సియట్ టైర్లు తయారు చేసే ఆర్‌పీజీ గ్రూప్ చైర్మన్ హర్ష్‌గోయెంకా కొత్త వ్యాపారం ప్రారంభిస్తున్నట్టుగా ట్విట్టర్‌లో ప్రకటించారు. జోగ్గీ పేరుతో కొత్తగా ఫుడ్ డెలివరీ వ్యాపారానికి సంబంధించి ఏర్పాట్లు చేస్తున్నట్టు వివరాలు వెల్లడించారు. దేశంలోనే ప్రముఖ పారిశ్రామికవేత్త నుంచి ఈ ప్రకటన రావడంతో జోమాటో, స్విగ్గీలకు కష్టాలు వచ్చినట్టే అని అంతా భావించారు.
కొత్త వ్యాపారానికి సంబంధించిన వివరాలు వెల్లడిస్తూ... చివర్లో హార్ష్ గోయెంకా ఓ ట్విస్ట్ ఇచ్చారు. అప్పటి వరకు సీరియస్‌గా న్యూ స్టార్టప్ గురించి చదువుతూ వెళ్లిన వారు... ఒక్కసారిగా ఘోల్లున నవ్వుకున్నారు. హర్ష్‌గోయెంకా సెన్సాఫ్ హ్యుమర్‌కి సలాం కొట్టారు. ఇప్పుడీ ట్వీట్ నెట్టింట వైరల్‌గా మారింది. లైకులు, కామెంట్లు, రీట్వీట్లలతో నెటిజన్లు హోరెత్తిస్తున్నారు.
ఇంతకీ ఆ ట్వీట్‌లో ఏముందంటే ‘ అందరికీ నమస్కారం! మీ సహకారం, ఆశీస్సులు నాకు కావాలి. ఎందుకంటే నేను కొత్త వ్యాపారం ప్రారంభించాలని అనుకుంటున్నాను. జొగ్గీ పేరుతో కొత్తగా ఫుడ్‌డెలివరీ స్టార్టప్ మొదలుపెడుతున్నాను. ఇందులో సూపర్ మెనూ, గ్రేట్ డిసెర్ట్స్ ఉన్నాయి. అంతే కాదు ఈ యాప్ ద్వారా ఆర్డర్ చేసే ఫుడ్ వల్ల బరువు కూడా తగ్గించుకోవచ్చని పేర్కొంటూ కొత్త బిజినెస్‌పై ఉత్కంఠ పెంచారు హర్ష్‌గోయెంకా... ఆ వెంటనే కొంత గ్యాప్ ఇచ్చి... బరువు ఎలా తగ్గుతారబ్బ అని అంతా ఆలోచించే లోగానే ఆ సీక్రెట్‌ని కూడా ఆయన వివరించారు. అదేంటంటే ఈ యాప్ ఆర్డర్స్ తీసుకుంటుంది. కానీ ఐటమ్స్ డెలివరీ చేయదు అంటూ ముక్తాయించారు. హర్ష్ గోయెంకా ఇచ్చిన లాస్ట్ పంచ్‌కి నెటిజన్లు ఫిదా అవుతున్నారు.
Hello Everyone,
— Harsh Goenka (@hvgoenka) October 22, 2021
Need ur help, blessings & wishes🙏🏻
I am starting my new venture, a startup food app called Zoggy (super menu, great desserts) that will help all of you reduce weight dramatically!
It works as follows:
You order, I won't deliver
Comments
Please login to add a commentAdd a comment