కరోనా థర్డ్ వేవ్ మన దేశంలో నామమాత్రం కావడంతో క్రమంగా జనజీవనం సాధారణ స్థితికి చేరుకుంటోంది. మాస్క్‌లు, సామాజిక దూరం తప్ప మిగిలిన కరోనా ఆంక్షలన్నీ 2022 ఏప్రిల్ 1 నుంచి రద్దయిపోతాయంటూ కేంద్రం ఇప్పటికే ప్రకటించింది. ఈ నేపథ్యంలో ఇప్పటి వరకు వర్క్ ఫ్రం హోం విధానం అమలు చేసిన కంపెనీలు క్రమంగా ఉద్యోగులను ఆఫీసులకు రావాలని కోరుతున్నాయి.
ఇప్పటికే ఇన్ఫోసిస్ నారాయణమూర్తి వర్క్ ఫ్రం హోంపై స్పందిస్తూ.. ఈ మోడల్ భారతీయులకు నప్పదని. ప్రొడక్టివి దెబ్బతింటుందంటూ తన అభిప్రాయాన్ని కుండబద్దలు కొట్టారు. ఉద్యోగులు ఆఫీసుకు వచ్చి పని చేయాలంటూ హింట్ ఇచ్చారు. ఆయన బాటలోనే మరికొన్ని కంపెనీలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఆర్పీజీ గ్రూప్ చైర్మన్ హర్ష్ గోయెంకా స్పందించారు. కంపెనీలు వర్క్ ఫ్రం హోంకి గుడ్ బై ఉద్యోగులను ఎలా ఆఫీసులకు పిలుస్తున్నాయో చూడండి అంటూ అరేభాయ్ నికల్ ఆవో ఘర్ సే అనే పాత బాలీవుడ్ సాంగ్‌ని ట్విట్టర్లో పోస్ట్ చేశారు. హర్ష్ గోయెంకా టైమింగ్‌ను చూసి నెటిజన్లు ఫిదా అవుతున్నారు.
We have sent this video to all our colleagues at office #WFH 😀 @bang_lalitpic.twitter.com/BpaoArMWv3
— Harsh Goenka (@hvgoenka) March 25, 2022
Comments
Please login to add a commentAdd a comment