బాగా డబ్బున్న వాళ్లు పూటకో డ్రెస్ వేయోచ్చు. బ్రాండెడ్ బట్టలు తప్ప మరొకటి ముట్టుకోరు అని చాలా మంది నమ్ముతారు. కానీ బిజిజెస్ మీటింగులు మినహాయిస్తే మిగిలిన సమయాల్లో ముకేశ్ అంబానీ మొదలు బిల్‌గేట్స్ వరకు చాలాసార్లు సాదాసీదా బట్టల్లోనే కనిపిస్తుంటారు. వాళ్లకేం లోటు ఎందుకిలా నాన్ బ్రాండెడ్ బట్టలు వేసుకుంటారనే సందేహాలు మనకు కలుగుతుంటాయి. అచ్చంగా మనకు వచ్చినలాంటి సందేహమే ఇండస్ట్రియలిస్టు ఆర్పీజీ గ్రూప్స్ చైర్మన్ హర్ష్ గోయెంకాకి వచ్చింది. వెంటనే ఆయనో బిలియనీర్‌ని ఈ ప్రశ్న అడిగారట. దానికి ఆయనిచ్చిన సమాధానం వింటే ఔరా అని ఆశ్చర్యపోవడం మన వంతు అవుతుంది.
హార్ష్‌గోయెంకాకు బిలియనీర్ చెప్పిన సమాధానం ప్రకారం... ఉతికి పారేసే బట్టల మీద ఎక్కువగా డబ్బులు వెచ్చించడం వృధా ప్రయాస. ఎంత ఖరీదై బట్టలైన కొంత కాలానికి పాడైపోతాయి లేదా చినిగిపోతాయి. కాబట్టి బట్టల మీద పెట్టే డబ్బులేవో ఎక్కడైనా ఇన్వెస్ట్ చేసినా ఏదైనా కొత్త వ్యాపారం ప్రారంభించడం ఉత్తమం. నేను ఎలాంటి వాడిని నా విలువ ఏంటనేది నా పని నిర్ణయిస్తుంది కానీ నేనే ధరించే బ్రాండెడ్ బట్టలు కాదంటూ తెలిపాడు. అందుకేనేమో చాలా మంది వ్యాపార రంగానికి చెందిన బిలియనీర్లు ఇతర సెలబ్రిటీల్ల డబ్బును ప్రదర్శించేందుకు పెద్దగా ఆసక్తి చూపరు.
I asked a billionaire why he didn’t wear brands? He replied “Why spend millions on clothing that will wash out, wear down or get lost, when you can save the money to invest in real estate or open a business? Brands don’t define me. My work, my values do!” pic.twitter.com/J9iMj0B5JQ
— Harsh Goenka (@hvgoenka) May 24, 2022
చదవండి: 30 గంటలకు ఒక కొత్త బిలియనీర్
Comments
Please login to add a commentAdd a comment