పూజా హెగ్డే ధరించిన డ్రెస్‌ ధర తెలిస్తే షాక్‌ అవ్వాల్సిందే! | Pooja Hegde Anita Dongre Anarkali Dress Price Leaves You Shock | Sakshi
Sakshi News home page

Pooja Hegde: ‘బుట్టబొమ్మ’ డ్రెస్‌ మరీ అంత ఖరీదా?!

Published Mon, Sep 13 2021 4:03 PM | Last Updated on Mon, Sep 13 2021 7:18 PM

Pooja Hegde Anita Dongre Anarkali Dress Price Leaves You Shock - Sakshi

బుట్టబొమ్మా.. బుట్టబొమ్మా పాటతో ప్రేక్షకులను బుట్టలో వేసుకొని అభిమానులుగా మార్చేసుకున్న నటి పూజా హెగ్డే. మరి ఆమెను బుట్టలో పడేసిన ఫ్యాషన్‌ బ్రాండ్స్‌ ఏంటో చూద్దాం.. 

అనీతా డోంగ్రే
డిజైనర్‌ అనీతా డోంగ్రేకు చిన్నప్పటి నుంచే ఫ్యాషన్‌ అంటే ప్యాషన్‌. అందుకే ఫ్యాషన్‌ డిజైన్‌లో డిగ్రీ చేసింది. రాజస్థాన్‌ సంప్రదాయ ఎంబ్రాయిడరీనే తన డిజైన్స్‌కి ప్రేరణగా తీసుకుంటుంది. దాంతో అదే ఆమె బ్రాండ్‌ వాల్యూగా మారింది. 2015లో తన పేరుమీదే ముంబైలో ఫ్యాషన్‌ హౌజ్‌ను ప్రారంభించింది. ఇప్పుడది సెలబ్రిటీస్‌ ఫేవరెట్‌గా స్థిరపడిపోయింది. ఆ దుస్తుల ధరలు డిజైన్‌ను బట్టే ఉంటాయి. వేల నుంచి లక్షల్లో పలుకుతాయి. ఆన్‌లైన్‌లోనూ ఈ డిజైనర్‌ వేర్‌ అందుబాటులో ఉంది. 

బ్రాండ్‌: అనీతా డోంగ్రే 
ధర: రూ. 1,99,000

ఫుట్‌వేర్‌...
టిన్సెల్‌ టోస్‌
టాప్‌ మోస్ట్‌ లగ్జూరియస్‌ ఫ్యాషన్‌ బ్రాండ్స్‌లో టిన్సెల్‌ టోస్‌ ఫుట్‌వేర్‌ ఒకటి. జపాన్‌లో మెయిన్‌ ఆఫీస్‌ ఉంది. సంప్రదాయ అల్లికలు, కుందన్‌ వర్క్స్‌తో లభించే ఈ జూతీస్‌కు ఇండియాలో మంచి గిరాకీ ఉంది. ఈ మధ్యనే చండీగఢ్‌లో కూడా ఓ బ్రాంచ్‌ను ప్రారంభించారు. సాధారణ ఫుట్‌వేర్‌ కూడా  ఇక్కడ అందమైన డిజైన్స్‌లో దొరుకుతాయి. అందుకే, సామాన్యుడు నుంచి సెలబ్రిటీ వరకు ప్రతి ఒక్కరికీ ఈ బ్రాండ్‌ అంటే తీరని మోజు. ధర కూడా ఆ రేంజ్‌లోనే ఉంటుంది. పలు ప్రముఖ ఆన్‌లైన్‌ స్టోర్స్‌లోనూ లభిస్తాయి. 

బ్రాండ్‌: టిన్సెల్‌ టోస్‌ 
ధర: రూ. 2,499

సెలబ్రిటీలు అనగానే ఒకసారి ధరించిన దుస్తులను ఇంకోసారి ధరించరు అని చాలా మంది అనుకుంటూంటారు. కానీ, నేను అలా కాదు.  స్టయిల్‌ అనేది మనం సెట్‌ చేసేదే. మిక్స్‌ అండ్‌ మ్యాచ్‌ను ట్రై చేస్తుంటా. 
– పూజా హెగ్డే 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement