Branded clothes
-
Fashion: డి బెల్లె బ్రాండ్ సారీలో లక్ష్మీ మంచు! చీర ధర ఎంతంటే!
నటిగా, నిర్మాతగా, టాక్ షో హోస్ట్‌గా.. ఏ రోల్ అయినా పర్ఫెక్ట్గా పోషిస్తారు లక్ష్మీ మంచు. ఫ్యాషన్‌లోనూ అదే పర్ఫెక్షన్ను చూపిస్తున్నారు. ఆ ఠీవికి కారణమైన బ్రాండ్స్‌లో ఇవీ ఉన్నాయి.. డి బెల్లె..... సూరత్‌కు చెందిన నాన్సీ లుహరువాలాకు ట్రావెలింగ్ అంటే చాలా ఇష్టం. ఆ ప్రయాణమే వివిధ ప్రాంతాల్లో ధరించే దుస్తులపై ఆమెకు ఆసక్తి కలిగేలా చేసింది. ఆ ఆసక్తితోనే నాన్సీ 2014లో లేబుల్ ‘డి బెల్లె’ను ప్రారంభించి డిజైనర్‌గా మారింది. ఆధునిక మహిళలను ఆకట్టుకునేలా పలురకాల దుస్తులను రూపొందించడం ఆమె డిజైనింగ్‌లోని విశిష్టత. విదేశాల్లోనూ నాన్సీ కలెక్షన్స్‌కు మంచి డిమాండ్ ఉంది. డిజైన్ బట్టే ధరలు. ఆన్‌లైన్‌లోనూ కొనుగోలు చేయొచ్చు. రోజ్ జ్యూయెల్స్.. దేశంలోని ప్రముఖ జ్యూయెలరీ బ్రాండ్స్‌లో ఇది ఒకటి. 1981లో మొదలైందీ సంస్థ. ‘రోజ్ ’ అనే పేరు అందం, శక్తి, రాయల్టీని సూచిస్తుంది. భారతీయ హస్తకళల నైపుణ్యాన్ని, విలువను సంరక్షించడం ఈ బ్రాండ్ లక్ష్యం. తూర్పు, పశ్చిమ దేశాల సంస్కృతి, అభిరుచుల సమ్మేళనంగా ఉంటాయి ఈ ఆభరణాలు. ధర లక్షల్లోనే.. ఆన్ లైన్లోనూ లభ్యం. బ్రాండ్ వాల్యూ చీర బ్రాండ్: డి బెల్లె ఈ ఆనియన్ పింక్ చీర ధర: రూ. 1,44,000 జ్యూయెలరీ బ్రాండ్: రోజ్ జ్యూయెల్స్ ధర: డిజైన్, నాణ్యతపై ఆధారపడి ఉంటుంది. అనుభవాన్ని మించిన గురువు ఉండరు. జీవన ప్రయాణంలో ఎదురయ్యే వ్యక్తులు, సంఘటనలకు మించిన పాఠాలు ఉండవు. – లక్ష్మీ మంచు -దీపిక కొండి చదవండి: Sobhita Dhulipala: శోభిత కట్టిన ఈ చీర ధర 4 లక్షల 80 వేలు! Retro Style: రెట్రో స్టైల్.. నాటి మహారాణీ చీరకట్టు హుందాతనం.. మళ్లీ ఇలా View this post on Instagram A post shared by Manchu Lakshmi Prasanna (@lakshmimanchu) -
ఇలియానాను నిత్యనూతనంగా చూపించే బ్రాండ్స్ ఇవే..!
ఇలియానా... ఈ మధ్య సినిమాల్లో కన్నా ఈవెంట్లలో ఎక్కువగా కనిపిస్తోంది.. అదే గ్లామర్‌తో ఇలా! ఆమెను అలా నిత్యనూతనంగా చూపించే ఆ బ్రాండ్స్ ఏంటో చూద్దాం.. గోపి వేద్ చిన్ననాటి స్నేహితులిద్దరి భిన్న ఆలోచనల ఫ్యూజనే ‘గోపి వేద్’ లేబుల్. ఆ ఇద్దరిలోని ఒకరే గోపి వేద్. ఇంకో ఫ్రెండ్ అర్నాజ్ సూనావాలా. ముంబై వాసులు. గోపి వేద్ ‘లా’ చదివి.. బిజినెస్ మేనేజ్మెంట్ కూడా చేసింది. అర్నాజ్ ఈఎన్టీ (డాక్టర్) గోల్డ్ మెడలిస్ట్. చదువు ఈ చైల్డ్‌హుడ్ ఫ్రెండ్స్‌ను దూరం చేసినా డ్రెస్ డిజైనింగ్ పట్ల ఉన్న కామన్ ఇంటరెస్ట్ ఇద్దరినీ కలిపింది మళ్లీ. అలా కలిసి ‘గోపి వేద్’ను ప్రారంభించారు. నిజానికి గోపి వేద్ కుటుంబ నేపథ్యం కూడా వస్త్ర ప్రపంచమే. గోపి వాళ్లమ్మ డ్రెస్ డిజైనర్. వాళ్లింటి కింది అంతస్తులో వర్క్ షాప్ ఉండేది. అది చూసీ చూసీ గోపి వేద్‌లో డ్రెస్ డిజైనింగ్ పట్ల ఆసక్తి మొదలైంది. అందుకే చదువయ్యాక ఈ రంగంలోకి వచ్చింది. ఆమెకు అండగా నిలిచింది అర్నాజ్. గోపి వేద్ డ్రెస్ డిజైన్, కలర్స్ చూస్తే.. అర్నాజ్.. ఫ్యాబ్రిక్ అండ్ బిజినెస్ చూసుకుంటుంది. అలా ఈ ఇద్దరి వైవిధ్యమైన ఆలోచనలు, ధోరణుల మిశ్రమ ఫలితంగా ‘గోపి వేద్’ అనే కళాత్మాకమైన లేబుల్ ఆవిష్కృతమైంది. బ్రైడల్ కలెక్షన్స్ వీరి బ్రాండ్ వాల్యూ. పూజా డైమండ్స్ 1989లో మొదలైంది ఈ బ్రాండ్ ప్రస్థానం. వ్యవస్థాపకులు.. ముఖేశ్ మెహతా, పప్పు భాయ్. అహ్మదాబాద్ వాసులు. తొలుత ఈ ఇద్దరూ డైమండ్ హోల్‌సేల్ వ్యాపారం చేసేవాళ్లు. నగల తయారీ పట్ల ఈ ఇద్దరికీ ఉన్న ఇష్టం, సృజనే వీళ్లు పూజా డైమండ్స్‌ను స్థాపించేలా చేసింది. అలా పూజా డైమండ్స్ ఫస్ట్ షోరూమ్‌ను 2001లో అహ్మదాబాద్‌లో ప్రారంభించారు. తమ బ్రాండ్‌కున్న డిమాండ్‌ను చూసి రెండో షోరూమ్‌ను 2016లో ముంబైలో స్టార్ట్ చేశారు. కొనుగోలుదారుల నమ్మకమే బ్రాండ్ వాల్యూగా వీళ్ల వ్యాపారం వృద్ధిచెందుతోంది. నా ఫిట్నెస్ రహస్యం వ్యాయామం. దిగులుగా ఉన్నా.. నిరుత్సాహంగా ఉన్నా వ్యాయామం మొదలుపెడతా. అంతే.. మనసు ఉత్సాహంతో ఉరకలేస్తుంది.. కొత్త శక్తి ఆవహిస్తుంది. – ఇలియానా జ్యూయెలరీ: డైమండ్ ఇయర్ రింగ్స్ బ్రాండ్: పూజా డైమండ్స్ ధర: నాణ్యత, డిజైన్‌పై ఆధారపడి ఉంటుంది. డ్రెస్ షరారా సెట్ బ్రాండ్: గోపి వేద్ ధర: 28,500 -
అంబానీ,బిల్‌గేట్స్, బఫెట్.. బ్రాండెడ్ డ్రెస్‌లు ఎందుకు వేయరంటే?
బాగా డబ్బున్న వాళ్లు పూటకో డ్రెస్ వేయోచ్చు. బ్రాండెడ్ బట్టలు తప్ప మరొకటి ముట్టుకోరు అని చాలా మంది నమ్ముతారు. కానీ బిజిజెస్ మీటింగులు మినహాయిస్తే మిగిలిన సమయాల్లో ముకేశ్ అంబానీ మొదలు బిల్‌గేట్స్ వరకు చాలాసార్లు సాదాసీదా బట్టల్లోనే కనిపిస్తుంటారు. వాళ్లకేం లోటు ఎందుకిలా నాన్ బ్రాండెడ్ బట్టలు వేసుకుంటారనే సందేహాలు మనకు కలుగుతుంటాయి. అచ్చంగా మనకు వచ్చినలాంటి సందేహమే ఇండస్ట్రియలిస్టు ఆర్పీజీ గ్రూప్స్ చైర్మన్ హర్ష్ గోయెంకాకి వచ్చింది. వెంటనే ఆయనో బిలియనీర్‌ని ఈ ప్రశ్న అడిగారట. దానికి ఆయనిచ్చిన సమాధానం వింటే ఔరా అని ఆశ్చర్యపోవడం మన వంతు అవుతుంది. హార్ష్గోయెంకాకు బిలియనీర్ చెప్పిన సమాధానం ప్రకారం... ఉతికి పారేసే బట్టల మీద ఎక్కువగా డబ్బులు వెచ్చించడం వృధా ప్రయాస. ఎంత ఖరీదై బట్టలైన కొంత కాలానికి పాడైపోతాయి లేదా చినిగిపోతాయి. కాబట్టి బట్టల మీద పెట్టే డబ్బులేవో ఎక్కడైనా ఇన్వెస్ట్ చేసినా ఏదైనా కొత్త వ్యాపారం ప్రారంభించడం ఉత్తమం. నేను ఎలాంటి వాడిని నా విలువ ఏంటనేది నా పని నిర్ణయిస్తుంది కానీ నేనే ధరించే బ్రాండెడ్ బట్టలు కాదంటూ తెలిపాడు. అందుకేనేమో చాలా మంది వ్యాపార రంగానికి చెందిన బిలియనీర్లు ఇతర సెలబ్రిటీల్ల డబ్బును ప్రదర్శించేందుకు పెద్దగా ఆసక్తి చూపరు. I asked a billionaire why he didn’t wear brands? He replied “Why spend millions on clothing that will wash out, wear down or get lost, when you can save the money to invest in real estate or open a business? Brands don’t define me. My work, my values do!” pic.twitter.com/J9iMj0B5JQ — Harsh Goenka (@hvgoenka) May 24, 2022 చదవండి: 30 గంటలకు ఒక కొత్త బిలియనీర్ -
పూజా హెగ్డే ధరించిన డ్రెస్ ధర తెలిస్తే షాక్ అవ్వాల్సిందే!
బుట్టబొమ్మా.. బుట్టబొమ్మా పాటతో ప్రేక్షకులను బుట్టలో వేసుకొని అభిమానులుగా మార్చేసుకున్న నటి పూజా హెగ్డే. మరి ఆమెను బుట్టలో పడేసిన ఫ్యాషన్ బ్రాండ్స్ ఏంటో చూద్దాం.. అనీతా డోంగ్రే డిజైనర్ అనీతా డోంగ్రేకు చిన్నప్పటి నుంచే ఫ్యాషన్ అంటే ప్యాషన్. అందుకే ఫ్యాషన్ డిజైన్‌లో డిగ్రీ చేసింది. రాజస్థాన్ సంప్రదాయ ఎంబ్రాయిడరీనే తన డిజైన్స్‌కి ప్రేరణగా తీసుకుంటుంది. దాంతో అదే ఆమె బ్రాండ్ వాల్యూగా మారింది. 2015లో తన పేరుమీదే ముంబైలో ఫ్యాషన్ హౌజ్‌ను ప్రారంభించింది. ఇప్పుడది సెలబ్రిటీస్ ఫేవరెట్‌గా స్థిరపడిపోయింది. ఆ దుస్తుల ధరలు డిజైన్‌ను బట్టే ఉంటాయి. వేల నుంచి లక్షల్లో పలుకుతాయి. ఆన్‌లైన్‌లోనూ ఈ డిజైనర్ వేర్ అందుబాటులో ఉంది. బ్రాండ్: అనీతా డోంగ్రే ధర: రూ. 1,99,000 ఫుట్‌వేర్... టిన్సెల్ టోస్ టాప్ మోస్ట్ లగ్జూరియస్ ఫ్యాషన్ బ్రాండ్స్‌లో టిన్సెల్ టోస్ ఫుట్‌వేర్ ఒకటి. జపాన్‌లో మెయిన్ ఆఫీస్ ఉంది. సంప్రదాయ అల్లికలు, కుందన్ వర్క్స్‌తో లభించే ఈ జూతీస్కు ఇండియాలో మంచి గిరాకీ ఉంది. ఈ మధ్యనే చండీగఢ్‌లో కూడా ఓ బ్రాంచ్‌ను ప్రారంభించారు. సాధారణ ఫుట్‌వేర్ కూడా ఇక్కడ అందమైన డిజైన్స్‌లో దొరుకుతాయి. అందుకే, సామాన్యుడు నుంచి సెలబ్రిటీ వరకు ప్రతి ఒక్కరికీ ఈ బ్రాండ్ అంటే తీరని మోజు. ధర కూడా ఆ రేంజ్‌లోనే ఉంటుంది. పలు ప్రముఖ ఆన్లైన్ స్టోర్స్‌లోనూ లభిస్తాయి. బ్రాండ్: టిన్సెల్ టోస్ ధర: రూ. 2,499 సెలబ్రిటీలు అనగానే ఒకసారి ధరించిన దుస్తులను ఇంకోసారి ధరించరు అని చాలా మంది అనుకుంటూంటారు. కానీ, నేను అలా కాదు. స్టయిల్ అనేది మనం సెట్ చేసేదే. మిక్స్ అండ్ మ్యాచ్‌ను ట్రై చేస్తుంటా. – పూజా హెగ్డే -
సూపర్ స్టార్ మహేశ్ ‘హంబుల్’ లాంచ్
సాక్షి, హైదరాబాద్ : వరుస విజయాలతో దూకుడు మీదున్న టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు వ్యాపారరంగంలో కూడా అదే దూకుడును ప్రదర్శిస్తున్నారు. ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న హంబుల్ బ్రాండ్ దుస్తులను పార్క్ హయత్‌లో బుధవారం అట్టహాసంగా ఆవిష్కరించారు. స్పోయల్ సంస్థతో కలిసి హంబుల్ బ్రాండ్ పేరుతో 160 రకాల దుస్తులను వినియోగదారుల అందుబాటులోకి తెచ్చారు. యువకుల నుంచి వృద్ధుల దాకా ఆకర్షణీయంగా, అందుబాటు ధరలో క్యాజువల్ షర్ట్స్ , టీ-షర్టులను అందిస్తోంది. కాగా ‘ది హంబుల్ కో’ పేరుతో వస్త్ర వ్యాపారంలోకి అడుగిడుతున్నట్టు ఇటీవల మహేష్ బాబు ట్విటర్లో ప్రకటించిన సంగతి తెలిసిందే. ఆగస్టు 7న అధికారికంగా ప్రారంభం కానందని ట్వీట్ చేశారు. ఇప్పటికే సొంత బ్యానర్ ప్రారంభించి, భారీ మల్టిప్లెక్స్ థియేటర్‌తో అభిమానులను ఆకట్టుకున్న మహేష్ బాబు "ది హంబుల్ కో " పేరుతో తాజాగా బ్రాండెడ్ వస్త్రాల వ్యాపారంలోకి అడుగుపెట్టారు. సినిమాలు, యాడ్స్‌తో క్షణం క్షణం తీరికలేకుండా బిజీబిజీగా గడిపేస్తున్న రీల్ బిజినెస్‌మేన్ మహేష్ రియల్ బిజినెస్‌మేన్‌గా మరోసారి ఖలేజా చాటాలని అభిమానులు ఆశిస్తున్నారు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
సూపర్‌స్టార్.. రియల్ బిజినెస్‌మేన్
సూపర్‌స్టార్ మహేష్ బాబు ఓ వైపు క్షణం తీరిక లేకుండా బిజీగా సినిమాలు చేస్తూ ఉన్నాడు. మరోవైపు యాడ్స్ అంటూ చేతి నిండా సంపాదిస్తుండగానే.. థియేటర్ బిజినెస్‌లోకి దిగాడు. మళ్లీ తాజాగా ఓ క్లాత్ కంపెనీని ప్రారంభించబోతోన్నాడు. ఇలా బిజీబిజీగా గడిపేస్తున్న మహేష్ బాబు నిజంగానే బిజినెస్‌మేన్ అని నిరూపించుకుంటున్నాడు. ఇప్పటికే టాలీవుడ్లో విజయ్ దేవరకొండ రౌడీ బ్రాండెడ్ దుస్తుల బిజినెస్ మొదలెట్టి సక్సెస్ అయ్యాడు. ప్రస్తుతం మహేష్ కూడా ఈ రంగంలో దిగేందుకు రంగం సిద్దం చేసుకున్నాడు. హంబుల్కో అనే బ్రాండెడ్ దుస్తులను ఆగస్టు 7వ తేదీన లాంచ్ చేయనున్నట్లు తన అభిమానులకు తెలిపాడు. ప్రస్తుతం మహేష్.. ‘సరిలేరు నీకెవ్వరు’ షూటింగ్లో బిజీగా ఉన్నాడు. Our Humbl endeavour unveils today. Thank you all for the astounding response 🤗🤗 For us, The Humbl Co. is not just clothing, it’s a way of life. We welcome you all to the @thehumblco family. Stay tuned for the launch on 7th August! #theHUMBLco pic.twitter.com/eLAR13jBgt — Mahesh Babu (@urstrulyMahesh) July 29, 2019 -
బ్రాండెడ్ బట్టల కోసం దారుణం
సాక్షి, న్యూఢిల్లీ: విలాసవంతమైన జీవితం గడపడం కోసం కొంతమంది యువకులు అడ్డదారి తొక్కారు. డబ్బు కోసం క్యాబ్ డ్రైవర్‌ను దారుణంగా హత మార్చారు. ఈ సంఘటన న్యూఢిల్లీలోని కశ్మీరీ గేట్ ప్రాంతంలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం అలీపూర్కు చెందిన కొందరు యువకులు ముఠాగా ఏర్పడి ఈ పథకం రచించారు. మార్చి 23న కశ్మీరీ గేట్ వద్ద ఓలా క్యాబ్‌ను బుక్ చేసుకున్నారు. క్యాబ్ వారి వద్దకు రాగానే బుకింగ్‌ను రద్దు చేసి.. తుపాకులతో డ్రైవర్‌ను బెదిరించి సోనిపట్ ప్రాంతానికి తీసుకెళ్లారు. అక్కడ నిర్మానుష్యమైన ప్రాంతంలో డ్రైవర్ని గొంతు నులిమి చంపేశారు. ఘటన తర్వాత అదే కారులో నగరానికి వచ్చి దాని రూపు రేఖలు మార్చేసి అమ్మేయాలని ప్రయత్నించారు. ఇక గుర్తు తెలియని వ్యక్తి మృతదేహన్ని గుర్తించిన పోలీసు కేసు నమోదు చేసుకున్నారు. విచారణలో హత్యకు గురైంది ఓలా క్యాబ్ డ్రైవర్‌గా పోలీసు నిర్ధారించారు. అతని వివరాలు సేకరించి కాల్ డేటా ఆధారంగా నిందుతులను అదుపులోకి తీసుకున్నట్టు పోలీసులు తెలిపారు. విచారణలో నిందితులు హత్య చేయడానికి గల కారణాలు విని పోలీసులు ఆశ్చర్యపోయారు. పేదరికంలో మగ్గుతున్న వాళ్లు.. ఖరీదైన బట్టలు, విలాసవంతమైన జీవితం కోసం ఈ హత్య చేసినట్లు తెలిపారు. కాగా, ఆరుగురు నిందితుల్లో ఒక మైనర్ ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు. నిందితులను కఠినంగా శిక్షించాలంటూ ఓలా క్యాబ్ డ్రైవర్లు ఆందోళన చేపట్టారు. -
బ్రాండెడ్ దుస్తులు..మసాజ్‌లు
l ‘నమస్తే’ గ్యాంగ్ విలాసవంతమైన జీవనం l 15 రోజుల పాటు జల్సాలు l కార్పొరేట్ స్కూళ్లల్లో పిల్లల చదువు సిటీబ్యూరో: వాకింగ్‌లో ఉన్న వారిని టార్గెట్‌గా చేసుకుని... సమీపంలోకి వెళ్ళి నమస్తే చెప్తూ బెదిరించి దోపిపీలకు పాల్పడుతున్న ‘నమస్తే గ్యాంగ్’ వ్యవహారాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. ఈ గ్యాంగ్‌లో మరికొంత మంది సభ్యులు ఉన్నట్లు సీసీఎస్ పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ ముఠా టార్గెట్ చేసుకున్న నగరాలకు విమానాల్లో వెళ్లిరావడమే కాకుండా, వీరి జీవనశైలి కూడా అత్యంత విలాసవంతంగా ఉంటుందని అధికారులు పేర్కొంటున్నారు. ప్రతి నెలా కనీసం 15 రోజుల పాటు ‘పని’ మానేసి ఎంజాయ్ చేస్తుంటారు. నేరం చేయడానికి తిరిగేది స్కూటర్ పైనే అయినా వీరు ఎల్లప్పుడూ ఖరీదైన బ్రాండెడ్ దుస్తులే ధరిస్తారు. రెండు పూటలా పేరున్న రెస్టారెంట్లలో బిర్యానీ, రోజు విడిచి రోజు మసాజ్ వీరికి తప్పనిసరి. పోలీసులకు పట్టుబడిన బబ్బూ, ఇమ్రాన్ స్కూల్ డ్రాపౌట్స్ అయినా.. వీరి పిల్లలు మాత్రం ఘజియాబాద్‌లోని కార్పొరేట్ స్కూల్లో చదువుకుంటున్నారు. ప్రాథమిక ఆధారాలు సేకరించిన అధికారులు లోతుగా దర్యాప్తు చేయడంతో పాటు మంగళవారం అరెస్టు చేసిన బబ్బూ, ఇమ్రాన్‌లను కస్టడీలోకి తీసుకోవాలని నిర్ణయించారు. దేశ వ్యాప్తంగా ఆరు రాష్ట్రాల్లో న‘మస్కా’ర్ నేరాలకు పాల్పడిన చేసిన ఈ ద్వయం జనవరి 10న ఢిల్లీ సమీపంలోని గుర్గావ్లో పంజా విసిరింది. ఒకే రోజు ముగ్గురిని దోచుకుంది. రిడ్జ్ఉడ్ ఎస్టేట్ ప్రాంతంలో ఆర్మీ మాజీ అధికారి భగ్వాన్ దాస్‌ను బెదిరించి బంగారం ఉంగరం లాక్కెళ్లారు. డీఎల్ఎఫ్ సెక్టార్–4, 56ల్లో వైద్యుడు మనోహర్‌లాల్ శర్మ నుంచి నగదు, అహు అభిషేక్ నుంచి ఖరీదైన సెల్‌ఫోన్ దోపిడీ చేసింది. రిడ్జ్ఉడ్ ఎస్టేట్ ప్రాంతంలోని సీసీ కెమెరాలో నిందితులను గుర్తించిన గుర్గావ్ పోలీసులు సాంకేతిక ఆధారాలను బట్టి ముందుకు వెళ్ళారు. ఫిబ్రవరి 14, 15 తేదీల్లో మహారాష్ట్రలోని పుణేలో నేరాలు చేసిన వీరు ఆ మరుసటి రోజే విమానంలో ఢిల్లీకి బయలుదేరారు. ఈ విషయం గుర్తించిన గుర్గావ్ అధికారులు ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో మాటు వేసి, బబ్బూ, ఇమ్రాన్‌లను అదుపులోకి తీసుకుని అరెస్టు చేశారు. వీరిని విచారించిన గుర్గావ్ పోలీసులు వాహనాలు సమకూర్చిన లల్లూ సైతం నిందితుడిగా తేల్చారు. ప్రస్తుతం పరారీలో ఉన్న అతడి కోసం గాలిస్తున్నారు. ఈ ‘నమస్తే గ్యాంగ్’ దేశంలోని ఆరు రాష్ట్రాల్లో నేరాలు చేసింది. అయితే ఏ నగర పోలీసులు పట్టుకుంటే... కేవలం అక్కడ చేసిన నేరాలను మాత్రమే బయటపెడుతుంది. మిగిలిన ప్రాంతాల్లో చేసినవి ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించదు. దీంతో వీరిపై పీటీ వారెంట్ జారీ చేసి తీసుకురావడం సాధ్యం కాదు. ఫిబ్రవరిలో నగరానికి వచ్చిన వీరు అదే నెల 12 ఉదయం రామ్‌గోపాల్‌పేట పరిధిలో పి.వెంకటరమణకు ‘నమస్తే చెప్పారు’. ఈ కేసుపై దృష్టి పెట్టిన సీసీఎస్ స్పెషల్‌టీమ్ ఇన్స్పెక్టర్ వి.శ్యాంబాబు నేతృత్వంలోని బృందం ఆ ప్రాంతంతో పాటు చుట్టు పక్కల ఉన్న 200 సీసీ కెమెరాల్లోని ఫీడ్ ఆధారంగా అనుమానితుల్ని గుర్తించి సాంకేతికంగా దర్యాప్తు చేసింది. ఫలితంగా పసోండా చిరునామా తెలుసుకుని అక్కడకు వెళ్లగా, అప్పటికే వీరిని గుర్గావ్ పోలీసులు తీసుకెళ్లారని తెలుసుకున్నారు. హుటాహుటిన అక్కడకు వెళ్ళిన ఇన్స్పెక్టర్ లోతుగా విచారించి నగర నేరాన్నీ అంగీకరించేలా చేయడంతోనే ఇక్కడకు తేవడం సాధ్యమైంది.ఈ ముఠాలో మరో ఐదుగురి వరకు సభ్యులు ఉండచ్చని అనుమానిస్తున్న సీసీఎస్ పోలీసులు ఆ కోణంలో ఆరా తీస్తున్నారు. తీహార్‌తో పాటు గుర్గావ్లోని భోండ్సీ, బెంగళూరు జైళ్లు వీరికి ‘సుపరిచితమే’.