
సాక్షి, తూర్పుగోదావరి : మానసిక రుగ్మతలు పెరగకుండా ఉండేందుకు ప్రభుత్వం మద్యం షాపులు తెరిచిందని మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి తానేటి వనిత అన్నారు. రాజమండ్రిలో ఎంపీ మార్గాని భరత్ ఏర్పాటు చేసిన హ్యండ్ వాష్ ట్యాంకులను మంత్రి తానేటి వనిత ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. లాక్‌డౌన్ తర్వాత మద్యం షాపులు ఎప్పుడూ తెరిచినా పరిస్థితి ఇలాగే ఉంటుందన్నారు.
దశల వారీగా మద్యపాన నిషేధంలో భాగంగానే మద్యం రేట్లు పెంచామని, ఆదాయం కోసం కాదని మంత్రి స్పష్టం చేశారు. ఆర్థిక సంక్షోభంలో కూడా ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మహిళలకు రెండు సంక్షేమ పథకాలు అమలు చేశారని అన్నారు. కొవ్వూరు వద్ద ఇసుక ర్యాంపుల్లో చిక్కుకున్న బీహార్, ఇతర రాష్ట్రాలకు చెందిన వలస కూలీలను త్వరలోనే ప్రత్యేక శ్రామిక్ రైలులో స్వస్థలాలకు పంపిస్తామని మంత్రి తానేటి వనిత పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment