ఏదైనా వస్తువుకు ఒక్కసారిగా డిమాండ్ పెరిగితే దాని ధర కూడా పెరిగిపోతుంది. ఇది మార్కెట్ సూత్రం. కోవిడ్-19 (కరోనా వైరస్) భారత్‌లోనూ విజృంభిస్తున్న నేపథ్యంలో శానిటైజర్స్‌కి గిరాకీ బాగా పెరిగింది. డిమాండ్‌ను సొమ్ము చేసుకునేందుకు వ్యాపారులు దాని రేట్లు అమాంతం పెంచేస్తున్నారు. కొన్ని మెడికల్ షాపుల్లో అయితే స్టాక్ లేక కంపెనీల నుంచి ఆర్డర్లు పెడుతున్నారు. నిజానికి మార్కెట్‌లో దొరికే శానిటైజర్స్‌కు ఏమాత్రం తీసిపోని విధంగా మనం కూడా ఇంట్లోనే తయారుచేసుకోవచ్చు. అది కూడా చాలా తక్కువ సమయంలో, తక్కువ ఖర్చుతోనే ఈ శానిటైజర్స్ తయారుచేసుకోవచ్చు.
దీనికి కావల్సినవి:
1. రెండు కప్పుల రబ్బింగ్ ఆల్కహాల్
2. ఒక కప్పు అలోవెరా గుజ్జు
3. పది చుక్కల టీట్రీ ఎసెన్షియల్ ఆయిల్.
తయారీ విధానం
రబ్బింగ్ ఆల్కహాల్, కలబంద గుజ్జును బాగా కలపాలి. చివర్లో ఎసెన్షియల్ ఆయిల్‌ను కూడా కలుపుతూ ఓ లిక్విడ్ లాగా అయ్యేంతవరకు బాగా కలపాలి. అంతే హ్యాండ్ శానిటైజర్ సిద్దమైనట్లే. ఆ మిశ్రమాన్ని బాటిళ్లలోకి పోసుకొని వాడుకోవచ్చు.
Comments
Please login to add a commentAdd a comment