కరోనా కారణంగా లాక్‌డౌన్ విధించినప్పటి నుంచి వర్క్ ఫ్రం హోం విధానం ఉద్యోగుల జీవితంలో భాగంగా మారింది. చాలా కంపెనీలు క్రమంగా వర్క్ ఫ్రం హోం నుంచి రెగ్యులర్ ఆఫీస్ మోడ్‌కి షిఫ్ట్ అవుతుండగా ఐటీ కంపెనీల విషయంలోనే వర్క్ ఫ్రం ఎన్నాళ్లనేది తేలడం లేదు. ఓ వైపు వ్యాక్సినేషన్ ప్రక్రియతో ఆఫీసు పని విధానం, హైబ్రిడ్ మోడ్‌లు తెరపైకి వస్తుండగా మరో వైపు ఒమిక్రాన్, ఫ్లోరినా వంటి కొత్త వేరియంట్లు వెలుగు చూస్తున్నాయి. దీంతో ఆఫీస్ వర్క్‌పై కంపెనీల హెచ్‌ఆర్ విభాగం తీసుకునే నిర్ణయాలు ఒక అడుగు ముందుకు రెండు అడుగులు వెనక్కి అన్నట్టుగా మారింది.
నవ్వులు పూయిస్తోంది
వర్క్ ఫ్రం హోంపై తాజాగా నెలకొన్న పరిస్థితులను లవ్ క్లాసిక్ మొహబ్బతేతో పోల్చుతూ కొత్త మీమ్ వెలుగులోకి వచ్చింది. కేవలం రోజుల వ్యవధిలోనే వైరల్‌గా మారింది. ఇందులో మూడు ప్రేమ జంటలు (ఉద్యోగులు) డోలు వాయిస్తూ పాట పాడుతుండగా (వర్క్ ఫ్రం హోం).. అక్కడికి వచ్చిన అమితాబ్ (హెచ్‌ఆర్) ఆఫీస్‌కి రండి అన్నట్టుగా సీరియస్‌గా చూస్తాడు. హెచ్‌ఆర్‌ని చూసి ఉద్యోగులు నిశ్చేష్టులయి ఉండిపోగా.. అప్పుడే వచ్చిన షారూఖ్ (ఒమిక్రాన్ వేరియంట్) తిగిరి డోలు వాయిస్తాడు.. దీంతో ఉద్యోగులు తిరిగి డ్యాన్సు చేస్తూ పాట పాడుకుంటారు (వర్క్ ఫ్రం హోం). న్యూ ఇయర్ సందర్భంగా వచ్చిన ఈ మీమ్ నెట్టింట బాగా పాపులర్ అవగా తాజాగా ప్రముఖ ఇండస్ట్రియలిస్ట్ హర్ష్ గోయెంకా సైతం ఈ మీమ్‌ని తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేశారు.
WFH…..
— Harsh Goenka (@hvgoenka) January 3, 2022
pic.twitter.com/UfavDRUj3Y
Comments
Please login to add a commentAdd a comment