
లక్ష్మీ మంచు (PC: lakshmimanchu Instagram)
నటిగా, నిర్మాతగా, టాక్ షో హోస్ట్‌గా.. ఏ రోల్ అయినా పర్‌ఫెక్ట్‌గా పోషిస్తారు లక్ష్మీ మంచు. ఫ్యాషన్‌లోనూ అదే పర్‌ఫెక్షన్‌ను చూపిస్తున్నారు. ఆ ఠీవికి కారణమైన బ్రాండ్స్‌లో ఇవీ ఉన్నాయి..
డి బెల్లె.....
సూరత్‌కు చెందిన నాన్సీ లుహరువాలాకు ట్రావెలింగ్ అంటే చాలా ఇష్టం. ఆ ప్రయాణమే వివిధ ప్రాంతాల్లో ధరించే దుస్తులపై ఆమెకు ఆసక్తి కలిగేలా చేసింది. ఆ ఆసక్తితోనే నాన్సీ 2014లో లేబుల్ ‘డి బెల్లె’ను ప్రారంభించి డిజైనర్‌గా మారింది.
ఆధునిక మహిళలను ఆకట్టుకునేలా పలురకాల దుస్తులను రూపొందించడం ఆమె డిజైనింగ్‌లోని విశిష్టత. విదేశాల్లోనూ నాన్సీ కలెక్షన్స్‌కు మంచి డిమాండ్ ఉంది. డిజైన్ బట్టే ధరలు. ఆన్‌లైన్‌లోనూ కొనుగోలు చేయొచ్చు.
రోజ్ జ్యూయెల్స్..
దేశంలోని ప్రముఖ జ్యూయెలరీ బ్రాండ్స్‌లో ఇది ఒకటి. 1981లో మొదలైందీ సంస్థ. ‘రోజ్ ’ అనే పేరు అందం, శక్తి, రాయల్టీని సూచిస్తుంది. భారతీయ హస్తకళల నైపుణ్యాన్ని, విలువను సంరక్షించడం ఈ బ్రాండ్ లక్ష్యం. తూర్పు, పశ్చిమ దేశాల సంస్కృతి, అభిరుచుల సమ్మేళనంగా ఉంటాయి ఈ ఆభరణాలు. ధర లక్షల్లోనే.. ఆన్ లైన్‌లోనూ లభ్యం.
బ్రాండ్ వాల్యూ
చీర బ్రాండ్: డి బెల్లె
ఈ ఆనియన్ పింక్ చీర ధర: రూ. 1,44,000
జ్యూయెలరీ
బ్రాండ్: రోజ్ జ్యూయెల్స్
ధర: డిజైన్, నాణ్యతపై ఆధారపడి ఉంటుంది.
అనుభవాన్ని మించిన గురువు ఉండరు. జీవన ప్రయాణంలో ఎదురయ్యే వ్యక్తులు, సంఘటనలకు మించిన పాఠాలు ఉండవు. – లక్ష్మీ మంచు
-దీపిక కొండి
చదవండి: Sobhita Dhulipala: శోభిత కట్టిన ఈ చీర ధర 4 లక్షల 80 వేలు!
Retro Style: రెట్రో స్టైల్.. నాటి మహారాణీ చీరకట్టు హుందాతనం.. మళ్లీ ఇలా