ఇంటింటా డాక్టర్‌ | Sakshi Interview about Doctor Sarala | Sakshi
Sakshi News home page

ఇంటింటా డాక్టర్‌

Published Thu, Mar 28 2024 12:57 AM | Last Updated on Thu, Mar 28 2024 12:57 AM

Sakshi Interview about Doctor Sarala

సరళ వైద్యం

‘ప్రతి మనిషిలోనూ ఓ డాక్టర్‌ ఉంటారు. ప్రతి ఒక్కరిలో వైద్యం గురించి ్రపాథమిక అవగాహన ఉంటుంది’ అనే మౌలిక సూత్రాన్ని పట్టుకున్నారు డాక్టర్‌ సరళ. వైద్యరంగాన్ని అత్యంత సరళంగా వివరించి చెబుతున్నారు. ఆసక్తి ఉన్న వాళ్లను, ముఖ్యంగా గృహిణులను హెల్త్‌ అడ్వయిజర్‌లుగా తీర్చిదిద్దుతున్నారు. ఆహ్వానం పలికిన కాలనీలకు వెళ్లి హెల్త్‌ అవేర్‌నెస్‌ క్యాంపులు నిర్వహిస్తున్నారు. ‘‘ఇంటింటా ఓ డాక్టర్‌’ ఉండాలి. ఆ డాక్టర్‌ మహిళ అయితే ఇంట్లో అందరి ఆరోగ్యాన్ని కాపాడుతుంది.

తన బంధువులు స్నేహితులకు నిస్వార్థమైన వైద్యసేవలందిస్తుంది. గ్రామాల్లో వైద్య సహాయం అందని పరిస్థితులు ఇప్పటికీ ఉన్నాయి. నేను తయారు చేస్తున్న హెల్త్‌ అడ్వయిజర్‌ వ్యవస్థ ద్వారా ఆ లోటును భర్తీ చేయాలనేది నా ఆకాంక్ష’’ అన్నారు డాక్టర్‌ సరళ. ఆమె సాక్షితో మాట్లాడుతూ ‘‘నేను డాక్టర్‌ కావాలనే ఆలోచన నాది కాదు, మా అమ్మ కోరిక. నిఫ్ట్‌లో కోర్సు చేసి ఫ్యాషన్‌ డిజైనర్‌ కావాలనే నా ఆకాంక్ష నెరవేరలేదు. కానీ వైద్యరంగాన్ని సమాజానికి అవసరమైనట్లు     రీ డిజైన్‌ చేస్తున్నా’’నని చె΄్పారు.

‘‘మాది కాకినాడ. నాన్న బిజినెస్‌ చేస్తారు. అమ్మ గవర్నమెంట్‌ ఉద్యోగంలో హెడ్‌ ఆఫ్‌ ది ఫార్మసీ డిపార్ట్‌మెంట్‌గా రిటైరయ్యారు. ఆడవాళ్లను చదువులో ్రపోత్సహించడం మా ఇంట్లోనే ఉంది. అమ్మకి పదవ తరగతి పూర్తయిన వెంటనే పెళ్లి చేశారు. మా నాన్నే అమ్మను చదివించారు. ఇక ముగ్గురు పిల్లల్లో నేను పెద్దదాన్ని కావడంతో అమ్మ కల నెరవేర్చే బాధ్యత నాదయింది. సాధారణంగా మెడిసిన్‌లో ఎంబీబీఎస్‌లో సీట్‌ రాని వాళ్లు హోమియో, ఆయుర్వేదం వంటి ఆల్టర్నేటివ్‌ మెడిసిన్‌ వైపు వెళ్తారనే అభి్రపాయం సమాజంలో స్థిరంగా ఉంది.

కానీ హోమియో మీద ఇష్టంతో బీహెచ్‌ఎమ్‌ఎస్‌లో చేరాను. ఖాళీ సమయాల్లో కూడా మా ్ర΄÷ఫెసర్‌లకు సహాయం చేస్తూ సబ్జెక్టు లోతుగా తెలుసుకున్నాను. పెళ్లి అయి వైజాగ్‌ వెళ్లిన తర్వాత సీనియర్‌ దగ్గర ఏడాది పని చేయడం నన్ను పరిపూర్ణం చేసింది. ఈ రంగంలో సాధించే అనుభవం అంతా పేషెంట్‌తో ఎక్కువ సేపు మాట్లాడి, వ్యాధి లక్షణాలను, వారి జీవనశైలిని, మానసిక స్థితి గురించి వివరంగా అడిగి తెలుసుకోవడంతోపాటు ఎక్కువమందికి వైద్యం అందించడమే. అప్పుడే సొంతంగా ్రపాక్టీస్‌ పెట్టగలిగిన ధైర్యం వస్తుంది. హైదరాబాద్‌లో సొంతంగా క్లినిక్‌ తెరవడం... నన్ను సమాజం కోసం పని చేయాలనే ఆలోచనకు బీజం వేసింది.  

 పేషెంట్‌ల వల్లనే తెలిసింది!
నేనిప్పుడు ఇండియన్‌ ఆయిల్‌ కార్పొరేషన్‌లో ప్యానల్‌ డాక్టర్‌గా సేవలందిస్తున్నాను. నెలకు కనీసం పదికి తక్కువ కాకుండా హెల్త్‌ అవేర్‌నెస్‌ ్రపోగ్రామ్స్‌ చేస్తున్నాను. హెల్త్‌ కేర్‌ అవేర్‌నెస్‌ ్రపోగ్రామ్‌ల అవసరం ఉందని గుర్తించడానికి కారణం నా దగ్గరకు వచ్చే పేషెంట్‌లే. డయాబెటిస్, హైపర్‌ టెన్షన్, స్ట్రోక్, క్యాన్సర్‌ వంటి దీర్ఘకాలిక వ్యాధుల చికిత్స కోసం నా దగ్గరకు వచ్చే చాలామందిలో అప్పటికే వ్యాధి తీవ్రత పెరిగిపోయి చికిత్సకు స్పందించని స్థితికి చేరి ఉండేది. అల్లోపతిలో వైద్యం చేయించుకుని ఆరోగ్యం మెరుగైన వాళ్లు సంతోషంగా జీవితాన్ని కొనసాగిస్తుంటారు. అక్కడ సాంత్వన లభించని వాళ్లు ఓ ప్రయత్నం అన్నట్లుగా హోమియో వంటి వైద్య ప్రక్రియల వైపు వస్తుంటారు.

ఆల్టర్‌నేటివ్‌ మెడిసిన్‌ పట్ల అవగాహన లేకపోవడమే ఇందుకు కారణం. మూడు నెలల్లో పూర్తి స్థాయిలో చికిత్స చేయగలిగిన మందులు ఉండి కూడా చివరి దశ వరకు ఈ చికిత్సకు అందుబాటులోకి రాకపోవడం వల్ల ్రపాణాలు కోల్పోతున్న వాళ్లు ఎందరో. అలాంటి గ్యాప్‌కు 2015 నుంచి నేను బ్రిడ్జినవుతున్నాను. గతంలో కాలనీలకు వెళ్లి సమావేశాలు ఏర్పాటు చేయాల్సి వచ్చేది. సమావేశం ఉందనే సమాచారం కాలనీలో అందరికీ చేర్చడం కూడా ప్రయాసతో కూడి ఉండేది. ఇప్పుడు ఒక గేటెడ్‌ కమ్యూనిటీలో వందకు పైగా కుటుంబాలు నివసిస్తున్నాయి. ఆ కమ్యూనిటీ వాట్సాప్‌ గ్రూప్‌లో ఒక్క మెసేజ్‌ పెడితే సమాచారం అందరికీ చేరుతుంది. ఆసక్తి ఉన్నవాళ్లు హాజరవుతున్నారు. స్కూళ్లకు, కాలేజీలకు వెళ్లి మెన్‌స్ట్రువల్‌ హెల్త్, పీసీఓడీ వంటి సమస్యల మీద అవగాహన కల్పిస్తున్నాను. దీనికితోడుగా హెల్త్‌ అడ్వైజర్‌ అనే కాన్సెప్ట్‌కు కూడా శ్రీకారం చుట్టాను.  
 
వారం రోజుల శిక్షణ
అనారోగ్యాల పట్ల జాగ్రత్తగా ఉండాలి, కానీ ప్రతి చిన్న ఆరోగ్య సమస్యకీ బెంబేలు పడిపోయి హాస్పిటళ్లకు పరుగులు తీయాల్సిన పని ఉండదు. సాధారణ జలుబు, దగ్గు వంటి వాటికి ఇంట్లోనే వైద్యం చేసుకోవచ్చు. మూడు రోజులు దాటినా తగ్గకపోతే డాక్టర్‌ దగ్గరకు వెళ్లమని చెబుతాం. మొదటి మూడు రోజుల వైద్యం అందించగలిగేటట్లు హెల్త్‌ అడ్వైజర్‌లను తయారు చేస్తున్నాను. రోజుకో గంటసేపు వారం రోజులపాటు ఉంటుంది ఈ కోర్సు. మందులు కూడా హెల్త్‌ అడ్వైజర్‌లు పేషెంట్‌ లక్షణాలను బట్టి సులువుగా ఇవ్వగలిగేటట్లు తయారు చేశాను. మనకు స్వాతంత్య్రం వచ్చి 76 ఏళ్లయినప్పటికీ దేశంలో ఇంకా డాక్టర్‌– పేషెంట్‌ల నిష్పత్తి సమతుల్యతలో పెద్ద అగాధమే ఉంది.

వెయ్యి మంది పేషెంట్‌లకు ఒక డాక్టర్‌ అందుబాటులో ఉండాలనే సదుద్దేశం నెరవేరడం లేదు. పట్టణాల్లో అవసరానికి మించినంత మంది వైద్యులున్నారు, గ్రామాల్లో వైద్యం కరువవుతోంది. గృహిణులకు హెల్త్‌ అడ్వైజర్‌లుగా శిక్షణ ఇవ్వడం వల్ల ఆ లోటు కొంత భర్తీ అవుతోంది. వైద్యం అంటే... సామాన్యులకు అర్థం కాని చదువు కాదు, అత్యంత సులువుగా అర్థం చేసుకోగలిగిన శాస్త్రం అని నిరూపించడం, ప్రతి ఒక్కరికీ నాణ్యమైన వైద్యం అందించడమే నా లక్ష్యం. కోర్సులో భాగంగా నేర్చుకున్న వైద్యాన్ని నా వంతుగా కొంత విస్తరించి 76 అనారోగ్యాలకు మందులు కనుక్కున్నాను. వాటికి ఆయుష్‌ నుంచి నిర్ధారిత గుర్తింపు కూడా వచ్చింది’’ అని వైద్యరంగాన్ని సరళతరం చేయడంలో తన వంతు భాగస్వామ్యాన్ని వివరించారు డాక్టర్‌ సరళ.  

– వాకా మంజులారెడ్డి, సాక్షి ఫీచర్స్‌ ప్రతినిధి
ఫొటోలు: అనిల్‌ కుమార్‌ మోర్ల

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement