ఢిల్లీ : ప్రముఖ వ్యాపారవేత్త హర్ష్ గోయెంకా జీవిత సూత్రం తెలిపే ఒక ఆసక్తికర ట్వీట్‌తో ముందుకొచ్చారు. ప్రతీ ఒక్కరు జీవితం గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుందని.. అందుకే ఎంత జ్ఞానం సంపాదిస్తే జీవితంలో అంత ఎత్తుకు ఎదుగుతారని తెలిపారు. 'నీకు కనిపించే నీ నీడను నువ్వే ఎదుర్కోలేకపోతే.. బయటి వ్యక్తులను కూడా అదే కోణంలో చూస్తావు. ఎందుకంటే బయటి ప్రపంచంలో కనిపించేదంతా నీ లోపల ఉండే ప్రతిబింబమే. అందుకే లోపలి జీవితాన్ని కూడా ఒకసారి పరిశీలించు. ఎంత జ్ఞానం సంపాదిస్తేనే జీవితంలో ఉన్నత స్థాయికి ఎదిగే అవకాశం ఉంటుంది.' అంటూ ట్వీట్ చేశాడు.(చదవండి : క్వారంటైన్ సెంటర్‌లో మహిళను దోచేశారు)
ప్రస్తుతం హర్ష్ గోయెంకా ట్వీట్ వైరల్‌గా మారింది. హర్షా చేసిన ట్వీట్‌పై నెటిజన్లు తమదైన శైలిలో స్పందించారు. హర్షా గోమెంకా.. మీరు చెప్పింది అక్షరాల నిజమే.. ఎంతసేపు బయటి ప్రపంచం గురించి ఆలోచించాం తప్ప మనలో ఉన్న లోపలి ప్రపంచం గురించి ఎప్పుడు ఆలోచించలేదు. వెల్ సెడ్ సర్.. నిజజీవితం అర్థం కావాలంటే లోపలి జీవితాన్ని మరింత లోతుగా చూడాలి.. అంటూ కామెంట్లు పెడుతున్నారు. (చదవండి : కలయిక లేకుండానే గుడ్లు పెట్టింది..ఎలా సాధ్యం)
Comments
Please login to add a commentAdd a comment