
సాక్షి, ముంబై: కొండలా పెరిగిన శరారీన్ని, బాన లాంటి పొట్టను తగ్గించుకోవడం అంత వీజీ కాదు. డైటింగ్‌లూ, జిమ్‌లూ అంటూ కసరత్తు చేయడం, ఎక్కడో ఒక చోట్ ఫెయిల్ అవ్వడం మనం చూస్తుంటాం. కొంతమందేమో ఎంత కడుపుమాడ్చుకున్నా.. వ్యాయామం చేస్తున్నా..ఒళ్లు మాత్రం తగ్గడం లేదంటూ నిరాశ చెందుతూ ఉంటారు. అయితే బరువు తగ్గాలంటే చక్కటి ప్రణాళిక, దానికి మించిన నిబద్ధత, ఒక్కోసారి మంచి ట్రైనర్ ఉండటం చాలా అవసరం. అలాగే వైద్యపరంగా ఎందుకు లావు అవుతున్నామనే విశ్లేషణ కూడా అంతే అవసరం.
ఈ క్రమంలో వ్యాపారవేత్త హర్ష్ గోయెంకా ఒక ఫన్నీ వీడియోను ట్వీట్ చేశారు. మొత్తానికి ఈజీ డైటింగ్‌ని మార్గాన్ని కనుగొన్నారు అంటూ ఒక వీడియోను ట్విటర్‌లో షేర్ చేశారు. దీంతో ఇలా చేస్తే.. మీరు కచ్చితంగా స్లిమ్ అవడం ఖాయం అంటూ నెటిజన్లు ఫన్నీగా కమెంట్ చేస్తున్నారు. నవ్వులు పూయిస్తున్న ఈ వీడియో నెట్టింట సందడి చేస్తోంది.
Finally found a way to make dieting easier …..😀😀 pic.twitter.com/CzY6jvil8V
— Harsh Goenka (@hvgoenka) June 26, 2022