
హార్షానంద పేరుతో ట్విటర్ వేదికగా చెణకులు విసిరే ఆర్‌పీజీ గ్రూపు చైర్మన్ హార్ష్ గోయెంకా అమెజాన్‌పై అదిరిపోయే పంచ్ పేల్చారు. నెటిజన్లు సైతం హర్ష్ గోయెంకా సెన్సాఫ్ హ్యూమర్‌కి పడిపడి నవ్వుతున్నారు. ఇంతకీ ఆయన ఏమన్నారంటే... అమెజాన్ సంస్థ ఇదీఅది అని తేడా లేకుండా అన్ని రకాల వస్తువులను అమ్ముతూ వ్యాపారం చేస్తూ ఉంటుంది కదా? ఇంత వరకు అమెజాన్ చేయని వ్యాపారం ఏంటీ అంటూ ప్రశ్నించాడు.
ఆ ప్రశ్నకు తానే బదులిస్తూ.. అమెజాన్ ఇప్పటి వరకు చేయని వ్యాపారం మ్యాట్రిమోని సర్వీసెస్ అంటూ తెలిపారు. ఒక వేళ అమెజాన్ కనుక మ్యాట్రిమోని సర్వీసుల్లోకి వస్తే తప్పకుండా విజయవంతం అవుతుందంటూ బల్లగుద్ది మరీ చెప్పాడు. ఎందుకంటే అమెజాన్‌లో కొనుగోలు చేసే వస్తువలు బాగాలేకపోతే 30 రోజుల్లో రిటర్న్ చేసే అవకాశం ఉంది కాబట్టి అంటూ చివర్న ఓ పంచ్‌ను అద్దారు. ఇప్పుడీ ట్వీట్ నెట్టింట వైరల్‌గా మారింది.
I asked Swami Harshanand “Amazon is in everything. Anything they are missing?”
— Harsh Goenka (@hvgoenka) June 13, 2022
He answered “Yes, they should be in matrimonial services. It is a blockbuster idea because they have a 30 day return policy, no questions asked.” pic.twitter.com/R1nXfiCrp8