతున్నామని ఉన్నతాధికారులు పేర్కొనేవారు. పరిస్థితిని గ్రహించిన ప్రభుత్వం కొత్తగా ఫుడ్‌సేఫ్టీ ఆఫీసర్లను నియమించడంతో వారి సంఖ్య 22కు పెరిగింది. అయినా పరిస్థితి గతం కంటే భిన్నంగా కనిపించడం లేదు. లెక్కల్లో మాత్రం తనిఖీల సంఖ్య పెరిగినప్పటికీ, గుర్తించిన కల్తీదారులపై చర్యలు తీసుకున్న దాఖలాలు లేవు. ఎఫ్ఎస్ఎస్ఏ ఉన్నప్పటికీ.. కల్తీ నిరోధానికి ‘ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ యాక్ట్(ఎఫ్ఎస్ఎస్ఏ) ఉన్నప్పటికీ అది అమలవుతున్న దాఖలాల్లేవు. ఈ యాక్ట్ మేరకు, అన్ని ఆహార విక్రయ కేంద్రాలతోపాటు ఉత్పత్తి కేంద్రాల వివరాలు జీహెచ్ఎంసీ ఆన్లైన్లో అందుబాటులో ఉండాలి. నిరీ్ణత వ్యవధుల్లో తనిఖీలు జరగాలి. కల్తీని బట్టి కఠిన చర్యలుండాలి. ఉత్పత్తి స్థానం నుంచి ప్యాకింగ్, రవాణా, విక్రయం, వినియోగం వరకు ఎక్కడా కల్తీ జరగకుండా ఉండాలంటే తగిన ఎన్ఫోర్స్మెంట్ వ్యవస్థ ఉండాలి. కానీ ఇందులో ఏదీ అమలు జరగడం లేదు. కల్తీ జరిగినట్లు నిర్ధారణ అయితే రూ. 10 లక్షల వరకు జరిమానాతో పాటు ఆరు నెలల నుంచి జీవిత ఖైదు వరకు జైలుశిక్ష విధించవచ్చు. కల్తీని నిర్ధారించేందుకు తగినన్ని పరీక్షల కేంద్రాలుండాలి. ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పటి నుంచి ఒకే పరీక్షా కేంద్రం ఉంది. తెలంగాణ రాష్ట్రానికి ప్రత్యేకంగా పరీక్షాకేంద్రమంటూ లేకపోవడాన్ని జీహెచ్ఎంసీ సర్వసభ్య సమావేశంలోనూ సభ్యులు ప్రస్తావించారు వీటిల్లో కల్తీ ఎక్కువ.. కల్తీ ఎక్కువగా జరిగేందుకు ఆస్కారమున్న వాటిల్లో టీ పొడి నుంచి నూనెల దాకా ఎన్నో ఉన్నాయి. పాలు, తేనె, మసాలా దినుసులు, ఐస్‌క్రీమ్స్, తృణధాన్యాలు, పిండి, కాఫీ, టొమాటో సాస్, విజిటబుల్ ఆయిల్స్, నెయ్యి తదితరమైనవి వీటిల్లో ఉన్నాయి. ఈ కల్తీవల్ల జీర్ణకోశ సమస్యలు తలెత్తుతాయని డాక్టర్లు చెబుతున్నారు. జంతు కళేబరాలు, కొవ్వు , ఎముకల నుంచి తయారు చేస్తున్న కల్తీనూనె నగరంలో ఎక్కువగా వినియోగిస్తున్నట్లు ఫుడ్‌సేఫ్టీ ఆఫీసర్లకు తెలిసినా పట్టించుకోవడం లేదు. చర్యలే లేవు.. పెద్దహోటళ్లనుంచి చిన్నతోపుడు బండ్ల దాకా ఆహారకల్తీపై కానీ.. పరిసరాల పరిశుభ్రత గురించి కానీ పట్టించుకుంటున్నవారు లేరు. పనిఒత్తిడి , వంట చేసుకునే సమయంలేక ఆన్‌లైన్‌ద్వారా బుక్ చేసుకుంటున్న వారు పెరిగిపోతున్నారు. కొన్ని సందర్భాల్లో పాడైపోయిన, తినడానికి పనికిరాని ఆహారాన్నే పంపిణీ చేస్తున్నారు. సంబంధిత అధికారులు ఎవరిపైనా చర్యలు తీసుకోకపోవడంతో శుచి లేకపోవడం, కల్తీ వంటివి నిరాటంకంగా జరుగుతున్నాయి. – భూషణ్‌చారి, అంబర్‌పేట -
ఆ ప్రిన్సిపల్ ఇలా చేశారంటే నమ్మబుద్ధి కావట్లేదు!
భోపాల్: ఫుడ్‌సేఫ్టీ అధికారులు, పోలీసులు కలిసి నిర్వహించిన దాడులలో కల్తీ పాలు పట్టుబడిన ఘటన మధ్యప్రదేశ్‌లోని ఖాదిహర్‌లో చోటు చేసుకుంది. 65 ఏళ్ల రిటైర్డ్ ప్రిన్సిపల్ దీన్‌దయాల్ శర్మ నివాసంలో గురువారం 200 లీటర్ల కల్తీ(సింథటిక్ మిల్క్) పాలను, పామాయిల్, ఇతర రసాయనాలను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. జిల్లా ఆహార భద్రతా అధికారి అవినాష్ గుప్త ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు శుక్రవారం ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. సెక్షన్ 272(అమ్మడానికి పెట్టిన ఆహార పదార్ధాలను కల్తీ చేయడం), సెక్షన్ 273(విషపూరితమైన ఆహారాన్ని అమ్మడం), 420(చీటింగ్) పలు సెక్షన్ల కింద కేసును నమోదు చేశారు. (చదవండి: భయపెడుతున్న బురేవి) ఎఫ్ఆర్లో నమోదు చేసిన వివరాల ప్రకారం.. పోలీసులు దాడి చేయటానికి వెళ్లినప్పుడు ప్రిన్సిపల్ వారిని తప్పుదోవ పట్టించడానికి ప్రయత్నించారని, 250 నుంచి 300 లీటర్ల వరకూ పాలను స్వాధీనం చేసుకున్నామని, ఈ వ్యాపారానికి సంబంధించిన ఎలాంటి రిజిస్ట్రేషన్ అతని వద్ద లేదని తెలిపారు. ఈ దాడులలో పాలతో పాటు 10 కిలోల మాల్టోడెక్స్ట్రిన్ పౌడర్, పామాయిల్ స్వాధీనం చేసుకున్నామని వాటిని పరీక్షల కోసం ల్యాబ్‌కు పంపించామని తెలిపారు. దీనదయాల్ శర్మ సింథటిక్ పాలను తయారు చేసి ప్రజలకు హానికలింగే పదార్థాలను విక్రయిస్తున్నారని ఎఫ్ఐర్లో పేర్కొన్నారు. ఎఫ్ఐఆర్ నమోదు అయిన వెంటనే నిందితుడిని పట్టుకునేందుకు పోలీస్ టీమ్ వెళ్లిందన్నారు. అయితే ఈలోపే అతను పరారయినట్లు, త్వరలోనే నిందితుడిని పట్టకుంటామని సిహోనియా పోలీస్ స్టేషన్ అధికారి తెలిపారు. ఇలా చేస్తారనుకోలేదు.. పదిహేనేళ్ల క్రితం ఖదియాహర్‌లోని గర్ల్స్ ఇంటర్ కాలేజీలో ప్రిన్సిపల్‌గా చేరారని అప్పుడు ఉత్తీర్ణత 17శాతం మాత్రమే ఉండేదని దీనదయాల్ చేరిన తరువాత 70 శాతం అయ్యిందని విద్యానాణ్యత మెరుగుపరచడానికి కృషి చేసిన ఆయన ఇలా చేశారంటే నమ్మబుద్ది కావడం లేదని మాజీ విద్యార్థి, ప్రస్తుత స్థానిక సామాజిక కార్యకర్త జయంత్ అంటున్నారు. (చదవండి: 8న భారత్ బంద్) -
ఏం తింటున్నాం? ఎలా తింటున్నాం?
తిండి కలిగితే కండ కలదోయ్ అని మహాకవి గురుజాడ అప్పారావు చాలా తేలికగా చెప్పేశారు గానీ.. ఈ కాలంలో తిండి ఒక్కదానితోనే కండలు వచ్చేయవు. ఆ కండలతో కలిసి ఆరోగ్యమూ సమకూరాలంటే.. ఏం తింటున్నాం? ఎలా తింటున్నాం? ఎప్పుడు.. ఎక్కడ తింటున్నామన్నదీ ముఖ్యం. అవగాహన లోపం కొంత.. కాలుష్యం మరికొంత కలిసి.. ఆహారం కారణంగా కొన్ని అనారోగ్య సమస్యలను తెలియకుండానే చవిచూస్తున్నాం. నేడు ప్రపంచ ఆహార భద్రత దినోత్సవం సందర్భంగా కొన్ని సంగతులు.. ఆహార భద్రత... అందరి వ్యవహారం ఆహార భద్రత దినోత్సవాన్ని ప్రపంచ ఆరోగ్య సంస్థ 2019లో మొదలుపెట్టింది. తినే తిండి వల్ల కలిగే నష్టాలపై, రాగల ప్రమాదాలపై ప్రజల్లో అవగాహన పెంచడం, తద్వారా మానవ ఆరోగ్యానికి, ఆహార భద్రతకు, ఆర్థిక అభివృద్ధి, వ్యవసాయానికి, పర్యాటకానికి సాయపడటం లక్ష్యం. గతేడాది అడిస్ అబాబా, జెనీవాలో జరిగిన అంతర్జాతీయ సదస్సుల్లో ‘ఆహార భద్రత–భవిష్యత్తు’ అనే అంశంపై చర్చలు జరిగాయి. మేలైన ఆహారం తగినంత అందరికీ లభించడం వెనుక సామాజిక ఆర్థిక కారణాలు ఉండవచ్చుగానీ, దీని ప్రభావం మాత్రం అందరిపై ఉంటుందని డబ్ల్యూహెచ్ఓ స్పష్టం చేస్తోంది. అందుకే ఈ ఏడాది ‘ఆహార భద్రత.. అందరి వ్యవహారం’ అనే ఇతివృత్తంతో కార్యక్రమాలను రూపొందించింది. మనం తినే ఆహారం సురక్షితంగా ఉండేందుకు, మన ఆరోగ్యాన్ని పాడుచేయకుండా ఉండేందుకు పొలంలోని రైతు మొదలుకొని, విధానాలు రూపొందించే ప్రభుత్వాధినేతల వరకూ ప్రతి ఒక్కరు తమదైన పాత్ర పోషించాలని డబ్ల్యూహెచ్ఓ చెబుతోంది. ఫలితంగా కలుషిత ఆహారం తినడం వల్ల వచ్చే వ్యాధుల భారం తగ్గి సమాజం అభివృద్ధి చెందుతుందని అంచనా. వీటితో ఆరోగ్యానికి చేటు ఆహారం కలుషితమయ్యేందుకు, తద్వారా అనారోగ్యం కలిగేందుకు బ్యాక్టీరియా, వైరస్, పరాన్న జీవులు కారణం. అధిక మోతాదులో వాడే రసాయనిక ఎరువులు, నిల్వ చేసేందుకు, రుచి కల్పించేందుకు ఉపయోగించే రసాయనాలు కూడా చేటు చేసేవే. సాల్మనెల్లా, కాంపీలోబ్యాక్టర్, ఈ –కోలీ వంటి బ్యాక్టీరియా ఏటా కొన్ని కోట్ల మందిని అస్వస్థులుగా చేస్తోంది. ఈ బ్యాక్టీరియా కారణంగా తలనొప్పి, వాంతులు, తల తిరగడం, కడుపునొప్పి వంటి సమస్యలు వస్తాయి. గుడ్లు, కోళ్లు, జంతు సంబంధిత ఆహారం ద్వారా సాల్మనెల్లా బ్యాక్టీరియా వ్యాపిస్తుంది. కాంపీలోబ్యాక్టర్, ఈ–కోలి పచ్చిపాలు, సక్రమంగా వండని కోళ్ల ఉత్పత్తులు, నీటి ద్వారా వ్యాపిస్తాయి. పూర్తిగా ఉడికించని సముద్రపు ఉత్పత్తుల ఆహారం ద్వారా హెపటైటిస్– ఏ వైరస్ వేగంగా వ్యాపించడమే కాకుండా.. కాలేయ వ్యాధికి కారణమవుతుంది. కొన్ని రకాల పరాన్నజీవులు చేపల ద్వారా, మరికొన్ని ఇతర ఆహార పదార్థాల ద్వారా వ్యాపిస్తాయి. ఆహార పదార్థాలను ఎక్కువ కాలం నిల్వ చేయడం వల్ల లేదా తేమ ఎక్కువ ఉన్న చోటనిల్వ చేయడం వల్ల వచ్చే బూజు (ఆఫ్లాటాక్సిన్)తోపాటు అనేక ఇతర సహజసిద్ధమైన రసాయనాలు కూడా మన ఆహారాన్ని కలుషితం చేస్తాయి. ఈ విషపదార్థాలు దీర్ఘకాలం శరీరంలోకి పోతే రోగ నిరోధక వ్యవస్థ దెబ్బతింటుంది. శరీరంలో పోగుపడే వాతావరణంలోని కాలుష్యాలు పాలీక్లోరినేటెడ్ బైఫినైల్స్, డయాక్సిన్స్‌లు జంతువుల ద్వారా మన శరీరాల్లోకి చేరుతున్నట్లు తెలుస్తోంది. ఇవి పునరుత్పత్తి వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. సీసం, కాడ్మియం, పాదరసం వంటి విషతుల్యమైన రసాయనాలు కూడా ఆహారం ద్వారా శరీరంలోకి ప్రవేశించి మూత్రపిండాలు దెబ్బతినేందుకు కారణమవుతున్నాయి. ఇలా చేస్తే ఆరోగ్యానికి మేలు మీ ఇంట్లో ఫ్రిడ్జ్ ఉందా? మీ ఆహారం మీకు సమస్యలు సృష్టించకుండా ఉండేందుకు దీన్ని తగిన రీతిలో వాడుకోవడం చాలా అవసరమని చెబుతోంది జాతీయ పోషకాహార సంస్థ. ఇంకా ఏం సూచిస్తోందంటే.. వండిన, వండని ఆహార పదార్థాలను రిఫ్రిజిరేటర్లో వేర్వేరుగా ఉంచాలి. ఆకుకూరలను నిల్వచేసే ముం దే.. వాటి వేళ్లను తొలగించి శుభ్రంగా కడిగి ఉంచడం మేలు. కోడిగుడ్లను మూత ఉన్న కాగితపు అట్ట డబ్బాలో ఉంచి నిల్వ చేయాలి. వండిన ఆహార పదార్థాలను నాలుగు రోజుల కంటే ఎక్కువ ఉంచరాదు. మూతతో కూడిన చిన్నచిన్న పాత్రల్లోనే వండిన ఆహారాన్ని ఉంచాలి. వండిన ఆహార పదార్థాలను కూడా గది ఉష్ణోగ్రతలో ఆరు గంటల కంటే ఎక్కువ సమయం ఉంచకూడదు. ఫ్రిడ్జ్‌లో నిల్వచేసిన పదార్థాలను తినే ముందు వేడి చేసుకోవడం అవసరం. ఆహారం వండే క్రమంలో ఇతర కాలుష్యాలేవీ అందులోకి చేరకుండా చూడాలి. అన్నింటికంటే ముఖ్యం.. ఆహా రం వండే ముం దు చేతులు శుభ్రంగా కడుక్కోవాలి. నిల్వ ఉన్న నీటితో కాకుండా.. నల్లా కింద చేతులు పెట్టి సబ్బుతో శుభ్రంగా కడుక్కోవాలి. కాయగూరలు, పండ్లను తినేముందు కూడా శుభ్రంగా నీటితో కడుక్కోవాలి. ఆహారం వండేటప్పుడు వీలైనంత మేరకు శుభ్రమైన నీటినే వాడాలి. æ సురక్షితమైన మంచినీటి వ్యవస్థ లేనప్పుడు ఆ నీటిని మరిగించి వాడొచ్చు. వంటపాత్రలోకి నీరు పోసేందుకు విడిగా గ్లాసుల్లాంటివి వాడటం మేలు. ఇల్లు, వంటగది శుభ్రంగా ఉంచుకోవాలి. -
కల్తీకి కొత్త చట్టంతో చెక్!
సాక్షి, హైదరాబాద్: ఆహార కల్తీ నియంత్రణకు కొత్త చట్టాన్ని తీసుకురానున్నట్లు పురపాలకశాఖ మంత్రి కేటీఆర్ స్పష్టంచేశారు. ఇప్పటికే అమలులో ఉన్న కేంద్ర చట్టానికి అనుబంధంగా దీన్ని ప్రవేశపెట్టనున్నట్లు తెలిపారు. దీని ప్రకారం ప్రస్తుతం విధిస్తున్న జరిమానాలను పదింతలు చేస్తామన్నారు. సోమవారం అసెంబ్లీ ప్రశ్నోత్తరాల్లో ఆహారభద్రత పర్యవేక్షణపై మజ్లిస్ సభ్యులు ముంతాజ్ అహ్మద్ ఖాన్, జాఫర్‌హుస్సేన్ తదితరులు అడిగిన ప్రశ్నకు సమాధానమిచ్చిన మంత్రి..ప్రజారోగ్యాన్ని కాపాడేందుకు ఆహారనాణ్యతకు పెద్దపీట వేస్తున్నామని, త్వరలోనే 26 ఫుడ్ ఇన్స్పెక్టర్ల పోస్టులను భర్తీ చేయనున్నట్టు తెలిపారు. వారు ఒక్కొక్కరు నెలకు 150 నమూనాలను సేకరించి పరిశీలిస్తున్నారని, ఈ భారాన్ని తగ్గించేందుకు ఇటీవల సంచార ఆహార ప్రయోగశాలను ఏర్పాటు చేశామన్నారు. మార్చినాటికీ టీ హబ్–2 రాయదుర్గంలో రూ.276 కోట్లతో మూడెకరాల్లో నిర్మిస్తున్న టీ హబ్–2 వచ్చే ఏడాది మార్చినాటికి అందుబాటులోకి వస్తుందని ఎమ్మెల్యేలు వివేకానంద్, బాల్క సుమన్, బిగాల గణేశ్ అడిగిన ప్రశ్న కు కేటీఆర్ తెలిపారు. ఇది దేశంలోనే విజయవంతమైన ఇంక్యుబేటర్ కాగా.. ప్రపంచంలోనే అతిపెద్ద ఇంక్యుబేటర్‌గా టీహబ్–2 నిలుస్తుందన్నారు. 3.50 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ప్రతిపాదించిన ఈ ఇంక్యుబేటర్ రాకతో వేయి అంకుర ప రిశ్రమలకు అవకాశం కలుగుతుందన్నారు. గోవా, ఢిల్లీ, అసోం రాష్ట్రాలకు సాంకేతిక సహకారం అం దిస్తున్నామన్నారు. టీహబ్‌కు ఆర్బీఐ, నీతి ఆయోగ్‌లాంటి సంస్థల నుంచి ప్రశంసలందాయని, ఐటీ దిగ్గజ కంపెనీల అధినేతల అభినందనలు అందు కున్నామన్నారు. టీహబ్–2తో 4 వేల మందికి ఉపాధి లభిస్తోందన్నారు. గ్రామీణ ప్రాంతంలోని ఆవిష్కరణలను ప్రోత్సహిస్తున్నామన్నారు. ఐదేళ్లలో మైనింగ్ ఆదాయం 130% గనుల ద్వారా 2008–2014 వరకు రూ.7,376 కో ట్ల ఆదాయం రాగా.. అప్పటి నుంచి గత నెలనాటికి రూ.16,937 కోట్ల రాబడి లభించిందని కేటీఆర్ తెలిపారు. ఇది గతంతో పోలిస్తే 130% అధి కమన్నారు. కొత్త ఇసుక తవ్వక విధానం ప్రవేశపెట్టిన తర్వాత ఆదాయం పెరిగిందని చెప్పారు. గత పాలకుల హయాంలో ఈ ఆదాయం ఎక్కడకు పోయిందో కాంగ్రెస్ సభ్యులు ఆత్మవిమర్శ చేసుకోవాలన్నారు. ములుగులో గిరిజనుల పేరిట గిరిజనేతరులు కాంట్రాక్టులు దక్కించుకునేవారని, దానికి ముకుతాడు వేసి గిరిజన సహకార సంఘాలకు ఇసుక కాంట్రాక్టులు ఇవ్వడం ద్వారా 11.30 వేల కుటుంబాలకు రూ.83 కోట్ల ప్రయోజనం కలి గిందని కేటీఆర్ అన్నారు. డీఎంఎఫ్ నిధులను ఆ యా ప్రాంతాల్లోనే ఖర్చుపెట్టేలా విధానపర నిర్ణయం తీసుకోనున్నట్లు వెల్లడించారు. ఇద్దరికి కూడా విద్యానిధి ఓవర్సీస్ విద్యానిధి కింద కుటుంబంలో ఒకరికే స్కాలర్షిప్ మంజూరు చేస్తున్నప్పటికీ, దరఖాస్తు చేసుకుంటే ఇద్దరికి కూడా ఆర్థిక సాయం చేయనున్నట్లు బాల్కసుమన్, హరిప్రియానాయక్, శంకర్‌నాయక్ అడిగిన ప్రశ్నకు మంత్రి కొప్పుల జవాబిచ్చారు. ఎంబీబీఎస్ విద్యార్థులు కూడా విదేశా ల్లో ఈ స్కాలర్షిప్ కింద చదువుకునేందుకు వెసులుబాటు కల్పించే అంశాన్ని పరిశీలిస్తామన్నారు. తాటిచెట్లు ఎక్కేందుకు యంత్రాల పరిశీలన తాటిచెట్లు ఎక్కడానికి ట్రీ క్లైంబింగ్ మెషీన్లు అనువు కాదని పరిశీలనలో తేలిందని ఎక్సైజ్‌శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ స్పష్టం చేశారు. అనువైనవి అందుబాటులో ఉంటే కొనుగోలు చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. మరో ప్రశ్నకు సమాధానమిస్తూ.. గుడుంబా నిర్మూలన, దాని తయారీదారులకు పునరావాసం కల్పించడంలో ప్రభుత్వం చిత్తశుద్ధితో వ్యవహరిస్తోందని స్పష్టం చేశారు. -
అలా అయితే గ్రీన్‌కార్డ్ రాదు!
వాషింగ్టన్: అమెరికా గ్రీన్‌కార్డ్ పొందేందుకు ఎదురుచూస్తున్న ఆశావహులకు ఆ దేశ ప్రభుత్వం చేదువార్త చెప్పింది. ఫుడ్ స్టాంప్స్(అల్పాదాయ వ్యక్తులకు ఆహారం అందించేందుకు ప్రభుత్వం చవకగా ఇచ్చే వోచర్లు), వైద్య సాయం(మెడిక్ఎయిడ్), గృహ సదుపాయం(హౌజింగ్ అసిస్టెన్స్) తదితర సౌకర్యాలు కోరుకుంటున్న వారికి గ్రీన్ కార్డ్ నిరాకరించే అవకాశముందని స్పష్టం చేసింది. గ్రీన్‌కార్డ్ పొందినవారికి అమెరికాలో శాశ్వతంగా నివసించే అవకాశంతో పాటు పలు ఇతర ప్రయోజనాలు లభిస్తాయి. అమెరికా తమ పౌరులకు ఇచ్చే ఇలాంటి ప్రభుత్వ సౌకర్యాలను తాము భవిష్యత్తులో కూడా ఆశించబోమని కాన్సులార్ ఆఫీసర్‌ను నమ్మించాల్సి ఉంటుందని పేర్కొంటూ డిపార్ట్మెంట్ ఆఫ్ హోంల్యాండ్ సెక్యూరిటీ తాజాగా నిబంధనలను జారీ చేసింది. అమెరికాకు రావాలనుకునే లేదా అమెరికాలో ఉండాలనుకునే విదేశీయులు తమ ఖర్చులను తామే భరించేలా, అమెరికా ప్రభుత్వం అందించే సౌకర్యాలపై ఆధారపడకుండా ఉండేలా ఈ తాజా నిబంధనలు తోడ్పడుతాయని వైట్ హౌజ్ ఓ ప్రకటన విడుదల చేసింది. ఒక స్థాయిని మించి ప్రభుత్వ సౌకర్యాలు పొందే వ్యక్తులను ‘పబ్లిక్ చార్జ్(ప్రజలపై భారం)’గా పరిగణిస్తారు. అలా పబ్లిక్ చార్జ్‌గా మారే అవకాశమున్న వారిని దేశంలోకి అడుగుపెట్టకుండానే నిరోధిస్తారు. ఇప్పటికే దేశంలో ఉంటున్నవారైతే.. వారి ఇమిగ్రేషన్ స్థాయిని మార్చుకునే అవకాశం ఇవ్వరు. విదేశీయులపై ప్రజాధనం ఖర్చుకాకూడదనే ఈ నిబంధనలను అధ్యక్షుడు ట్రంప్ తెరపైకి తెచ్చారని వైట్‌హౌజ్ పేర్కొంది. ‘ఈ చట్టం 1996 నుంచే ఉంది కానీ కఠినంగా అమలు చేయలేదు’ అని పేర్కొంది. పన్ను చెల్లింపుదారులపై భారం పడకూడదనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు అమెరికా పౌర, వలస సేవల సంస్థ(యూఎస్సీఐఎస్) డైరెక్టర్ కెన్ స్పష్టం చేశారు. ఈ నిబంధనల వల్ల గ్రీన్‌కార్డ్ ఆశావహులు తమ ఆదాయాన్ని పెంచుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని వాల్ స్ట్రీట్ జర్నల్ పత్రిక వ్యాఖ్యానించింది. -
మెక్‌డొనాల్డ్స్‌కు వార్నింగ్ నోటీసు
ముంబై : మెక్‌డొనాల్డ్స్ రెస్టారెంట్లు తీవ్ర వివాదంలో కూరుకుపోతున్నాయి. ఓ వైపు కన్నాట్ ప్లాజా రెస్టారెంట్ల(సీపీఆర్ఎల్) 50:50 జాయింట్ వెంచర్ విక్రమ్ బక్షితో వివాదం, మరోవైపు ఆ రెస్టారెంట్లలో ఆహార భద్రత ప్రమాణాల ఉల్లంఘన మెక్‌డొనాల్డ్స్‌ను ఇరకాటంలో పడేస్తున్నాయి. తాజాగా ముంబైలోని సెంట్రల్ రీజన్లో గల మెక్‌డొనాల్డ్స్ రెస్టారెంట్‌పై స్టేట్ ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ (ఎఫ్‌డీఏ) జరిపిన అకస్మిక దాడిలో, ఆ అవుట్లెట్ ఆహార భద్రతా ప్రమాణాలను పాటించడం లేదని తేలింది. అకస్మాత్తుగా జరిపిన తనిఖీలో హైస్ట్రీట్ ఫీనిక్స్‌లోని మెక్ డొనాల్డ్స్ అవుట్లెట్ ఆహార భద్రతా ప్రమాణాల చట్టాన్ని ఉల్లంఘించిందని తేలిందని ఎఫ్‌డీఏ రిపోర్టు చేసింది. అనారోగ్య పరిస్థితుల్లో ఆహారాన్ని వండుతున్నారని, తమ లైసెన్సు కాఫీని కూడా ప్రాముఖ్యంగా చూపించడం లేదని పేర్కొంది. ఈ రెస్టారెంట్ చైన్‌కు ప్రస్తుతం వార్నింగ్ నోటీసు జారీచేశామని, ఒకవేళ పరిస్థితులు మెరుగుపడకపోతే, వచ్చే 15 రోజుల్లో కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపింది. సౌత్, వెస్ట్ రాష్ట్రాల్లో మెక్‌డొనాల్డ్స్ ఫ్రాంచైజీని హార్డ్‌క్యాసిల్ రెస్టారెంట్లు నిర్వహిస్తున్నాయి. వారు కూడా ఈ విషయాన్ని చాలా సీరియస్‌గా తీసుకున్నారు. సాధారణ తనిఖీల్లో భాగంగా ఎఫ్‌డీఏ నుంచి కొన్ని ప్రశ్నలను ఎదుర్కొన్నామని, వాటికి సమాధానాలను కూడా ఎఫ్‌డీఏకి సమర్పించామని కంపెనీ ఓ ప్రకటనలో తెలిపింది. -
మార్కెట్లో విషతుల్య ఆహారోత్పత్తులెన్నో?
సాక్షి, న్యూఢిల్లీ : పుష్పమ్ ఫుడ్స్ కంపెనీ మార్కెట్లో విక్రయిస్తున్న 'రెస్ట్‌లెస్ జిన్సెంగ్' అనే ఎనర్జీ డ్రింక్‌లో ప్రమాదకరమైన 'కఫేన్, జిన్సెంగ్' మిశ్రమం ఉందని భారత ఆహార భద్రతా ప్రమాణాల సంస్థ (ఎఫ్ఎస్ఎస్ఏఐ)కు చెందిన శాస్త్రవేత్తలు కనుగొన్నారు. ప్రమాదకరమైన మిశ్రమం కారణంగా ఈ ఎనర్జీ డ్రింక్ తాగినవారికి ఎంత ఎనర్జీ వస్తుందో తెలియదుగానీ గుండెపోటు, రక్తపోటు రావడం ఖాయమని వారు తేల్చిచెప్పారు. వినియోగదారుల ఫిర్యాదు మేరకే ఆహార భద్రతా సంస్థ తరఫున శాస్త్రవేత్తలు స్పందించారనడం ఇక్కడ గమనార్హం. ఈ ఉత్పత్తిని అమ్ముతున్న కంపెనీకి కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం 2015, జూన్‌లో 'నో అబ్జెక్షన్ సర్టిఫికేట్' జారీ చేసింది. ఆహార భద్రతా అధికారులతోపాటు వినియోగదారుల సంఘాలు గోల చేయడంతో విష రసాయనం వెలుగులోకి వచ్చిన ఏడు నెలల తర్వాత కేంద్ర ప్రభుత్వం ఈ ఉత్పత్తికి ఎన్ఓసీని రద్దు చేసింది. ఈలోగా మార్కెట్లోకి విడుదల చేసిన ఎనర్జీ డ్రింక్ స్టాక్‌నంతా పుష్పమ్ ఫుడ్స్ కంపెనీ అమ్ముకోగలిగింది. ఈ ఏడు నెలలపాటు ఆ ఎనర్జీ డ్రింక్‌ను తాగిన వినియోగదారుడు అనారోగ్యానికి గురవుతూనే ఉన్నాడన్న మాట. అవసరమైన ముందస్తు తనిఖీలు లేకుండా 'మా ఉత్పత్తులు సురక్షితం' అంటూ కేవలం కంపెనీలు ఇచ్చే భరోసాపైనా మార్కెట్లోకి విడుదలైన ఇలాంటి ఆహార ఉత్పత్తులు దాదాపు 800 రకాలు ఉన్నాయి. వాటన్నింటినిపై పరిశోధనలు జరిపితే ఎన్ని జబ్బులకు దారితీస్తున్న విష మిశ్రమాలున్నాయో! 'జిన్సెంగ్' ఉత్పత్తిని నిలిపివేయడానికి కేంద్ర ప్రభుత్వానికి ఏడు నెలలు పట్టడానికి కారణం అందులో ప్రత్యక్ష పాపం తనది కూడా కావడం. ఆహార పరిశ్రమ నుంచి వస్తున్న ఒత్తిడికి తట్టుకోలేకనో లేదా చేతులు తడుపుకోవాలనే తహతహో తెలియదుగానీ ఆహార భద్రత ప్రమాణాలను భారత ఆహార భద్రతా ప్రమాణాల సంస్థ 2012 నుంచి సడలిస్తూ వస్తోంది. ఇక కేంద్రంలోని ఆహార శాఖా కార్యాలయంలోని డాక్యుమెంట్ల ప్రకారం 2014, ఆగస్టు నెలలో కేంద్రంలోని ప్రధాన మంత్రి కార్యాలయం స్వయంగా జోక్యం చేసుకొని సడలింపు పేరిట నిబంధనలను నీరుగార్చింది. ఆహార భద్రతా సంస్థ అధికారులతోపాటు, కేంద్ర ఆహార శుద్ధి శాఖ, పారిశ్రామిక వర్గాలతో ప్రధాన మంత్రి ప్రిన్సిపల్ కార్యదర్శి సమావేశమై కొత్త ప్రమాణాలను నిర్దేశించారు. వీటిని అప్పటి ఆహార భద్రతా సంస్థ సీఈవో వైఎస్ మాలిక్ తీవ్రంగా వ్యతిరేకించారు. అదే ఏడాది మే నెలలో ఈ ప్రమాణాలు ప్రమాదరమైనవంటూ నచ్చ చెప్పేందుకు పారిశ్రామికవేత్తలకు ఆయన బహిరంగ లేఖ కూడా రాశారు. 'మా ఆహారోత్పత్తులు సురక్షితం' అంటూ కంపెనీలే భరోసా ఇస్తున్నప్పుడు మనకెందుకు అభ్యంతరమంటూ మాలిక్‌కు నచ్చచెప్పేందుకు ప్రధాని ప్రధాన కార్యదర్శి ప్రయత్నించారు. ఫలితం లేకపోవడంతో మాలిక్‌ను ఆహార భద్రతా సంస్థ నుంచి బదిలీ చేశారు. ఇంతకు ఆయన వ్యతిరేకించిన అంశాలేమిటీ? శుద్ధి చేసిన ఆహార పదార్థాలలో సాధారణంగా మూడు రకాల పదార్థాలు లేదా మిశ్రమాలు ఉంటాయి. ఒకటి ప్రొప్రైటరీ ఫుడ్స్, రెండు నావెల్ ఫుడ్స్, మూడు యాడింగ్స్. ప్రొప్రైటరీ ఫుడ్స్ అంటే, మనం తినే రకరకాలు దినుసులు. కెఫిన్, జిన్సెంగ్ కూడా ఈ రకం పదార్థాలే. విడివిడిగా ఈ రెండు పదార్థాలు ఆరోగ్యానికి మంచివే. కానీ వీటి మిశ్రమం వల్ల ప్రమాదరకమైన రసాయనం ఉత్పత్తి అవుతుంది. ఇక రెండోది నావెల్ ఫుడ్స్. కొత్త రుచుల ఆహారం లేదా ఆహార మిశ్రమం. ఇక యాడింగ్స్ అంటే ఆ ఆహార పదార్థాలను ఎక్కువ కాలంపాటు నిల్వ ఉంచేందుకు ఉపయోగించే మిశ్రమాలు, రసాయనాలు. నావెల్ ఫుడ్స్..కంపెనీ యాజమాన్యం ఇష్ట ప్రకారం ఉంటాయి. ప్రొప్రైటరీ ఫుడ్స్, యాడింగ్స్ మాత్రం ఆహార భద్రతా సంస్థ శాస్త్రవేత్తలు సూచించిన ప్రమాణాలకు తగ్గట్టుగా ఉండాలి. ఏయే పదార్థాలు, ఏయే మిశ్రమాలు ఏ స్థాయిలో ఉండాలో ఆహార సంస్థ భద్రతా ప్రమాణాలు సూచిస్తాయి. పారిశ్రామిక వర్గాల ఒత్తిడి ప్రొప్రైటరీ ఫుడ్స్, యాడింగ్స్ వల్ల అనవసరంగా తమకు కాలయాపన అవుతోందని, వీటిని సడలించాలని ఎప్పటి నుంచో పారిశ్రామిక వర్గాలు కేంద్ర ప్రభుత్వాలపై ఒత్తిళ్లు తెస్తున్నాయి. ఆ ఒత్తిళ్లకు లొంగి 2012లో అప్పటి యూపీఏ ప్రభుత్వం ప్రమాణాలను కొంత సడలించగా, 2014లో అధికారంలోకి వచ్చిన బీజీపీ ప్రభుత్వం మరింతగా సడలించింది. అయితే పలు అవాంతరాలు, కోర్టు కేసుల కారణంగా సడలించిన నిబంధనలు 2016, జనవరి నుంచి అమల్లోకి వచ్చాయి. ఆహార భద్రతకు సంబంధించి పీఎంవో ఆధ్వర్యంలో కేంద్ర ఆహార శాఖ తీసుకున్న నిర్ణయాలకు పార్లమెంట్ ఆమోదం లేదన్న కారణంగా ముంబై హైకోర్టు కొట్టి వేయడం, దానిపై కేంద్రం సుప్రీం కోర్టుకు వెళ్లడం తదితర కారణాల వల్ల జాప్యం జరిగింది. ఇంత జాప్యం జరిగిందన్న కారణంగా కేంద్ర ప్రభుత్వం బాధ్యతా రహితంగా భద్రతా ప్రమాణాలను నోటిఫై చేయకుండానే అమల్లోకి తెచ్చింది. సడలించిన ప్రమాణాలేమిటీ? సడలించిన ప్రమాణాల ప్రకారం ప్రొప్రైటరీ ఫుడ్స్ విషయంలో ఆహార సంస్థ ఆమోదించిన పదార్థాలు లేదా దినుసులు ఉపయోగించాలి. అయితే వాటిని వేటివేటితో కలుపుతారో, ఏ మోతాదులో కలుపుతారో ముందస్తు అనుమతి తీసుకోవాల్సిన అవసరం లేదు. గతంలో ఈ నిబంధన ఉండేది. ఇక్కడ కెఫేన్, జిన్సెంగ్ భారత ఆహార సంస్థ ఆమోదించినవే. అయితే వాటి మిశ్రమానికి ఆహార సంస్థ ఆమోదం లేదు. ఈ రెండింటిని కలపడం వల్ల జిన్సెంగ్ ప్రమాదకర డ్రింక్‌గా మారింది. అలాగే ఎక్కువ కాలం ఆహార పదార్థాలను నిల్వ ఉంచేందుకు ఉపయోగించే పదార్థాలు కూడా ఆహార సంస్థ ఆమోదించినవే ఉండాలి. అయితే అది ఏ మోతాదులో ఉండాలో యాజమాన్యం ఇష్టం. ఇంతకుముందు ప్రమాణాలు పాటించాల్సి వచ్చేది. ప్రజల ఆరోగ్యానికి అసలైన ప్రమాదకారి ఈ నిల్వ ఉంచే పదార్థమే. అయితే ఇది మోతాదు మించితే మనుషుల ప్రాణాలకే ముప్పు. వ్యాపారులు లాభాపేక్షతో తమ ఉత్పత్తులు మార్కెట్లో త్వరగా పాడవకుండా ఉండేందుకు ఈ పదార్థాల మోతాదును ఎక్కువ కలుపుతారనే విషయం ఎవరైనా గ్రహించగలరు. 'మ్యాగీ' నూడిల్స్‌లో మోతాదుకు మించి సీసం ఉందన్న కారణంగా కొంతకాలం వాటి ఉత్పత్తులను మార్కెట్లో నిలిపేసిన విషయం తెల్సిందే. ఇంకా అప్పటికీ కేంద్ర ప్రభుత్వం కొత్త నిబంధనలు నోటిఫై కాలేదు. గుడ్డిగా ప్రోత్సహించడంతోనే భారతీయ మార్కెట్లో ఆహారోత్పత్తుల కంపెనీలను ప్రోత్సహించాలనే అత్యుత్సాహంతో కేంద్ర ప్రభుత్వాలు భద్రతా ప్రమాణాలను సడలిస్తూ వస్తున్నాయి. 2025 నాటికి దేశంలో ఏటా 72 లక్షల కోట్ల ఈ ఆహరపదార్థాల వ్యాపారం నడుస్తుందని, వాటిలో ఏటా 60 లక్షల కోట్ల రూపాయలు లాభాలే ఉంటాయన్నది ఓ అంచనా. ప్రజల ఆరోగ్యాన్ని, భద్రతా ప్రమాణాలను పణంగా పెట్టినప్పుడు ఇన్ని కోట్ల వ్యాపారం ఎవరి కోసం!? అమెరికా, యూరోపియన్ యూనియన్లు తమ ఆహార భద్రతా ప్రమాణాలను రోజురోజుకు కఠినం చేస్తూ వెళుతుంటే మన దేశం సడలిస్తూ రావడం విచిత్రం. -
ఈ నగరానికి ఏమైంది..?
కల్తీ క‘మాల్’ ఆరోగ్యం ఢమాల్ సిటీపై కల్తీ కేటుగాళ్ల పంజా ►జోరుగా ఆహారపదార్థాల కల్తీ.. గ్రేటర్ వాసుల్లో ఆందోళన ►నూనె, పాలు, తేనె, బియ్యం, మసాలాలు... దేన్నీ వదలని వైనం ► తొలుత నిత్యావసరాల వ్యాపారం..ఆపై కల్తీ వైపు పయనం ►ఉత్తరాది రాష్ట్రాల నుంచి కల్తీ ముడిసరుకుల దిగుమతి ► ప్రమాదకర పదార్థాలతో ఆరోగ్యానికి తీవ్ర హాని ►తనిఖీలు..పర్యవేక్షణ లేకే పరిస్థితి తీవ్రం ►కోటి మంది జనాభాకు ఇద్దరే ఫుడ్ ఇన్స్పెక్టర్లు ►ధనదాహంతో విచ్చలవిడిగా కల్తీ చేస్తున్న వ్యాపారులు ► తాజాగా కలకలం రేపుతున్న ప్లాస్టిక్ బియ్యం ►మాఫియాగా సాగుతున్న వ్యవహారంపై పోలీసు నజర్ ► అమలుకు నోచని ‘ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్’ చట్టం సిటీలో ‘కల్తీ’ రాజ్యం నడుస్తోంది. కాలుష్యంతో గాలి..నీరు కలుషితమవుతుండగా..వ్యాపారుల ధనదాహంతో తినే ఆహారమూ కల్తీమయం అవుతోంది. ఆరోగ్యం హరిస్తోంది. నిత్యావసరాలైన వంట నూనెలు, బియ్యం, టీ పొడి నుంచి అల్లం వెల్లుల్లి పేస్ట్, మసాలా దినుసుల వంటి ముఖ్యమైన పదార్థాలను పూర్తిగా నకిలీవి సృష్టిస్తున్నారు. ప్రమాదకర..విషపూరిత రసాయనాలు కలిపి అసలు ఏవో.. నకిలీ ఏవో తెలియకుండా చేస్తూ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. ఆహార తనిఖీలు, పర్యవేక్షణ చేపట్టి కల్తీకి అడ్డుకట్ట వేయాల్సిన ఫుడ్ సేఫ్టీ విభాగం నిర్వీర్యంగా మారింది. ‘ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్’ చట్టం అమలుకు నోచడం లేదు. కోటి జనాభా కలిగిన నగరంలో ఇద్దరే ఫుడ్ ఇన్స్పెక్టర్లు ఉన్నారంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. సిటీబ్యూరో: సిటీలో ఆహార కల్తీ దందా మాఫియాగా సాగుతోంది. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు దీన్ని సీరియస్‌గా తీసుకున్న టాస్క్‌ఫోర్స్, ఎస్ఓటీ, జోనల్ పోలీసులు వరుస దాడులు చేస్తున్నారు. మంగళవారం హైదరాబాద్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు కల్తీ పాలు, తేనె, అల్లంపేస్ట్ తదితరాలను పట్టుకోగా... బుధవారం రాచకొండ ఎస్ఓటీ అధికారులు నకిలీ సాస్ దందాను గుట్టురట్టు చేశారు. వ్యాపారులే దారితప్పి... ఈ కల్తీ దందాలో చిక్కుతున్న వారిలో అత్యధికం వ్యాపారులే ఉంటున్నారు. తొలుత ఏదో ఒక నిత్యావసర సరుకులు, పప్పుదినుసుల వ్యాపారాన్ని ప్రారంభించి పక్కాగానే చేస్తున్నారు. ఉత్తరాది నుంచి ముడిసరుకులు... ఈ నకిలీ ఆహారపదార్థాలు తయారు చేయడానికి కావాల్సిన ముడిసరుకును ఉత్తర్‌ప్రదేశ్‌లోని ఫైజాబాద్, ముంబై, ఢిల్లీల నుంచి ఖరీదు చేస్తున్నారు. వీటన్నింటినీ ఎలాంటి బిల్లులు లేకుండా కొన్ని ట్రాన్స్‌పోర్టు కంపెనీల ద్వారా కిలోకు రూ.5 చొప్పున అదనంగా చెల్లిస్తూ రప్పిస్తున్నారు. ఢిల్లీ నుంచి హైదరాబాద్‌కు వచ్చే ముడిసరుకుకు కిలోకు రూ.6 చొప్పున అదనంగా చెల్లిస్తున్నారు. రాయిపూర్, ఉత్తర్‌ప్రదేశ్‌ల నుంచి ఎగుమతి, దిగుమతుల్ని బిల్లులు లేకుండా నిర్వహించే అనేక ట్రాన్స్పోర్ట్ కంపెనీలు సిటీలో ఉన్నాయి. ఇంతటి హేయమైన దందాలు నిర్వహిస్తున్న వీరిపై కఠినం చర్యలు తీసుకోవడానికి అసవరమైన చట్టాలు మాత్రం లేవని చెప్తున్నారు. వీరిపై దాడులు చేసేది పోలీసులైతే... చర్యలు తీసుకోవాల్సింది మాత్రం ఫుడ్ ఇన్స్పెక్టర్లు. ఈ తరహా నేరాలు చేసే వారికి అరెస్టు చేసే అవకాశం లేదు. కేవలం ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్ట్స్ యాక్ట్–2006 కింద కేసు నమోదు చేస్తారు. నకిలీ సరుకుల తయారీ ఇలా... మిరియాలు: ఐదు కేజీల సింథటిక్ గమ్, 10 కేజీల మైదా, 3 గ్రాముల రెడ్ ఆక్సైడ్, 5 గ్రాముల ఆర్టిఫీషియల్ రెడ్ ఆక్సైడ్లను 15 లీటర్ల నీటిలో కలుపుతారు. ఈ ద్రావణాన్ని 20 కేజీల బొప్పాయి విత్తనాల్లో (నల్లగా ఉండే భాగం) వేసి కలపడం ద్వారా మిరియాలు తయారు చేస్తున్నారు. మూడో రకం క్వాలిటీ నల్ల మిరియాలను ఫస్ట్ క్వాలిటీగా మార్చడానికి ఇలాంటి ద్రావణాన్నే వినియోగిస్తున్నారు. గసగసాలు: ఐదు కేజీల రాళ్ల పొడి, 30 కేజీల మైదా, 5 గ్రాముల పెయింట్స్ వైటనర్, 30 కేజీల గ్లూకోజ్, 2 కేజీల లిక్విడ్ జాంగ్రీలను 10 లీటర్ల నీటిలో కలిపి ద్రావణం సిద్ధం చేస్తారు. దీన్ని 60 కేజీల బొంబాయి రవ్వలో కలపడం ద్వారా 115 కిలోల గసగసాలను తయారు చేస్తున్నారు. ఫైన్‌క్వాలిటీ కోసం నాసిరకం వాటికి సోడియం హైడ్రోసల్ఫేట్ ఒక కేజీ, పెయింట్స్ వైటనర్ 5 లీటర్ల నీటిలో కలిపి 50 కేజీలు తయారు చేస్తున్నాడు. జీలకర్ర: ఒక కేజీ సోడియం హైడ్రోసల్పేట్, 25 కేజీల కార్వే స్వీట్స్, పెయింట్స్ వైటనర్‌ను వినియోగించి జీలకర్రను తయారు చేస్తున్నారు. చిన్న చిన్న గడ్డి పొరకలు, బొంబాయి చీపురు కట్టల నుంచి రాలిన ముక్కలపై రసాయినాలు జోడించి దీన్ని సిద్ధం చేస్తున్నారు. శొంఠి: పనికిరాని అల్లాన్ని సేకరిస్తున్న నకిలీ రాయుళ్ళు దాన్ని పూర్తిగా ఆరబెడుతున్నారు. ఆ తర్వాత కాంక్రీట్ మిక్సింగ్ చేసే మాదిరి చిన్నపాటి యంత్రంలో దీన్ని వేస్తున్నారు. దీంతోపాటు సున్నం, ఫెవికాల్, నీలం కలిపి మిక్సింగ్ చేసి ఆరబెట్టడం ద్వారా నకిలీ శొంఠి తయారు చేస్తున్నారు. నూనె: కల్తీ సరుకుల తయారీలో నూనెది అత్యంత దారుణమైన విధానం. జంతు వ్యర్థాలతో నూనె తయారు చేస్తున్న అనేక యూనిట్లను పోలీసులు గుర్తించి చర్యలు తీసుకున్నారు. వివిధ రకాలైన జంతువుల ఎముకల్ని సేకరిస్తున్న దుండగులు వాటిని నిర్ణీత పద్ధతిలో వేడి చేయడం ద్వారా నూనె ఉత్పత్తి చేస్తున్నారు. అల్లం వెల్లుల్లి పేస్ట్: కుళ్లిన బంగాళ దుంపలు, అరటి బోదెలు, రసాయనాలు కలిపి అల్లం వెల్లుల్ల పేస్ట్ సిద్ధం చేసేస్తున్నారు. వాసన కోసం మాత్రం అతి తక్కువ పాళ్ళల్లో అల్లం, వెల్లుల్లి వాడుతున్నారు. వనస్పతిని వినియోగించి నెయ్యి, కలర్ కోటింగ్‌తో నాసిరకం సోంపు, గడువు చెల్లిన చాక్లెట్లను రీ–సైకిల్ చేయడం ద్వారా కొత్తవి, గ్లూకోజ్ వాటర్–చెక్కెర పాకంతో తేనె, బోరు నీటితో మినరల్ వాటర్ తయారు చేయడంలోనూ అనేక మంది సిద్ధహస్తులున్నారు. రసాయన పాలు: బోయిన్పల్లి, బేగంబజార్ తదితర ప్రాంతాల నుంచి పాలపొడి, హైడ్రోజన్ పెరాక్సైడ్ రసాయనాన్ని కొనుగోలు చేస్తున్నారు. పది లీటర్ల పాలు తయారు చేయడానికి కేజీ పాలపొడి, తొమ్మిది లీటర్ల నీరు, లీటరు అసలు పాలతో పాటు 15 మిల్లీ లీటర్ల హైడ్రోజన్ పెరాక్సైడ్ వినియోగిస్తున్నారు. ఈ రసాయనం పాలు చిక్కగా ఉండటానికి ఉపయోగపడుతుంది. అధిక పాల దిగుబడి కోసం నిషేధిత ఇంజక్షన్లు, టానిక్స్ వాడకమూ ఉంది. పాల కల్తీలో మరో తంతు... కొన్ని ముఠాలు వివిధ ప్రాంతాల నుంచి ఖాళీ పాల ప్యాకెట్లు సేకరిస్తున్నాయి. రోజూ తెల్లవారుజామునే కంపెనీల నుంచి డీలర్ల వద్దకు పాల ప్యాకెట్లు వస్తాయి. వాటిని సేకరిస్తున్న దుండగులు తమ డెన్లకు తీసుకువెళ్తున్నారు. అక్కడ ఆ ప్యాకెట్లను కత్తిరించి, వాటిలో ఉన్న పాలను బకెట్లలో పోస్తారు. ఇలా తీసిన ప్రతి 50 లీటర్ల పాలలోనూ 15 లీటర్ల నీరు కలుపుతారు. ఒక్కోసారి కలుషిత నీటినీ కలుపుతున్నారు. అలా కల్తీ చేసిన పాలను తిరిగి అవే ప్యాకెట్లతో పాటు ముందే తెచ్చుకున్న ఖాళీ ప్యాకెట్లలోను నింపి ఎలక్ట్రానిక్ ప్యాకింగ్ మిషన్లతో సీల్ వేస్తారు. ఈ ప్రక్రియ మొత్తం 45 నిమిషాల్లోనే పూర్తవుతుంది. ఆపై ప్యాకెట్లను బట్వాడా చేస్తారు. ఇద్దరు కల్తీరాయుళ్ళ ఆటకట్టు సిటీబ్యూరో: రసాయనాలతో గోవా పేథా స్వీట్, నాసిరకం, గడువు ముగిసిన పదార్థాలతో ఐస్‌క్రీమ్స్ తయారు చేస్తున్న ఇద్దరు వ్యక్తుల్ని టాస్క్‌ఫోర్స్ పోలీసులు బుధవారం అరెస్టు చేశారు. జియాగూడ ప్రాంతానికి చెందిన రామ్‌సింగ్ జుమ్మేరాత్ బజార్లో ఓ స్వీట్ల తయారీ యూనిట్ నిర్వహిస్తున్నాడు. సున్నం, పటక, సోడియం హైడ్రో సల్ఫేట్, కృత్రిమ రసాయనాలను వినియోగిస్తూ గోవా పేథా అనే స్వీటు తయారు చేస్తున్నాడు. ముషీరాబాద్ బాపూజీనగర్‌కు చెందిన పి.అశోక్ ఐస్ క్రీమ్స్ తయారీ యూనిట్ నిర్వహిస్తున్నాడు. గడువు ముగిసిన, నాశిరకం పాలపొడి, రంగులు తదితరాలను వాడి వివిధ ఫ్లేవర్ల ఐస్‌క్రీమ్స్ తయారు చేస్తున్నాడు. వీటిలో కొన్ని నిషేధిత రసాయనాలను కలుపుతున్నాడు. ఈ రెండు యూనిట్లపై బుధవారం దాడి చేసిన టాస్క్‌ఫోర్స్ పోలీసులు ఇద్దరినీ అదుపులోకి తీసుకున్నారు. వీరి నుంచి భారీగా రసాయనాలు, నాసిరకమైన/నకిలీ ఉత్పత్తులు స్వాధీనం చేసుకున్నారు.