
మనలో చాలా మందికి ఆదివారం అంటే విపరీతమైన ఇష్టం. సెలవు కావడంతో ఏదో కొత్త ఉత్సాహం తొంగి చూస్తుంది. ఇక చాలా మందిలో సండే ఫీవర్ శనివారం నుంచే మొదలవుతుంది. రేపటి ఆదివారాన్ని తలుచుకుని ఈ రోజు పనులను చక్కబెట్టేస్తారు. అదే సోమవారం అంటే ఒకలాంటి నిరాసక్తత. అబ్బా మళ్లీ రోటిన్ లైఫ్ అనే భావన వచ్చేస్తుంది. దీన్నుంచి మనల్ని బయటపడేయాటానికి ప్రముఖ వ్యాపారవేత్త హర్ష్ గోయాంక మరో సారి ట్విట్టర్‌లోకి వచ్చేసారు. మరో మంచి స్ఫూర్తిదాయక కోట్‌ని షేర్ చేశారు. ఈ సారి సమగ్రత గొప్పతన్నాని తెలియజేశారు. బ్రెనే బ్రౌన్ చెప్పిన కోట్‌ని షేర్ చేశారు హర్ష్ గోయాంక. (చదవండి: ముందు మీ నీడను ధైర్యంగా ఎదుర్కోండి )
Integrity is choosing courage over comfort; choosing what is right over what is convenient, fast, or easy; and choosing to practice one’s values rather than simply professing them. Remember, there is no higher value in our society than integrity.#MondayMotivation
— Harsh Goenka (@hvgoenka) October 5, 2020
‘సమగ్రత.. సౌలభ్యం కంటే ధైర్యానికే అధిక ప్రాధాన్యత ఇస్తుంది. అనుకూలమైన, వేగవంతమైన, తేలికైన వాటిలో సరైనదాన్ని ఎంచుకోవాలి. విలువల గురించి ఇతరులకు చెప్పే ముందు మనం వాటిని ఆచరించాలి. మన సమాజంలో సమగ్రతకు మించిన విలువ దేనికి లేదు’ అంటూ ట్వీట్ చేశారు హర్ష్ గోయాంక. ఇది ప్రస్తుతం తెగ ట్రెండ్ అవుతుంది. నెటిజనులు చాలా కరెక్ట్‌గా చెప్పారు సార్ అంటూ కామెంట్ చేస్తున్నారు. మరొకరు సమగ్రత విజయానికి బీజం.. ఇది గమ్యం కాదు.. ఒక జీవన విధానం అంటూ రీ ట్వీట్ చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment