Health Advisor Platform
-
Health: సిజేరియన్ చేయించుకోవడంలో ఏమైనా ప్రమాదం ఉంటుందా?
నాకిప్పుడు 9వ నెల. ఫస్ట్ టైమ్ డెలివరీ చాలా కష్టమైంది. ఇప్పుడు నాకు సిజేరియన్ చేయించుకోవాలనే ఉంది. దీనివల్ల ఏదైనా ప్రమాదం ఉంటుందా? ఇప్పుడు ఆపరేషన్‌ను సేఫ్‌గా చేసే సదుపాయాలు చాలానే ఉన్నాయట కదా! ఫస్ట్ టైమ్ నార్మల్ డెలివరీ అయితే రెండోసారి సిజేరియన్‌కి వెళ్లకూడదా? దయచేసి నా డౌట్స్ క్లియర్ చేయండి! – ప్రసూన వనరాజు, హన్మకొండఏ మెడికల్ రీజన్ లేకుండా సిజేరియన్‌కి వెళ్లటం మంచిదికాదు. మీకు మొదటి కాన్పు నార్మలే అయింది కాబట్టి ఈ సెకండ్ డెలివరీ త్వరగా.. ఈజీగా అయ్యే చాన్సేసే ఎక్కువ. అయితే మీకు ఫస్ట్ డెలివరీ కష్టమైందని సిజేరియన్‌కి వెళదామనుకుంటున్నారు కాబట్టి ఎందుకు కష్టమైందో.. ఆ ప్రాబ్లమ్ ఏంటో మీరు మీ గైనకాలజిస్ట్‌తో వివరంగా చర్చించండి. అది మళ్లీ రిపీట్ అయ్యే ప్రాబ్లమ్ లేదా పెల్విక్ ఫ్లోర్ ప్రాబ్లమ్ కాకపోతే నార్మల్ డెలివరీకి ప్రయత్నించడమే మంచిది.రిస్క్స్, ప్రయోజనాలు రెండూ రెండు (నార్మల్ లేదా సిజేరియన్) డెలివరీల్లో ఉంటాయి. రికవరీ టైమ్ నార్మల్ డెలివరీ కన్నా సిజేరియన్ డెలివరీలో ఎక్కువ. అనవసరంగా సిజేరియన్ చేయకూడదని ప్రభుత్వం నుంచీ సీరియస్ అడ్వయిజెస్ ఉన్నాయి. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ కూడా ఇదే మాటను చెబుతోంది. దీన్నిబట్టి ఆపరేషన్ రిస్క్ ఎక్కువనే కదా అర్థం. ఇందులో షార్ట్ టర్మ్ / లాంగ్ టర్మ్ రిస్క్స్ ఉంటాయి. వెజైనల్ బర్త్‌లో కొంత ఆందోళన, అన్ప్రిడిక్టబులిటీ ఉంటాయి. పెయిన్ రిలీఫ్ ఇష్యూస్ ఉంటాయి. ఈ రిస్క్‌ని ఆపరేషన్‌తో నివారించినా సిజేరియన్తో కుట్ల దగ్గర ఇన్ఫెక్షన్ రిస్క్ ఉంటుంది.ఇది పదిమందిలో ఒకరికి వస్తుంది. తగ్గటానికి కొన్ని నెలలు పడుతుంది. అలాగే సిజేరియన్ అయిన వాళ్లల్లో కాళ్లల్లో, ఛాతీలో రక్తం గడ్డకట్టే ప్రమాదం అయిదు రెట్లు ఎక్కువ. అంతేకాదు బ్లీడింగ్ ఎక్కువై రక్తం ఎక్కించాల్సి వచ్చే రిస్క్ కూడా సిజేరియన్ కేసుల్లోనే ఎక్కువ. అధిక బరువు ఉన్న వారిలో ఈ రిస్క్స్ రెండింతలెక్కువ. బిడ్డలో కూడా టెంపరరీ బ్రీతింగ్ ప్రాబ్లమ్ ఉంటుంది. కొన్నిసార్లు ఎన్ఐసీయూ కేర్‌లో అడ్మిట్ చేయాల్సి రావచ్చు. సిజేరియన్‌ను ఎంత జాగ్రత్తగా చేసినా వెయ్యిలో ఒకరికి బవెల్ / బ్లాడర్ ఇంజ్యూరీ, యురేటర్ ఇంజ్యూరీ కావచ్చు. మళ్లీ తర్వాత డెలివరీ కూడా సిజేరియనే చేయాల్సి వస్తుంది.తర్వాత ప్రెగ్నెన్సీలో ప్లెసెంటా సిజేరియన్ స్కార్‌కి అతుక్కుని బ్లీడింగ్ ఎక్కువయ్యే ప్రమాదం ఉండొచ్చు. వెజైనల్ డెలివరీలో కూడా కొన్ని రిస్క్స్ ఉంటాయి. ఇన్స్ట్రుమెంటల్ డెలివరీ చాన్సెస్ ఉండొచ్చు. వెజైనల్ టేర్స్ లేదా ఎపిసియోటమీ (్ఛpజీటజీ్టౌౌఝy) పెయిన్ ఉండొచ్చు. కానీ పైన చెప్పిన సిజేరియన్ రిస్క్స్ కన్నా ఇవి చాలా తక్కువ. తేలికగా ట్రీట్ చేయొచ్చు. ఈరోజుల్లో మంచి పెయిన్ రిలీఫ్ ఆప్షన్స్ ఉన్నాయి. ఇవన్నీ ఆలోచించి .. మీకు ఇంతకుముందు ఎదురైన ఇబ్బంది ఈసారి తలెత్తకుండా భద్రంగా వెజైనల్ డెలివరీ చేయటమే మంచిది. ఒకసారి మీ గైనకాలజిస్ట్‌తో అన్ని సవివరంగా చర్చించి మీకు, పుట్టబోయే బిడ్డకు ఏది సురక్షితమో ఆ సలహా, సూచనను తీసుకోండి.— డా. భావన కాసు, ఆబ్స్టేట్రీషియన్, హైదరాబాద్ -
ప్రెగ్నెన్సీ నిలుపుదలలో.. పెరుగుతున్న భయం తగ్గాలంటే?
నాకు ఇదివరకు రెండుసార్లు 5 వ నెలలో నొప్పులు రాకుండానే అబార్షన్ అయింది. సెర్విక్స్‌కి కుట్లు వేసినా ప్రెగ్నెన్సీ ఆగలేదు. ఇప్పుడు రెండవ నెల. ఈ ప్రెగ్నెన్సీ నిలవాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో చెప్పగలరు. – వి. మౌనిక, సికింద్రాబాద్మీరు చెప్పిన కండిషన్‌ని సెర్వైకల్ ఇన్‌కంపిటెన్స్ అంటారు. కొంతమందికి పుట్టుకతోనే సెర్విక్స్ వీక్‌గా ఉంటుంది. దీనివల్ల గర్భస్థ శిశువు బరువు పెరిగే కొద్ది మోయలేక మూడు నెలల తర్వాత గర్భస్రావం లేదా కాన్పు సమయం కంటే ముందుగానే వాటర్ బ్రేక్ అవడం లేదా నెలలు నిండకుండానే ప్రసవం అవుతుంది. ఇన్ఫెక్షన్ లాంటివి ఏవీ లేకుండా, నొప్పులూ లేకుండా సెర్విక్స్ తెరుచుకుని అబార్షన్ లేదా నెలలు నిండకుండానే డెలివరీ అయిపోతుంది. మొదటి ప్రెగ్నెన్సీలో అలా అయినప్పుడు రెండవసారి ప్రెగ్నెన్సీలో 3వ నెలలో ట్రాన్స్‌వెజైనల్ సర్క్లేజ్ అంటే వెజైనాలోంచి సెర్విక్స్ దగ్గర టేప్‌తో కుట్లు వేస్తారు.ఇవి సెర్విక్స్‌ని మూసి ఉంచుతాయి. నెలలు నిండిన తరువాత 37–38 వారాల్లో ఈ కుట్లను విప్పి నార్మల్ డెలివరీ కోసం వెయిట్ చేస్తారు. అయితే కొన్ని కేసేస్లో ఈ కుట్లు వేసినా అబార్షన్ అవుతుంది. అలాంటి వారికి ట్రాన్స్‌అబ్డామినల్ అప్రోచ్ అంటే ప్రెగ్నెన్సీకి ముందు లేదా మూడవ నెలలో పొట్టను ఓపెన్ చేసి సెర్విక్స్‌కి కుట్లు వేస్తారు. ఇవి సెర్విక్స్‌ని టైట్‌గా క్లోజ్ చేసి ఉంచుతాయి. ఈరోజుల్లో ఈ ప్రొసీజర్ని లాపరోస్కోపీ ద్వారా చేస్తున్నారు. పొట్ట మీద కోత లేకుండా చిన్న చిన్న రంధ్రాలు చేసి వాటి ద్వారా సెర్విక్స్‌కి కుట్లు వేస్తారు.ఇది తల్లికీ, బిడ్డకూ ఇద్దరికీ సురక్షితమైన ప్రక్రియ. దీనికోసం ఆసుపత్రిలో జాయిన్ అవాల్సిన అవసరం లేదు. డే కేర్‌లోనే చేసేస్తారు. చేసిన రోజే ఇంటికి వెళ్లిపోవచ్చు. కొన్ని జాగ్రత్తలు, సూచనలు చెప్తారు. అయితే ఈ కుట్లు తీయడం కష్టం కాబట్టి.. ఈ కేసుల్లో సిజేరియన్ డెలివరీయే చేయాల్సి ఉంటుంది. కుట్లు అలాగే ఉండి.. తర్వాత వచ్చే ప్రెగ్నెన్సీని కాపాడుతాయి. ఒకవేళ తరువాత పిల్లలు వద్దు అనుకుంటే సిజేరియన్ టైమ్‌లోనే కుట్లు తీసేస్తారు. ఈ ప్రక్రియను అనుభవజ్ఞులైన లాపరోస్కోపీ సర్జన్ చాలా భద్రంగా చేస్తారు. కాన్పు సమయం దగ్గరపడుతున్నా.. లేదా నొప్పులు మొదలైన వెంటనే ఆపరేషన్ చేసి బిడ్డను తీస్తారు.ఏదైనా గర్భిణీ మానసిక, శారీరక ఆరోగ్యాన్ని బట్టి నిర్ణయం తీసుకోవడం మంచిది. మీరు ఒకసారి గైనకాలజిస్ట్‌ని కలసి, రెండవ నెలలో రక్త, మూత్ర పరీక్షలు చేయించుకొని యూరిన్ లేదా వెజైనాలో ఏ ఇన్ఫెక్షన్ లేదని నిర్ధారణ చేసుకోండి. వయబిలిటీ స్కాన్ చేస్తారు. సెర్విక్స్‌కి కుట్లు వేయాలి అనే నిర్ణయానికి వస్తే అవి ఏ టైమ్‌లో వేయాలో నిర్ధారించుకుంటారు. మామూలుగా అయితే.. మూడవ నెలలో గర్భిణీలందరికీ చేసే Nuఛిజ్చి∙్టట్చnట uఛ్ఛిnఛిy టఛ్చిn (Nఖీ స్కాన్) తర్వాత లాపరోస్కోపిక్ సెర్వైకల్ సర్‌క్లేజ్‌కి ప్లాన్ చేస్తారు. ఇప్పటివరకు జరిగిన పలు అధ్యయనాల్లో.. ఇలా కుట్లు వేసిన వారిలో 89 శాతం మందిలో గర్భం నిలబడి.. సురక్షితంగా బిడ్డను కన్నట్టు వెల్లడైంది.— డా. భావన కాసు, ఆబ్స్టేట్రీషియన్, హైదరాబాద్ -
ప్రెగ్నెన్సీలో డౌన్ సిండ్రోమ్ పాజిటివ్ అంటే..? ప్రమాదమా..!
నాకు 40 ఏళ్లు. మూడవ నెల ప్రెగ్నెన్సీలో డౌన్ సిండ్రోమ్ పాజిటివేమో అనే డౌట్ చెప్పారు. చాలా భయంగా ఉంది. ఇప్పుడు ఉమ్మనీరు టెస్ట్ చేస్తామన్నారు. దీనివల్ల అన్నీ కనిపెట్టొచ్చా? బేబీ హెల్దీగా ఉన్నట్టు ఎలా గుర్తించడం? – ఎన్. వైశాలి, షోలాపూర్ ఆమ్నియోసెంటీసిస్ (Amniocentesis) ద్వారా ఉమ్మనీరును టెస్ట్ చేసి తెలుసుకోవచ్చు. తగు జాగ్రత్తలతో ఫీటల్ మెడిసిన్ కన్సల్టెంట్.. పొట్టలోపల బేబీకి టెస్ట్ చేసే ప్రక్రియ ఇది. ఈ వైద్య పరీక్షను ముఖ్యంగా క్రోమోజోమల్ సమస్యలేమైనా ఉన్నాయేమో అనే అనుమానాన్ని నివృత్తి చేసుకోవడానికి సూచిస్తారు. జన్యు వ్యాధుల విషయంలోనూ ఈ టెస్ట్‌ను చేస్తారు. 40 ఏళ్ల వయసులో ప్రెగ్నెంట్ కావడం, మీ బ్లడ్ టెస్ట్‌లలో డౌట్ రావడం వల్ల క్రోమోజోమల్ అబ్నార్మాలిటీస్ కనిపెట్టడానికి ఈ టెస్ట్‌ని సజెస్ట్ చేసి ఉంటారు. దీన్ని చాలా అనుభవం ఉన్న స్పెషలిస్ట్‌లే చేస్తారు. మీరు మామూలుగా ఫుడ్ తినే ఈ టెస్ట్‌కి వెళ్లొచ్చు. ఔట్ పేషంట్ డిపార్ట్మెంట్లోనే చేస్తారు. అల్ట్రసౌండ్ చేసి.. బేబీ, ప్లాసెంటా, పొజిషన్‌ను చెక్ చేసి వివరించి కన్సెంట్ తీసుకుని చేస్తారు. టెస్ట్ రిజల్ట్స్ 5 నుంచి 15 రోజుల్లో వస్తాయి. వచ్చే రిజల్ట్స్‌ని బట్టి తదనంతర పరిణామాలను మీతో డిస్కస్ చేస్తారు. ఈ టెస్ట్‌లో అన్నిరకాల అబ్నార్మిలిటీస్ని కనిపెట్టలేము. దీనికి కొన్ని పరిమితులు ఉంటాయి. సెరిబ్రల్ పాల్సీ, ఆటిజం, స్పీనల్ బిఫడా, ఫిజికల్ చేంజెస్‌ను ఇందులో కనిపెట్టలేం. అలాంటివాటికి కొన్నిసార్లు అడ్వాన్స్డ్ స్కాన్ అవసరం అవుతుంది. ఈ ప్రొసీజర్‌లో 0–5 శాతం గర్భస్రావం అయ్యే రిస్క్, ఇన్ఫెక్షన్ రిస్క్ ఉంటుంది. యాంటీబయాటిక్స్ ఇస్తారు. ప్రొసీజర్ తర్వాత కొంచెం విశ్రాంతి తీసుకుని ఇంటికి వెళ్లొచ్చు. మైల్డ్ క్రాంప్స్ ఉంటాయి. పారాసిటమాల్ లాంటివి ఇస్తారు. పెయిన్ కిల్లర్స్ వాడకూడదు. ప్రొసీజర్ తర్వాత బాగా కడుపు నొప్పి వచ్చినా, బ్లీడింగ్ అవుతున్నా.. వాటర్ లీక్ అయినా ఆసుపత్రిలో అడ్మిట్ అవ్వాలి. ఇంటికి వెళ్లాక ఇలాంటి లక్షణాలు కనపడినా.. చలి, జ్వరం ఉన్నా వెంటనే ఎమర్జెన్సీ వార్డ్‌కి వెళ్లాలి. రిజల్ట్స్ కోసం వెయిట్ చేస్తున్నప్పుడు స్ట్రెస్ ఫీలవకుండా.. పౌష్టికాహారం తీసుకోవాలి. — డా‘‘ భావన కాసు, గైనకాలజిస్ట్ & ఆబ్స్టెట్రీషియన్, హైదరాబాద్ -
వెజైనా నుంచి బ్యాడ్ స్మెల్ వస్తే పరిస్థితి అంతేనా..!
నాకు 18 ఏళ్లు. వెజైనా నుంచి బ్యాడ్ స్మెల్ వస్తోంది. నేను హాస్టల్లో ఉంటాను. నా ప్రాబ్లమ్‌కి సరైన మెడిసిన్‌ని సజెస్ట్ చేయగలరు. – అనామిక, హైదరాబాద్ వెజైనల్ ఇన్ఫెక్షన్స్లో చాలా కామన్‌గా వచ్చేది బ్యాక్టీరియల్ వెజైనోసస్. ఇది ఏ వయసు వారికైనా రావచ్చు. వెజైనా నుంచి బ్యాడ్ స్మెల్ ఉంటుంది. రాషెస్, ఇచింగ్ ఉండవు. ఇది వెజైనాలో ఉండే నార్మల్ బ్యాక్టీరియా ఎక్కువైతే వస్తుంది. పలచగా.. వైట్‌గా డిశ్చార్జ్ కావచ్చు. ఫిషీ స్మెల్ ఉంటుంది. వెజైనా ఎసిడిటీ చేంజెస్ వల్ల వస్తుంది. సువాసనగల సబ్బులు, బబుల్ బాత్స్, వెజైనల్ డియోడరెంట్స్ వాడేవారిలో ఇది ఎక్కువ. ఇన్నర్వేర్ని గాఢమైన డిటర్జెంట్స్‌తో ఉతికినా.. తరచుగా యూరిన్ ఇన్ఫెక్షన్కి గురవుతున్నా ఇది ఎక్కువ అవుతుంది. మీరు ఒకసారి డాక్టర్ని సంప్రదిస్తే కాటన్ స్వాబ్‌తో వెజైనా నుంచి శాంపిల్ తీసి యూరిన్‌ని కూడా టెస్ట్‌కి పంపిస్తారు. ఆ రిజల్ట్స్‌తో కన్ఫర్మ్ అయితే యాంటీబయాటిక్ మాత్రలు, Doxycycline, Metronidazole లాంటివి ఇస్తారు. డాక్టర్ సలహా మేరకు పూర్తి కోర్స్ వాడాలి. కొంచెం తగ్గగానే మందులు ఆపేస్తే తిరగబెట్టే రిస్క్ పెరుగుతుంది. స్ట్రాంగ్ వెజైనల్ వాషెస్ కూడా వాడకూడదు. రోజుకు నాలుగైదుసార్లు వేడి నీళ్లతో శుభ్రం చేసుకుని.. పొడిగా ఉంచుకోవాలి. కాటన్ ఇన్నర్వేర్నే వాడాలి. ఎక్కువసార్లు ఈ ఇన్ఫెక్షన్ అవుతూంటే యూరిన్ కల్చర్, సెన్సిటివిటీ చెక్ చేయాల్సి ఉంటుంది. — డా‘‘ భావన కాసు, గైనకాలజిస్ట్ & ఆబ్స్టెట్రీషియన్, హైదరాబాద్ -
ఇంటింటా డాక్టర్
‘ప్రతి మనిషిలోనూ ఓ డాక్టర్ ఉంటారు. ప్రతి ఒక్కరిలో వైద్యం గురించి ్రపాథమిక అవగాహన ఉంటుంది’ అనే మౌలిక సూత్రాన్ని పట్టుకున్నారు డాక్టర్ సరళ. వైద్యరంగాన్ని అత్యంత సరళంగా వివరించి చెబుతున్నారు. ఆసక్తి ఉన్న వాళ్లను, ముఖ్యంగా గృహిణులను హెల్త్ అడ్వయిజర్లుగా తీర్చిదిద్దుతున్నారు. ఆహ్వానం పలికిన కాలనీలకు వెళ్లి హెల్త్ అవేర్నెస్ క్యాంపులు నిర్వహిస్తున్నారు. ‘‘ఇంటింటా ఓ డాక్టర్’ ఉండాలి. ఆ డాక్టర్ మహిళ అయితే ఇంట్లో అందరి ఆరోగ్యాన్ని కాపాడుతుంది. తన బంధువులు స్నేహితులకు నిస్వార్థమైన వైద్యసేవలందిస్తుంది. గ్రామాల్లో వైద్య సహాయం అందని పరిస్థితులు ఇప్పటికీ ఉన్నాయి. నేను తయారు చేస్తున్న హెల్త్ అడ్వయిజర్ వ్యవస్థ ద్వారా ఆ లోటును భర్తీ చేయాలనేది నా ఆకాంక్ష’’ అన్నారు డాక్టర్ సరళ. ఆమె సాక్షితో మాట్లాడుతూ ‘‘నేను డాక్టర్ కావాలనే ఆలోచన నాది కాదు, మా అమ్మ కోరిక. నిఫ్ట్‌లో కోర్సు చేసి ఫ్యాషన్ డిజైనర్ కావాలనే నా ఆకాంక్ష నెరవేరలేదు. కానీ వైద్యరంగాన్ని సమాజానికి అవసరమైనట్లు రీ డిజైన్ చేస్తున్నా’’నని చె΄్పారు. ‘‘మాది కాకినాడ. నాన్న బిజినెస్ చేస్తారు. అమ్మ గవర్నమెంట్ ఉద్యోగంలో హెడ్ ఆఫ్ ది ఫార్మసీ డిపార్ట్మెంట్గా రిటైరయ్యారు. ఆడవాళ్లను చదువులో ్రపోత్సహించడం మా ఇంట్లోనే ఉంది. అమ్మకి పదవ తరగతి పూర్తయిన వెంటనే పెళ్లి చేశారు. మా నాన్నే అమ్మను చదివించారు. ఇక ముగ్గురు పిల్లల్లో నేను పెద్దదాన్ని కావడంతో అమ్మ కల నెరవేర్చే బాధ్యత నాదయింది. సాధారణంగా మెడిసిన్‌లో ఎంబీబీఎస్‌లో సీట్ రాని వాళ్లు హోమియో, ఆయుర్వేదం వంటి ఆల్టర్నేటివ్ మెడిసిన్ వైపు వెళ్తారనే అభి్రపాయం సమాజంలో స్థిరంగా ఉంది. కానీ హోమియో మీద ఇష్టంతో బీహెచ్ఎమ్ఎస్లో చేరాను. ఖాళీ సమయాల్లో కూడా మా ్ర΄÷ఫెసర్లకు సహాయం చేస్తూ సబ్జెక్టు లోతుగా తెలుసుకున్నాను. పెళ్లి అయి వైజాగ్ వెళ్లిన తర్వాత సీనియర్ దగ్గర ఏడాది పని చేయడం నన్ను పరిపూర్ణం చేసింది. ఈ రంగంలో సాధించే అనుభవం అంతా పేషెంట్‌తో ఎక్కువ సేపు మాట్లాడి, వ్యాధి లక్షణాలను, వారి జీవనశైలిని, మానసిక స్థితి గురించి వివరంగా అడిగి తెలుసుకోవడంతోపాటు ఎక్కువమందికి వైద్యం అందించడమే. అప్పుడే సొంతంగా ్రపాక్టీస్ పెట్టగలిగిన ధైర్యం వస్తుంది. హైదరాబాద్‌లో సొంతంగా క్లినిక్ తెరవడం... నన్ను సమాజం కోసం పని చేయాలనే ఆలోచనకు బీజం వేసింది. పేషెంట్ల వల్లనే తెలిసింది! నేనిప్పుడు ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్లో ప్యానల్ డాక్టర్‌గా సేవలందిస్తున్నాను. నెలకు కనీసం పదికి తక్కువ కాకుండా హెల్త్ అవేర్నెస్ ్రపోగ్రామ్స్ చేస్తున్నాను. హెల్త్ కేర్ అవేర్నెస్ ్రపోగ్రామ్ల అవసరం ఉందని గుర్తించడానికి కారణం నా దగ్గరకు వచ్చే పేషెంట్లే. డయాబెటిస్, హైపర్ టెన్షన్, స్ట్రోక్, క్యాన్సర్ వంటి దీర్ఘకాలిక వ్యాధుల చికిత్స కోసం నా దగ్గరకు వచ్చే చాలామందిలో అప్పటికే వ్యాధి తీవ్రత పెరిగిపోయి చికిత్సకు స్పందించని స్థితికి చేరి ఉండేది. అల్లోపతిలో వైద్యం చేయించుకుని ఆరోగ్యం మెరుగైన వాళ్లు సంతోషంగా జీవితాన్ని కొనసాగిస్తుంటారు. అక్కడ సాంత్వన లభించని వాళ్లు ఓ ప్రయత్నం అన్నట్లుగా హోమియో వంటి వైద్య ప్రక్రియల వైపు వస్తుంటారు. ఆల్టర్నేటివ్ మెడిసిన్ పట్ల అవగాహన లేకపోవడమే ఇందుకు కారణం. మూడు నెలల్లో పూర్తి స్థాయిలో చికిత్స చేయగలిగిన మందులు ఉండి కూడా చివరి దశ వరకు ఈ చికిత్సకు అందుబాటులోకి రాకపోవడం వల్ల ్రపాణాలు కోల్పోతున్న వాళ్లు ఎందరో. అలాంటి గ్యాప్‌కు 2015 నుంచి నేను బ్రిడ్జినవుతున్నాను. గతంలో కాలనీలకు వెళ్లి సమావేశాలు ఏర్పాటు చేయాల్సి వచ్చేది. సమావేశం ఉందనే సమాచారం కాలనీలో అందరికీ చేర్చడం కూడా ప్రయాసతో కూడి ఉండేది. ఇప్పుడు ఒక గేటెడ్ కమ్యూనిటీలో వందకు పైగా కుటుంబాలు నివసిస్తున్నాయి. ఆ కమ్యూనిటీ వాట్సాప్ గ్రూప్‌లో ఒక్క మెసేజ్ పెడితే సమాచారం అందరికీ చేరుతుంది. ఆసక్తి ఉన్నవాళ్లు హాజరవుతున్నారు. స్కూళ్లకు, కాలేజీలకు వెళ్లి మెన్స్ట్రువల్ హెల్త్, పీసీఓడీ వంటి సమస్యల మీద అవగాహన కల్పిస్తున్నాను. దీనికితోడుగా హెల్త్ అడ్వైజర్ అనే కాన్సెప్ట్‌కు కూడా శ్రీకారం చుట్టాను. వారం రోజుల శిక్షణ అనారోగ్యాల పట్ల జాగ్రత్తగా ఉండాలి, కానీ ప్రతి చిన్న ఆరోగ్య సమస్యకీ బెంబేలు పడిపోయి హాస్పిటళ్లకు పరుగులు తీయాల్సిన పని ఉండదు. సాధారణ జలుబు, దగ్గు వంటి వాటికి ఇంట్లోనే వైద్యం చేసుకోవచ్చు. మూడు రోజులు దాటినా తగ్గకపోతే డాక్టర్ దగ్గరకు వెళ్లమని చెబుతాం. మొదటి మూడు రోజుల వైద్యం అందించగలిగేటట్లు హెల్త్ అడ్వైజర్లను తయారు చేస్తున్నాను. రోజుకో గంటసేపు వారం రోజులపాటు ఉంటుంది ఈ కోర్సు. మందులు కూడా హెల్త్ అడ్వైజర్లు పేషెంట్ లక్షణాలను బట్టి సులువుగా ఇవ్వగలిగేటట్లు తయారు చేశాను. మనకు స్వాతంత్య్రం వచ్చి 76 ఏళ్లయినప్పటికీ దేశంలో ఇంకా డాక్టర్– పేషెంట్ల నిష్పత్తి సమతుల్యతలో పెద్ద అగాధమే ఉంది. వెయ్యి మంది పేషెంట్లకు ఒక డాక్టర్ అందుబాటులో ఉండాలనే సదుద్దేశం నెరవేరడం లేదు. పట్టణాల్లో అవసరానికి మించినంత మంది వైద్యులున్నారు, గ్రామాల్లో వైద్యం కరువవుతోంది. గృహిణులకు హెల్త్ అడ్వైజర్లుగా శిక్షణ ఇవ్వడం వల్ల ఆ లోటు కొంత భర్తీ అవుతోంది. వైద్యం అంటే... సామాన్యులకు అర్థం కాని చదువు కాదు, అత్యంత సులువుగా అర్థం చేసుకోగలిగిన శాస్త్రం అని నిరూపించడం, ప్రతి ఒక్కరికీ నాణ్యమైన వైద్యం అందించడమే నా లక్ష్యం. కోర్సులో భాగంగా నేర్చుకున్న వైద్యాన్ని నా వంతుగా కొంత విస్తరించి 76 అనారోగ్యాలకు మందులు కనుక్కున్నాను. వాటికి ఆయుష్ నుంచి నిర్ధారిత గుర్తింపు కూడా వచ్చింది’’ అని వైద్యరంగాన్ని సరళతరం చేయడంలో తన వంతు భాగస్వామ్యాన్ని వివరించారు డాక్టర్ సరళ. – వాకా మంజులారెడ్డి, సాక్షి ఫీచర్స్ ప్రతినిధి ఫొటోలు: అనిల్ కుమార్ మోర్ల -
చలికాలంలో ఇలా ఎందుకవుతుందంటే..? కారణం ఇదే!
'చలికాలం కీళ్లనొప్పులతో బాధపడేవారికి ఓ పీడకల. కీళ్లలో ఇన్ఫ్లమేషన్ వచ్చి నొప్పి కలిగించే ‘ఆర్థరైటిస్’ సమస్య చలికాలంలో పెచ్చుమీరడానికి కొన్ని ప్రత్యేకమైన పరిస్థితులు కారణాలవుతాయి. అవేమిటో, చలికాలంలో ఈ కీళ్లనొప్పుల నుంచి ఉపశమనం పొందడం ఎలా.. వంటి అనేక విషయాలపై అవగాహన కోసం ఈ కథనం.' చలికాలంలో ఆర్థరైటిస్‌తో బాధపడేవారి వెతలు మరింతగా పెరుగుతాయి. అందుకు కారణాలు ఈ కింది విధంగా ఉంటాయి. చలికాలంలో కీళ్లనొప్పులు పెరిగేదెందుకంటే.. మానవ శరీరంపై వాతావరణం ప్రభావం తప్పక ఉంటుంది. దేహంలో జరిగే చాలా జీవక్రియలు, రోగనిరోధక వ్యవస్థ వాతావరణంలోని తేడాలకు తగ్గట్లుగా మార్పులకు లోనవుతుంటాయి. దాంతో ఆర్థరైటిస్ కీళ్లనొప్పులతో బాధపడేవారి కండరాలు మరింతగా బిగుసుకుపోవడం, బాధలు పెరగడం జరుగుతాయి. వయసు పెరుగుతున్నకొద్దీ ఈ బాధలూ పెరుగుతాయి. ఇందుకు దోహదపడే అంశాలివి.. చలికాలంలో చేయి లేదా కాలి వేళ్లకు రక్తప్రసరణ కాస్త మందగిస్తుంది. ఇలా జరగడాన్ని వైద్యపరిభాషలో ‘రెనాడ్స్ ఫినామినా’ అంటారు. అప్పటికే ఆర్థరైటిస్‌తో బాధపడుతున్న వారిలో ఇది మరింత ఎక్కువ. ఇది మరింత తీవ్రతరం అయినప్పుడు కొందరిలో చేతివేళ్లు, కాలివేళ్లు కుళ్లిపోయే ప్రమాదమూ ఉంటుంది. ఇలా జరగడాన్ని ‘గ్యాంగ్రీన్’ అంటారు. ఆర్థరైటిస్ వల్ల లంగ్స్ ప్రభావితం అయినప్పుడు ఐఎల్‌డీ అనే జబ్బు వచ్చి, చలికాలంలో తీవ్రత మరింత పెరిగి బాధితుల్లో దగ్గు, ఆయాసం పెరుగుతాయి. మయోసైటిస్ అనే రకం కీళ్లవాతంతో బాధపడేవారిలో ఈ కాలంలో కండరాలకి రక్తప్రసరణ తగ్గడంతో వాటి కదలికలు మరింత తగ్గుతాయి. ఫలితంగా తగినంత వ్యాయామం సమకూరక.. వ్యాధి లక్షణాలు పెరిగి, ఇబ్బందికరంగా మారతాయి. అందుకే కీళ్లనొప్పులతో బాధపడుతుండేవారు చలికాలం వస్తుందంటేనే ఆందోళన చెందుతుంటారు. ఈ కాలంలో కీళ్ల నొప్పులు తగ్గాలంటే.. ఆర్థరైటిస్‌తో బాధపడుతున్నవారు కొన్ని చిన్న చిన్న సూచనలు పాటించడం ద్వారా చలికాలంలో పెరిగే తమ బాధలను చాలావరకు అధిగమించడం సాధ్యమే.. శరీరాన్ని వెచ్చగా ఉంచుకోవాలి. ఉన్ని దుస్తులు, కాళ్లకు సాక్స్, చేతులకు గ్లౌవ్స్ ధరించాలి. వెచ్చదనం వల్ల నొప్పిని కలిగించే రసాయనాల తొలగింపు ప్రక్రియ, వాటిని బయటకు పంపడం మరింత వేగవంతమవుతుంది. వెచ్చదనం కారణంగా రక్తప్రవాహమూ మెరుగుపడుతుంది. కండరాలు బిగుసుకు పోవడమూ తగ్గుతుంది. చలికాలంలో కండరాల కదలికలు ఇబ్బందికరంగా మారడం, నొప్పులు మరింత తీవ్రతరం కావడంతో బాధితులు తమ దేహ కదలికలను బాగా తగ్గిస్తారు. తగినంత వ్యాయామం సమకూరకపోవడంతో బాధలు మరింత పెరిగే అవకాశం ఉంటుంది. వీరు తమకు శ్రమ కలగని రీతిలో ఎంతోకొంత వ్యాయామం చేయాలి. చలికాలంలో సూర్యరశ్మి తక్కువ. ఫలితంగా ఒంట్లో విటమిన్–డి ఉత్పత్తి కూడా తగ్గుతుంది. ఈ కారణంగా వ్యాధి లక్షణాల పెరిగి, బాధలు మరింత పెచ్చరిల్లుతాయి. అప్పటికే ఆర్థరైటిస్‌తో బాధపడుతున్నవారు డాక్టర్లు నిర్ణయించిన మోతాదులో, వారు సూచించిన కాలానికి విటమిన్–డి సప్లిమెంట్లు తీసుకోవాలి. ఈ కాలం వైరస్, బ్యాక్టీరియాల మనుగడకు అనుకూలంగా ఉండటంతో అంటువ్యాధులు పెరిగే ప్రమాదం ఉంటుంది. కీళ్లవాతాల తీవ్రతా పెరగవచ్చు. కాబట్టి ఆర్థరైటిస్ రోగులు చలికాలం రాకముందే డాక్టర్లు సూచించిన వ్యాక్సిన్లు తీసుకోవాలి. అంటువ్యాధుల వల్ల వయోవృద్ధులకు ముప్పు ఎక్కువగా ఉంటుంది కాబట్టి వారు తప్పనిసరిగా వ్యాక్సిన్లు తీసుకోవాలి. చలికాలంలో నీళ్లు, ద్రవాహారాలు తక్కువగా తీసుకుంటూ ఉంటారు. ఒంట్లో ద్రవాలు తగ్గి, డీ–హైడ్రేషన్ ముప్పు పెరుగుతుంది. అందుకే ఈ కాలంలో అందరూ తగినన్ని నీళ్లు, ద్రవాహారాలు తీసుకుంటూ ఉండాలి. ఆర్థరైటిస్ కోసం వాడే మందుల్ని డాక్టర్ సలహా మేరకు క్రమం తప్పకుండా తీసుకుంటూ ఉండాలి. ఈ జాగ్రత్తల ద్వారా ఆర్థరైటిస్ బాధితులు చలికాలంలో ఎదుర్కొనే బాధలను చాలావరకు నివారించవచ్చు. ఇవి చదవండి: వింటర్లో సెల్యులైటిస్తో సమస్యా..? అయితే ఇలా చేయండి! -
ఏ ఆస్పత్రిలో.. చికిత్స ఖర్చులు ఎంత?
పోల్చి చూపే ఐసీఐసీఐ లంబార్డ్ హెల్త్ అడ్వైజర్ హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: బీమా సంస్థ ఐసీఐసీఐ లంబార్డ్ జనరల్ ఇన్సూరెన్స్ తాజాగా హెల్త్ అడ్వైజర్ ప్లాట్‌ఫామ్‌ను అందుబాటులోకి తెచ్చింది. సమీపంలోని ఆస్పత్రులు, చికిత్స నాణ్యత, మౌలిక సదుపాయాలు, వ్యయాలు తదితర వాటిని పోల్చి చూసుకునేందుకు ఇది తోడ్పడుతుంది. హైదరాబాద్, చెన్నైతో పాటు పది నగరాల్లోని సుమారు 1,000 పైగా ఆస్పత్రుల వివరాలు ఈ పోర్టల్‌లో అందుబాటులో ఉన్నాయని ఐసీఐసీఐ లంబార్డ్ హెడ్ (హెల్త్ అండర్‌రైటింగ్ అండ్ క్లెయిమ్స్ విభాగం) అమిత్ భండారీ బుధవారమిక్కడ వెల్లడించారు. హైదరాబాద్‌లో 140 ఆస్పత్రులు ఈ జాబితాలో ఉన్నాయని పేర్కొన్నారు.