Latest Fashions
-
నవ్వుతూ ఉండాలి
‘సీతారామం’లోని సీత.. మృణాల్ ఠాకూర్.. భారీ సక్సస్ సాధించినప్పటికీ సెలెక్ట్‌డ్‌గా సినిమాలు చేస్తూ సెపరేట్ స్టయిల్ క్రియేట్ చేసుకుంది. ఆ స్టయిల్‌నే ఫ్యాషన్‌లోనూ చూపిస్తోంది.మా నాన్నే నా బిగ్గెస్ట్ ఇన్స్పిరేషన్. ఎన్ని సమస్యలున్నా హాయిగా నవ్వుతూ ఉండాలని నేర్పించారు. మంచి ఫలితాలకు సమయం పడుతుందని, సహనంతో వేచిచూడాలని చెబుతుంటారు. దాన్నే నమ్ముతాను! – మృణాల్ ఠాకూర్ మృణాళినీ రావ్.. ఇండియన్ టాప్ డిజైనర్స్‌లో ఒకరైన మృణాళినీ రావ్ పుట్టి పెరిగిందంతా హైదరాబాద్‌లోనే! చిన్నప్పుడు డాక్టర్ కావాలనుకుంది. పెద్దయ్యాక ఫ్యాషన్‌పై ఆసక్తి కలిగింది. దాంతో ఫ్యాషన్ డిజైనింగ్ కోర్సు పూర్తి చేసింది. ఇంట్లోనే డిజైన్స్‌ను తయారుచేసి, వీకెండ్స్‌లో ఎగ్జిబిషన్స్‌లో ప్రదర్శించేది. 2014లో ‘మృణాళినీ’ పేరుతో ఓ బొటిక్‌ను ప్రారంభించి, అతికొద్ది కాలంలోనే సెలబ్రిటీస్‌కు డిజైన్స్ ఇచ్చే స్థాయికి ఎదిగింది. అందుకే, ఈ బ్రాండ్ ధరలు హై రేంజ్‌లోనే ఉంటాయి. పలు ప్రముఖ ఆన్లైన్ స్టోర్స్‌లలో లభిస్తాయి. చీర బ్రాండ్: అర్పితా మృణాళినీ రావ్,రూ.1,79,000, బ్లౌజ్ ధర: రూ. 53,760 జ్యూలరీ బ్రాండ్: ఎ జ్యూయెల్స్ బై అన్మోల్, ధర: ఆభరణాల డిజైన్ నాణ్యతపై ఆధారపడి ఉంటుంది. ఎ జ్యూయెల్స్ బై అన్మోల్.. 1986లో ఈశూ దత్వానీ అన్మోల్ పేరుతో బంగారు ఆభరణాల వ్యాపారం ప్రారంభించాడు. మొదట్లో కేవలం వారి వద్ద తయారైన ఆభరణాలను మాత్రమే విక్రయించేవాడు. అంతర్జాతీయ స్థాయి డిజైన్స్ అందించటానికి విదేశీ డిజైనర్స్‌తోనూ కలసి పనిచేయటం మొదలుపెట్టాడు. శిల్పా శెట్టీ, లారా దత్తా, మలైకా అరోరా, ఊర్వశి ఇలా పలు ప్రముఖ బాలీవుడ్ సెలబ్రిటీస్ వారి పెళ్లి నగలను ఇక్కడే డిజైన్ చేయించుకున్నారు. ధర ఆభరణాల డిజైన్, నాణ్యతపై ఆధారపడి ఉంటుంది. పలు ప్రముఖ నగరాలతో పాటు ఆన్‌లైన్‌లోనూ లభ్యం. -దీపిక కొండి -
Fashion: సౌకర్యమే స్టైల్
కలర్స్, కట్స్, ప్రింట్లు, డిజైన్లు ఫ్యాషన్ ప్రపంచంలో కొత్తదనాన్ని తీసుకురావడానికి డిజైనర్లు ఎప్పుడూ ప్రయత్నిస్తుంటారు. ప్రాంతీయ డిజైన్ల నుంచి అంతర్జాతీయ బ్రాండ్స్ వరకు రీసెంట్ లుక్స్ కోసం శోధన ఉంటూనే ఉంటుంది. జాతీయ, అంతర్జాతీయ వేదికల మీద ఇటీవల జరుగుతున్న ఫ్యాషన్ వీక్స్ వేటిని పరిచయం చేస్తుందో తెలుసుకుందాం. వారసత్వ డిజైన్లు ఆర్గానిక్ ఫ్యాబ్రిక్, సౌకర్యవంతమైన డిజైనింగ్ తర్వాత స్థానిక హస్తకళ డిజైన్స్‌కి అవకాశాలు బాగా పెరిగాయి. సంప్రదాయ కళలను బాగా ఇష్టపడుతున్నారు. దీంతో మరుగున పడిపోయిన వారసత్వ కళలు తిరిగి జీవం పోసుకుంటున్నాయి. జాతీయ, అంతర్జాతీయ డిజైనర్లు కూడా తమ స్థానిక హస్తకళల డిజైన్స్‌ని విస్తృతంగా మార్కెట్లోకి తీసుకువస్తున్నారు. మనదైన ప్రభావం ఫ్యాషన్ ప్రపంచంపై భారతదేశం ప్రభావం గురించి ఆలోచించినప్పుడు రితూకుమార్. సబ్యసాచి, మనీష్ మల్హోత్రా.. వంటి ప్రఖ్యాత డిజైనర్ల డిజైన్లు, తలపాగాలు కనిపిస్తుంటాయి. అలాగే, గ్లోబల్ టెక్స్టైల్ గురించి చూసినప్పుడు భారతదేశంలోని కుటుంబాలలో తల్లులు, బామ్మలు ధరించే చీరల థీమ్‌ను తమ డిజైన్స్‌లో తీసుకుంటున్నారు. ఆర్గానిక్, సస్టెయినబుల్ ఫ్యాబ్రిక్‌కు ఎక్కువ ప్రాధాన్యమిస్తున్నారు. ఇటీవల జరిగిన మిలన్, ప్యారిస్, మన లాక్మే ఫ్యాషన్ వీక్లను గమనిస్తే ఈ విషయం స్పష్టమవుతుంది. పదిహేడవ శతాబ్దం నుండి నేటి వరకు పాశ్చాత్య ఫ్యాషన్ ట్రెండ్‌పై భారతదేశ ప్రభావం ఉందని తెలుస్తోంది. అలాగే, అంతర్జాతీయ డిజైనర్ల నుంచి మనవాళ్లు స్ఫూర్తి పొందే విషయాల్లో ఫ్యాబ్రిక్స్ ఎంపికలోనూ, సంప్రదాయ డిజైన్స్‌లోనూ అధిక ప్రాధాన్యత ఇస్తున్నారనేది వాస్తవం. ఆర్గానిక్ ఫ్యాబ్రిక్కే అగ్రస్థానం దేశీయ, అంతర్జాతీయ డిజైన్స్ చూస్తే ఫ్యాషన్ రంగంలో ఎప్పుడైనా బ్రైట్ కలర్స్, కొత్త ప్రింట్స్, కొత్త కట్స్కి అధిక ప్రాధాన్యమిస్తారు. అయితే, ఏ వయసు వాళ్లు వాటిని ఎలా ధరిస్తున్నారు అనేది కూడా ముఖ్యమే. ఇప్పుడు ఫ్యాషన్ రంగాన్ని మాత్రం కరోనా ముందు–కరోనా తర్వాత అని విభజించి చూడచ్చు. ప్రజల ధోరణిలో కూడా మార్పు వచ్చింది. ఇప్పుడు సౌకర్యంగా దుస్తులు ధరించడానికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నారు. ఆర్గానిక్ ఫ్యాబ్రిక్స్, కంఫర్ట్ డ్రెస్సింగ్, బ్రైట్ కలర్స్,.. ఇవి ప్రపంచం మొత్తం కరోనా ఫ్రీ టైమ్‌లో తీసుకున్న నిర్ణయాలు అనేది దేశీయ, అంతర్జాతీయ ఫ్యాషన్ వీక్ల ద్వారా తెలుస్తోంది. ముఖ్యంగా రసాయనాలు లేని సస్టేయినబుల్ ఫ్యాబ్రిక్కే అగ్రస్థానం. పార్టీలకు కూడా ఆర్గానిక్ ఫ్యాబ్రిక్‌నే ఇష్టపడుతున్నారు. ఇప్పుడు ఏ పెద్ద బ్రాండ్ తీసుకున్నా ఆర్గానిక్ ఫ్యాబ్రిక్ డిజైన్స్ విరివిగా వచ్చేశాయి. కట్స్, ప్రింట్లు, కలర్ కాంబినేషన్స్ కూడా అలాగే ఎంచుకుంటున్నారు. దీంతో మేం కూడా సౌకర్యవంతమైన డిజైన్స్‌కే ఎక్కువ ప్రాముఖ్యం ఇస్తున్నాం. – హేమంత్ సిరి, ఫ్యాషన్ డిజైనర్, హైదరాబాద్ చదవండి: Kidney Stones: మూత్రనాళంలో తట్టుకుంటే తీవ్రమైన నొప్పి.. కాల్షియమ్ ఆక్సలేట్ ఉండే గింజలు తింటే అంతే సంగతి! ఇలా చేస్తే.. -
పూజా హెగ్డే ధరించిన డ్రెస్ ధర తెలిస్తే షాక్ అవ్వాల్సిందే!
బుట్టబొమ్మా.. బుట్టబొమ్మా పాటతో ప్రేక్షకులను బుట్టలో వేసుకొని అభిమానులుగా మార్చేసుకున్న నటి పూజా హెగ్డే. మరి ఆమెను బుట్టలో పడేసిన ఫ్యాషన్ బ్రాండ్స్ ఏంటో చూద్దాం.. అనీతా డోంగ్రే డిజైనర్ అనీతా డోంగ్రేకు చిన్నప్పటి నుంచే ఫ్యాషన్ అంటే ప్యాషన్. అందుకే ఫ్యాషన్ డిజైన్‌లో డిగ్రీ చేసింది. రాజస్థాన్ సంప్రదాయ ఎంబ్రాయిడరీనే తన డిజైన్స్‌కి ప్రేరణగా తీసుకుంటుంది. దాంతో అదే ఆమె బ్రాండ్ వాల్యూగా మారింది. 2015లో తన పేరుమీదే ముంబైలో ఫ్యాషన్ హౌజ్‌ను ప్రారంభించింది. ఇప్పుడది సెలబ్రిటీస్ ఫేవరెట్‌గా స్థిరపడిపోయింది. ఆ దుస్తుల ధరలు డిజైన్‌ను బట్టే ఉంటాయి. వేల నుంచి లక్షల్లో పలుకుతాయి. ఆన్‌లైన్‌లోనూ ఈ డిజైనర్ వేర్ అందుబాటులో ఉంది. బ్రాండ్: అనీతా డోంగ్రే ధర: రూ. 1,99,000 ఫుట్‌వేర్... టిన్సెల్ టోస్ టాప్ మోస్ట్ లగ్జూరియస్ ఫ్యాషన్ బ్రాండ్స్‌లో టిన్సెల్ టోస్ ఫుట్‌వేర్ ఒకటి. జపాన్‌లో మెయిన్ ఆఫీస్ ఉంది. సంప్రదాయ అల్లికలు, కుందన్ వర్క్స్‌తో లభించే ఈ జూతీస్కు ఇండియాలో మంచి గిరాకీ ఉంది. ఈ మధ్యనే చండీగఢ్‌లో కూడా ఓ బ్రాంచ్‌ను ప్రారంభించారు. సాధారణ ఫుట్‌వేర్ కూడా ఇక్కడ అందమైన డిజైన్స్‌లో దొరుకుతాయి. అందుకే, సామాన్యుడు నుంచి సెలబ్రిటీ వరకు ప్రతి ఒక్కరికీ ఈ బ్రాండ్ అంటే తీరని మోజు. ధర కూడా ఆ రేంజ్‌లోనే ఉంటుంది. పలు ప్రముఖ ఆన్లైన్ స్టోర్స్‌లోనూ లభిస్తాయి. బ్రాండ్: టిన్సెల్ టోస్ ధర: రూ. 2,499 సెలబ్రిటీలు అనగానే ఒకసారి ధరించిన దుస్తులను ఇంకోసారి ధరించరు అని చాలా మంది అనుకుంటూంటారు. కానీ, నేను అలా కాదు. స్టయిల్ అనేది మనం సెట్ చేసేదే. మిక్స్ అండ్ మ్యాచ్‌ను ట్రై చేస్తుంటా. – పూజా హెగ్డే -
మగువ అందానికి మోడరన్ లుక్
మగువ అందానికి మరిన్ని వన్నెలద్దే విభిన్న వస్త్రాభరణాల కలెక్షన్ ‘ఎలిగెన్స్ షాపి’ శ్రీనగర్‌కాలనీ సత్యసాయి నిగమాగమంలో సోమవారం ప్రారంభమైంది. టాలీవుడ్ భామ అలేఖ్య మోడరన్ డ్రెస్‌లో మురిపించింది.ఆధునిక, సంప్రదాయ ఉత్పత్తుల మేళవింపుతో ఏర్పాటు చేసిన ఈ ప్రదర్శనలో దేశంలోని ప్రముఖ నగరాల లేటెస్ట్ ఫ్యాషన్స్ ఆకట్టుకొంటున్నాయి. దీపావళి స్పెషల్ ఐటెమ్స్ స్పెషల్ ఎట్రాక్షన్. మంగళవారం కూడా ప్రదర్శన కొనసాగుతుంది. సాక్షి, సిటీప్లస్