ప్రజల ఆరోగ్యాన్ని పరిరక్షించడానికి, వినియోగదారుల విశ్వాసాన్ని కాపాడుకోవడానికి ఆహార భద్రతను మెరుగుపరచడం అత్యవసరం. భారతదేశం ప్రపంచ ఆర్థిక శక్తిగా ఎదుగుతున్నందున ఇది మరింత ముఖ్యం. ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (FSSAI) విడుదల చేసిన స్టేట్ ఫుడ్ సేఫ్టీ ఇండెక్స్ (SFSI) 2024 ర్యాంకింగ్‌లో మరోసారి కేరళ అగ్రస్థానంలో నిలవడం విశేషం. ఈ సూచీలో వరుసగా రెండోసారి తొలిస్థానం దక్కించుకుంది.
గతేడాది రెండోస్థానంలో ఉన్న తమిళనాడు ఈసారి మొదటి స్థానానికి ఎగబాకింది. జమ్మూ కాశ్మీర్, గుజరాత్, నాగాలాండ్ మొదటి ఐదు స్థానాల్లో ఉన్నాయి. ఈ మేరకుర ఆరోగ్యమంత్రి వీణా జార్జ్ ఫేస్‌బుక్ పోస్ట్‌లో.. "కేరళ జాతీయ స్థాయిలో ఆహార భద్రతలో చారిత్రాత్మక విజయాన్ని సాధించింది. ఆహార భద్రతా సూచికలో జాతీయ స్థాయిలో కేరళ వరుసగా రెండవ సంవత్సరం మొదటి స్థానంలో నిలిచింది. ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియాకు చెందిన ఫుడ్ సేఫ్టీ ఇండెక్స్‌లో గతేడాది కూడా మొదటి స్థానంలోనే నిలిచింది కేరళ. ఈ విషయంలో ప్రాసిక్యూషన్ కేసులు, గుర్తింపు పొందిన ల్యాబ్‌ల సంఖ్య, ల్యాబ్‌లలో అత్యుత్తమ పరీక్ష, మొబైల్ ల్యాబ్‌ల పనితీరు, శిక్షణ , అవగాహన కార్యకలాపాలు మొదలైనవి కేరళను అగ్రస్థానంలో నిలిపాయి.
అలాగే కేరళ ఈ విజయాన్ని దక్కించుకోవడంలో కృషి చేసి ఫుడ్ సేఫ్టీ డిపార్ట్‌మెంట్ ఉద్యోగులందరికీ అభినందనలు. అని పోస్ట్‌లో పేర్కొన్నారు వీణా జార్జ్. ఈ ఆహార భద్రతా సూచీ అనేది రాష్ట్రాల ఐదు కీలక పారామితులపై అంచనా వేస్తుంది. మానవ వనరులు, సంస్థాగత డేటా, సమ్మతి, ఆహార పరీక్ష-మౌలిక సదుపాయాలు, నిఘా, శిక్షణ, సామర్థ్యం పెంపు, వినియోగదారుల సాధికారత. ఆహార సంబంధిత వ్యాధులు, న్యూట్రాస్యూటికల్ భద్రత, ఆహారంలో ప్లాస్టిక్‌ల వల్ల ఎదురవుతున్న సవాళ్లను దృష్ట్యా..నేటి ప్రపంచంలో ఫుడ్ రెగ్యులేటర్‌ల ప్రాముఖ్యత పెరుగుతోందని కేంద్ర ఆరోగ్య మంత్రి జేపీ నడ్డా నొక్కి చెప్పారు. అంతేగాదు ఫుడ్ సేఫ్టీ విషయంలో నిరంతర సహకారం, ఆవిష్కరణలు, మెరుగుదల తదితరాల ఆవశ్యకత గురించి హైలెట్ చేశారు.
(చదవండి: ఇదేం బ్యాగ్ రా దేవుడా..! ధర తెలిస్తే కంగుతింటారు..!)
Comments
Please login to add a commentAdd a comment