Sarala
-
ఇంటింటా డాక్టర్
‘ప్రతి మనిషిలోనూ ఓ డాక్టర్ ఉంటారు. ప్రతి ఒక్కరిలో వైద్యం గురించి ్రపాథమిక అవగాహన ఉంటుంది’ అనే మౌలిక సూత్రాన్ని పట్టుకున్నారు డాక్టర్ సరళ. వైద్యరంగాన్ని అత్యంత సరళంగా వివరించి చెబుతున్నారు. ఆసక్తి ఉన్న వాళ్లను, ముఖ్యంగా గృహిణులను హెల్త్ అడ్వయిజర్లుగా తీర్చిదిద్దుతున్నారు. ఆహ్వానం పలికిన కాలనీలకు వెళ్లి హెల్త్ అవేర్నెస్ క్యాంపులు నిర్వహిస్తున్నారు. ‘‘ఇంటింటా ఓ డాక్టర్’ ఉండాలి. ఆ డాక్టర్ మహిళ అయితే ఇంట్లో అందరి ఆరోగ్యాన్ని కాపాడుతుంది. తన బంధువులు స్నేహితులకు నిస్వార్థమైన వైద్యసేవలందిస్తుంది. గ్రామాల్లో వైద్య సహాయం అందని పరిస్థితులు ఇప్పటికీ ఉన్నాయి. నేను తయారు చేస్తున్న హెల్త్ అడ్వయిజర్ వ్యవస్థ ద్వారా ఆ లోటును భర్తీ చేయాలనేది నా ఆకాంక్ష’’ అన్నారు డాక్టర్ సరళ. ఆమె సాక్షితో మాట్లాడుతూ ‘‘నేను డాక్టర్ కావాలనే ఆలోచన నాది కాదు, మా అమ్మ కోరిక. నిఫ్ట్‌లో కోర్సు చేసి ఫ్యాషన్ డిజైనర్ కావాలనే నా ఆకాంక్ష నెరవేరలేదు. కానీ వైద్యరంగాన్ని సమాజానికి అవసరమైనట్లు రీ డిజైన్ చేస్తున్నా’’నని చె΄్పారు. ‘‘మాది కాకినాడ. నాన్న బిజినెస్ చేస్తారు. అమ్మ గవర్నమెంట్ ఉద్యోగంలో హెడ్ ఆఫ్ ది ఫార్మసీ డిపార్ట్మెంట్గా రిటైరయ్యారు. ఆడవాళ్లను చదువులో ్రపోత్సహించడం మా ఇంట్లోనే ఉంది. అమ్మకి పదవ తరగతి పూర్తయిన వెంటనే పెళ్లి చేశారు. మా నాన్నే అమ్మను చదివించారు. ఇక ముగ్గురు పిల్లల్లో నేను పెద్దదాన్ని కావడంతో అమ్మ కల నెరవేర్చే బాధ్యత నాదయింది. సాధారణంగా మెడిసిన్‌లో ఎంబీబీఎస్‌లో సీట్ రాని వాళ్లు హోమియో, ఆయుర్వేదం వంటి ఆల్టర్నేటివ్ మెడిసిన్ వైపు వెళ్తారనే అభి్రపాయం సమాజంలో స్థిరంగా ఉంది. కానీ హోమియో మీద ఇష్టంతో బీహెచ్ఎమ్ఎస్లో చేరాను. ఖాళీ సమయాల్లో కూడా మా ్ర΄÷ఫెసర్లకు సహాయం చేస్తూ సబ్జెక్టు లోతుగా తెలుసుకున్నాను. పెళ్లి అయి వైజాగ్ వెళ్లిన తర్వాత సీనియర్ దగ్గర ఏడాది పని చేయడం నన్ను పరిపూర్ణం చేసింది. ఈ రంగంలో సాధించే అనుభవం అంతా పేషెంట్‌తో ఎక్కువ సేపు మాట్లాడి, వ్యాధి లక్షణాలను, వారి జీవనశైలిని, మానసిక స్థితి గురించి వివరంగా అడిగి తెలుసుకోవడంతోపాటు ఎక్కువమందికి వైద్యం అందించడమే. అప్పుడే సొంతంగా ్రపాక్టీస్ పెట్టగలిగిన ధైర్యం వస్తుంది. హైదరాబాద్‌లో సొంతంగా క్లినిక్ తెరవడం... నన్ను సమాజం కోసం పని చేయాలనే ఆలోచనకు బీజం వేసింది. పేషెంట్ల వల్లనే తెలిసింది! నేనిప్పుడు ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్లో ప్యానల్ డాక్టర్‌గా సేవలందిస్తున్నాను. నెలకు కనీసం పదికి తక్కువ కాకుండా హెల్త్ అవేర్నెస్ ్రపోగ్రామ్స్ చేస్తున్నాను. హెల్త్ కేర్ అవేర్నెస్ ్రపోగ్రామ్ల అవసరం ఉందని గుర్తించడానికి కారణం నా దగ్గరకు వచ్చే పేషెంట్లే. డయాబెటిస్, హైపర్ టెన్షన్, స్ట్రోక్, క్యాన్సర్ వంటి దీర్ఘకాలిక వ్యాధుల చికిత్స కోసం నా దగ్గరకు వచ్చే చాలామందిలో అప్పటికే వ్యాధి తీవ్రత పెరిగిపోయి చికిత్సకు స్పందించని స్థితికి చేరి ఉండేది. అల్లోపతిలో వైద్యం చేయించుకుని ఆరోగ్యం మెరుగైన వాళ్లు సంతోషంగా జీవితాన్ని కొనసాగిస్తుంటారు. అక్కడ సాంత్వన లభించని వాళ్లు ఓ ప్రయత్నం అన్నట్లుగా హోమియో వంటి వైద్య ప్రక్రియల వైపు వస్తుంటారు. ఆల్టర్నేటివ్ మెడిసిన్ పట్ల అవగాహన లేకపోవడమే ఇందుకు కారణం. మూడు నెలల్లో పూర్తి స్థాయిలో చికిత్స చేయగలిగిన మందులు ఉండి కూడా చివరి దశ వరకు ఈ చికిత్సకు అందుబాటులోకి రాకపోవడం వల్ల ్రపాణాలు కోల్పోతున్న వాళ్లు ఎందరో. అలాంటి గ్యాప్‌కు 2015 నుంచి నేను బ్రిడ్జినవుతున్నాను. గతంలో కాలనీలకు వెళ్లి సమావేశాలు ఏర్పాటు చేయాల్సి వచ్చేది. సమావేశం ఉందనే సమాచారం కాలనీలో అందరికీ చేర్చడం కూడా ప్రయాసతో కూడి ఉండేది. ఇప్పుడు ఒక గేటెడ్ కమ్యూనిటీలో వందకు పైగా కుటుంబాలు నివసిస్తున్నాయి. ఆ కమ్యూనిటీ వాట్సాప్ గ్రూప్‌లో ఒక్క మెసేజ్ పెడితే సమాచారం అందరికీ చేరుతుంది. ఆసక్తి ఉన్నవాళ్లు హాజరవుతున్నారు. స్కూళ్లకు, కాలేజీలకు వెళ్లి మెన్స్ట్రువల్ హెల్త్, పీసీఓడీ వంటి సమస్యల మీద అవగాహన కల్పిస్తున్నాను. దీనికితోడుగా హెల్త్ అడ్వైజర్ అనే కాన్సెప్ట్‌కు కూడా శ్రీకారం చుట్టాను. వారం రోజుల శిక్షణ అనారోగ్యాల పట్ల జాగ్రత్తగా ఉండాలి, కానీ ప్రతి చిన్న ఆరోగ్య సమస్యకీ బెంబేలు పడిపోయి హాస్పిటళ్లకు పరుగులు తీయాల్సిన పని ఉండదు. సాధారణ జలుబు, దగ్గు వంటి వాటికి ఇంట్లోనే వైద్యం చేసుకోవచ్చు. మూడు రోజులు దాటినా తగ్గకపోతే డాక్టర్ దగ్గరకు వెళ్లమని చెబుతాం. మొదటి మూడు రోజుల వైద్యం అందించగలిగేటట్లు హెల్త్ అడ్వైజర్లను తయారు చేస్తున్నాను. రోజుకో గంటసేపు వారం రోజులపాటు ఉంటుంది ఈ కోర్సు. మందులు కూడా హెల్త్ అడ్వైజర్లు పేషెంట్ లక్షణాలను బట్టి సులువుగా ఇవ్వగలిగేటట్లు తయారు చేశాను. మనకు స్వాతంత్య్రం వచ్చి 76 ఏళ్లయినప్పటికీ దేశంలో ఇంకా డాక్టర్– పేషెంట్ల నిష్పత్తి సమతుల్యతలో పెద్ద అగాధమే ఉంది. వెయ్యి మంది పేషెంట్లకు ఒక డాక్టర్ అందుబాటులో ఉండాలనే సదుద్దేశం నెరవేరడం లేదు. పట్టణాల్లో అవసరానికి మించినంత మంది వైద్యులున్నారు, గ్రామాల్లో వైద్యం కరువవుతోంది. గృహిణులకు హెల్త్ అడ్వైజర్లుగా శిక్షణ ఇవ్వడం వల్ల ఆ లోటు కొంత భర్తీ అవుతోంది. వైద్యం అంటే... సామాన్యులకు అర్థం కాని చదువు కాదు, అత్యంత సులువుగా అర్థం చేసుకోగలిగిన శాస్త్రం అని నిరూపించడం, ప్రతి ఒక్కరికీ నాణ్యమైన వైద్యం అందించడమే నా లక్ష్యం. కోర్సులో భాగంగా నేర్చుకున్న వైద్యాన్ని నా వంతుగా కొంత విస్తరించి 76 అనారోగ్యాలకు మందులు కనుక్కున్నాను. వాటికి ఆయుష్ నుంచి నిర్ధారిత గుర్తింపు కూడా వచ్చింది’’ అని వైద్యరంగాన్ని సరళతరం చేయడంలో తన వంతు భాగస్వామ్యాన్ని వివరించారు డాక్టర్ సరళ. – వాకా మంజులారెడ్డి, సాక్షి ఫీచర్స్ ప్రతినిధి ఫొటోలు: అనిల్ కుమార్ మోర్ల -
Swapna Sundari: నాట్యభూషణం
‘వాగ్గేయకార’ గుర్తింపు పొందిన ఏకైక మహిళ. పద్మభూషణ్ అందుకున్న నాట్యవిలాసిని. ఆమ్రపాలి రూపకల్పనకు ఢిల్లీ ప్రభుత్వ పురస్కారగ్రహీత. ఇంటర్నేషనల్ యూత్ ఫెస్టివల్లో ప్రదర్శనకారిణి. యంగ్ కల్చరల్ అంబాసిడర్‌గా భారత ప్రతినిధి. మూడు నాట్యరీతుల సాధన కర్త... నాట్యానికి స్వీయ గాత్ర సహకార ప్రత్యేకత. ఇన్నిటి సమ్మేళనం వక్కలంక స్వప్న సుందరి. ‘‘నా కళాప్రస్థానం గురించి చెప్పే ముందు మా అమ్మ గురించి చెప్పాలి. అమ్మమ్మ తరం వరకు మా గాత్రప్రతిభ ఇంటికే పరిమితం. అమ్మ వక్కలంక సరళ నేపథ్య గాయని. తెర ముందుకు రావడం మాత్రం నాతోనే మొదలు. అమ్మకు యామినీ కృష్ణమూర్తి నాట్యం ఇష్టం. నేను కడుపులో ఉండగానే అమ్మాయి పుడితే కళాకారిణిని చేయాలనుకుంది. తన మిత్రురాలైన బెంగాలీ గాయని గీతాదత్తో ‘బెంగాలీలో మంచి పేరు సూచించ’మని కూడా కోరిందట. గీతాదత్ సూచించిన పేర్లలో మా అమ్మమ్మ సుందరమ్మ పేరు అమరేటట్లున్న పేరు స్వప్న. అలా స్వప్నసుందరినయ్యాను. మా నాన్న ఆర్మీలో డాక్టర్. ఆ బదిలీల ప్రభావం నా మీద ఎలా పడిందంటే... మేము వెళ్లినచోట భరతనాట్యం గురువు ఉంటే భరతనాట్యం, కూచిపూడి గురువు ఉంటే కూచిపూడి... అలా సాగింది నాట్యసాధన. పదమూడేళ్లకు చెన్నైలో తొలి భరతనాట్య ప్రదర్శన, పద్నాలుగేళ్లకు ఢిల్లీలో కూచిపూడి ప్రదర్శన ఇచ్చాను. మూడవది నేను ఇష్టంగా సాధన చేసిన విలాసిని నాట్యం. రాజమండ్రి సమీపంలోని కోరుకొండ నరసింహస్వామి ఆలయంలో మా గురువు మద్దుల లక్ష్మీనారాయణమ్మ స్వయంగా తన గజ్జెలను నాకు కట్టి ఆరంగేట్రం చేయించారు. నేను మా సొంత ప్రదేశం కోనసీమను చూసింది కూడా అప్పుడే. మా ఇంటిపేరు, ఊరిపేరు ఒకటే. గోదావరి లంకల్లోని వక్కలంక. విలాసిని నాట్య తొలి ప్రదర్శన తర్వాత అనేక ప్రయోగాలు చేశాను. అంతరించి పోతున్న నాట్యరీతిని తర్వాతి తరాలకు అందుబాటులోకి తీసుకురావడానికి, ఆ నాట్యరీతి ప్రాచుర్యానికి నేను చేసిన ప్రయత్నాలను గుర్తించిన భారత ప్రభుత్వం పద్మభూషణ్‌తో సత్కరించింది. బీఏ ఆగిపోయింది! నేను స్కూల్ ఫైనల్లో ఉన్నప్పుడు మా అమ్మానాన్నలు నన్ను యామినీ కృష్ణమూర్తిగారి ప్రదర్శనకు తీసుకెళ్లారు. ఆమెను చూసిన తర్వాత నాట్యమే జీవితం అని నిర్ణయించుకున్నాను. ఇంట్లో మాత్రం ఎంతటి కళాకారిణివి అయినా చదువులేకపోతే ఎలాగ అన్నారు. రోజూ కాలేజ్కెళ్లాలంటే డాన్సు అవకాశాలు ఒకదాని మీద మరొకటి వస్తున్నాయి. టీనేజ్లోనే లండన్‌లోని క్వీన్ ఎలిజిబెత్ హాల్లో ప్రదర్శన ఇచ్చాను. ప్రైవేట్‌గా బీఏలో చేరాను, కానీ సెకండియర్‌లో మూడు నెలల యూరప్ టూర్‌తో నా బీఏ ఆగిపోయింది. నాట్యం నేర్చుకున్నాను, నాట్యమే చదువుకున్నాను. నాట్యంలో పీహెచ్డీ స్కాలర్స్‌కి ఎక్స్టర్నల్ ఎగ్జామినర్‌గా వెళ్తుంటాను. చిన్న వయసులో నాట్యంలో స్థిరపడితే ప్రొఫెషన్లో కనీసం 30 ఏళ్లయినా రాణించవచ్చని ఇంట్లో వాదించాను. నేను అనుకున్నట్లే నలభై ఐదేళ్లుగా నాట్యంలో రాణిస్తున్నాను. పాటల విషయానికి వస్తే... నాట్యంలో నేపథ్యంగా వినిపించే ట్రాక్ నేనే పాడుతాను. బాలమురళి అంకుల్‌తో ఆల్బమ్ చేశాను, తమిళ్ గజల్స్ పాడాను. అమ్మతో కలిసి పాడడం, అమ్మ పాడిన పాటలను ఆమెకు నివాళిగా పాడడం గొప్ప అనుభూతి. నాట్యజ్ఞానకేంద్రం దిల్లీలో స్థాపించిన డాన్స్ సెంటర్ ద్వారా నాట్యానికి సంబంధించిన జ్ఞానాన్ని పంచడంతోపాటు ప్రచారంలోకి తెస్తున్నాను. నాట్యం, సంగీతం, ఆధ్యాత్మికం ఒకదానితో ఒకటి మమేకమై ఉంటాయి. అన్నీ కలిపితేనే సంస్కృతి. అలా నేను సాంస్కృతిక వేత్తగా ఆవిష్కారమయ్యాను. నేడు హైదరాబాద్‌లో జరుగుతున్న ‘నైమిశం’ జిడ్డు కృష్ణమూర్తి ‘సెంటర్ ఫర్ కల్చరల్ రీసోర్సెస్ అండ్ ట్రైనింగ్’ కోసం సాంస్కృతిక కార్యక్రమాల రూపకల్పన ప్రారంభించాను. కళాసాధనకు, కళాసేవకు... శిఖరాన్ని చేరడం, ప్రయాణం పూర్తవడం అనేది ఉండదు. పరిపూర్ణతను, కొత్త రూపునూ సంతరించుకుంటూ... కళాకారులకు, కళాభిమానులకు సాంత్వననిస్తూ కొత్త పుంతలు తొక్కుతూ సాగుతూనే ఉంటుంది’’ అన్నారు స్వప్నసుందరి. ప్రభుత్వం ఆమె నాట్యప్రతిభను పద్మభూషణ్‌తో గౌరవించింది. నిజానికి ఆమె నాట్యానికే భూషణం. కళల కలయిక ‘కూచిపూడి’ భాగవతం, యక్షగానం, నాటకం, పగటివేషం వంటి ప్రాచీన కళారూపాల నుంచి ఒక్కో ప్రత్యేకతను మమేకం చేస్తూ రూపొందిన నాట్యప్రక్రియనే మనం కూచిపూడి అని పిలుస్తున్నాం. నిజానికి కూచిపూడి అనే పేరు రావడానికి కారకులు గోల్కొండ పాలకుడు తానీషా. ఆ నాట్యకళాకారుల స్థిరనివాసం కోసం కూచిపూడి అగ్రహారాన్ని ఇచ్చారాయన. కూచిపూడి గ్రామంలోని నాట్యకారుల నాట్యరీతి కూడా ఆ ఊరిపేరుతోనే వ్యవహారంలోకి వచ్చింది. సిద్ధేంద్రయోగికంటే ముందు రెండు వందల సంవత్సరాల నుంచి వచ్చిన పరిణామక్రమాన్ని నేను నా తొలి రచన ‘ద వరల్డ్ ఆఫ్ కూచిపూడి డాన్స్’లో రాశాను. తెలుగు విలాసిని... విలాసిని నాట్యం మన తెలుగు వారి భారతం. భారతం అంటే మహాభారతం కాదు. భారతం– భాగవతం అని మన ప్రాచీన కళారూపాలు ఈ రెండూ. భారతం శాస్త్రీయంగా ఉంటే భాగవతం సామాన్యులకు అర్థమయ్యేటట్లు సరళంగా ఉండేది. భారతం సోలో డాన్స్, భాగవతం బృంద ప్రదర్శన. లాలిత్యం, సొగసుతో కూడిన ఈ తెలుగు నాట్యరీతిని రాజాస్థానాల్లో రాజదాసీలు, ఆలయాల్లో దేవదాసీలు ప్రదర్శించేవారు. రాజాస్థానాలు పోవడం, కొన్ని సామాజిక దురన్యాయాలను అడ్డుకునే క్రమంలో ఆలయాల్లో నాట్యాలను నిషేధిస్తూ చట్టం వచ్చిన తర్వాత ఆ నాట్యసాధన దాదాపుగా అంతరించి పోయే దశకు చేరుకుంది. ఆ సమయంలో నేను ఈ నాట్యం నేర్చుకుని, అందులో ప్రయోగాలు, విస్తరణ కోసం పని చేస్తున్నాను. నేను విలాసిని మీద పుస్తకం రాసే నాటికి ఆ నాట్యరీతికి తెలుగుభారతం అనే ప్రాచీన నామమే ఉంది. నిష్ణాతులైన కవులు, కళాకారులు, చరిత్రకారులు సంయుక్తంగా చర్చించిన తర్వాత ‘విలాసిని’ అనే పేరు ఖరారు చేశాం. – వక్కలంక స్వప్న సుందరి, సాంస్కృతికవేత్త – వాకా మంజులారెడ్డి ఫొటోలు : నోముల రాజేశ్ రెడ్డి -
విరాట పర్వం: 30 ఏళ్ల కిందట పేలిన తూటా.. శంకరన్న చేతిలో సరళ బలి
ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఒకప్పుడు మావోయిస్టుల ఖిల్లా. అడుగడుగునా అన్నలు కలియతిరిగిన ప్రాంతం. అడవులన్నీ ఉద్యమపాటలతో ఉర్రూతలూగగా ఆకర్షితులైన యువత మన్యంబాట పట్టేది. ఆ సమయంలో జిల్లాలో తూర్పు.. పశ్చిమ డివిజన్లు ఉండేవి. ఈ రెండు ప్రాంతాలు కేంద్రంగా మావోలు కార్యకలాపాలు కొనసాగించేవారు. కరీంనగర్– నిజామాబాద్ జిల్లాల సరిహద్దులను మావోయిస్టు పార్టీ పశ్చిమ డివిజన్‌గా పరిగణించేది. ఆ పశ్చిమ అడవుల్లో 30 ఏళ్ల కిందట జరిగిన ఘటన ఆధారంగా ఇటీవల ‘విరాట పర్వం’ సినిమా వచ్చింది. సరళ అనే అమ్మాయి నిజజీవితంలో జరిగిన సంఘటనల ఆధారంగా ఆ సినిమాను తెరకెక్కించినా.. రాజన్నసిరిసిల్ల జిల్లాతో సరళ ఘటనకు ముడిపడి ఉంది. నిజామాబాద్ జిల్లా డిచ్పల్లి మండలం సిర్నాపల్లి అడవుల్లో సరళను 1992 జూలైలో హత్య చేశారు. సరళను చంపిన శంకరన్న అలియాస్ దొంతు మార్కండేయ రాజన్న సిరిసిల్ల జిల్లాలోని ఎల్లారెడ్డిపేటవాసి. శంకరన్న అప్పటి పీపుల్స్‌వార్‌లో ఉత్తర తెలంగాణ కార్యదర్శిగా ఉన్నారు. ఆ రోజు ఏం జరిగిందనేదానిపై కథనం.. సిరిసిల్ల: కరీంనగర్–నిజామాబాద్ జిల్లాల సరిహద్దులను మావోయిస్టు పార్టీ పశ్చిమ డివిజన్‌గా పరిగణిస్తోంది. ఆ పశ్చిమ అడవుల్లో 30 ఏళ్ల కిందట జరిగిన ఘటన ఆధారంగా ఇటీవల ‘విరాట పర్వం’ సినిమా వచ్చింది. సరళ అనే అమ్మాయి నిజజీవితంలో జరిగిన సంఘటనల ఆధారంగా సినిమాను తెరకెక్కించినా.. రాజన్న సిరిసిల్ల జిల్లాతో సరళ ఘటనకు ముడిపడి ఉంది. నిజామాబాద్ జిల్లా డిచ్పల్లి మండలం సిర్నాపల్లి అడవుల్లో సరళను 1992 జూలైలో హత్య చేశారు. సరళను చంపిన శంకరన్న అలియాస్ దొంతు మార్కండేయ రాజన్న సిరిసిల్ల జిల్లాలోని ఎల్లారెడ్డిపేటవాసి. శంకరన్న అప్పటి పీపుల్స్‌వార్‌లో ఉత్తర తెలంగాణ కార్యదర్శిగా ఉన్నారు. ఆ రోజు ఏం జరిగింది..? ► ఖమ్మం జిల్లాకు చెందిన తూము సరళ ఇల్లు వదిలి సిర్నాపల్లి అటవీ ప్రాంతానికి చేరింది. వాస్తవానికి అప్పటికే శంకరన్న భార్య జ్యోతి ఎన్కౌంటర్లో మరణించింది. ► ఆ వార్తను పత్రికల్లో చూసిన సరళ, శంకరన్నను కలిసేందుకు ఇల్లు వీడి నిజామాబాద్ జిల్లా సిర్నాపల్లి ప్రాంతానికి చేరింది. ► అటవీ ప్రాంతంలోని డొంకల్, గన్నారం, సిర్నాపల్లి గ్రామాల్లో ఉంటూ.. పార్టీలో చేరాలని, శంకరన్నను కలవాలని ప్రయత్నించింది. ► ఈక్రమంలోనే డొంకల్ అటవీ ప్రాంతంలో పార్టీ జిల్లా కమిటీ సమావేశం జరుగుతుండగా.. సరళను పిలిచి విచారించారు. ► శంకరన్నతోపాటు హరిభూషణ్, కుమార్ దళాలు ఉన్నాయి. సరళను పోలీస్ ఇన్ఫార్మర్గా భావించి, కోవర్టుకు పాల్పడుతోందనే భయంతో ఆమెను విచారించారు. ► సరళ ఎంత కొట్టినా.. తాను పార్టీలో చేరేందుకు వచ్చానని పదే పదే చెప్పినట్లు సమాచారం. ► చివరకు శంకరన్న, సరళను భయపెట్టేందుకు ఫైర్ చేయగా.. అది పొరపాటున సరళకు తగిలి మరణించినట్లు అప్పట్లో పార్టీలో పనిచేసి లొంగిపోయిన మాజీ దళ నేత కుమార్ వెల్లడించారు. అలా సరళ సిర్నాపల్లి అడవుల్లో శవమైంది. సిరిసిల్ల జిల్లాలో గోడలపై సిర్నాపల్లి రాతలు రాజన్న సిరిసిల్ల జిల్లా అటవీ ప్రాంతాల్లోని పల్లెల్లో గోడలపై సరళ ఉదంతాన్ని ఉటంకిస్తూ పీపుల్స్‌వార్‌కు వ్యతిరేకంగా అప్పటి జనశక్తి పార్టీ వాల్ రైటింగ్స్ చేసింది. పీపుల్స్‌వార్ నేత శంకరన్న చేసిన ఘాతుకం అంటూ ప్రచారం చేసింది. నిజానికి సరళ తల్లిదండ్రులు సరోజ, భిక్షమయ్య.. సీపీఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీ పార్టీ మద్దతుదారులు కావడంతో జనశక్తి పార్టీ ఈ ఘటనపై వ్యతిరేకంగా ప్రచారం చేసింది. సరళ మృతదేహాన్ని కూడా వారి తల్లిదండ్రులకు ఇవ్వలేదని, అడవుల్లోనే కాల్చివేశారంటూ తీవ్రస్థాయిలో ఖండించారు. పొరపాటును గుర్తించిన శంకరన్న సిర్నాపల్లి అడవుల్లో జరిగిన సరళ ఘటనపై పీపుల్స్‌వార్ పార్టీలో తీవ్రస్థాయిలో చర్చసాగింది. ఆ అమ్మాయిని ఇంటికి పంపించే క్రమంలోనే మిస్ ఫైర్ కారణంగా మరణించిందని శంకరన్న స్పష్టం చేశారు. పార్టీ సమావేశంలో శంకరన్న ఆత్మవిమర్శ చేసుకుని పొరపాటును ఒప్పుకున్నట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. 1993 జనవరి 27న నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని హౌసింగ్‌బోర్డులో శంకరన్న ఎన్కౌంటర్లో మరణించాడు. ఎల్లారెడ్డిపేటకు చెందిన మార్కండేయ పీపుల్స్‌వార్‌లో చేరి ఉత్తర తెలంగాణ కార్యదర్శిగా ఎదిగారు. ఆయన అనేక ఎన్కౌంటర్లలో తప్పించుకున్నారు. చివరికి సరళ ఘటన ఆయన్ని మానసికంగా బాధించిందని పార్టీ వర్గాలు వెల్లడించాయి. మొత్తంగా విరాటపర్వంలో సిరిసిల్ల అధ్యాయంపై ఆసక్తికర చర్చ సాగుతోంది. -
'విరాట పర్వం'పై సరళ అన్నయ్య ఆసక్తికర వ్యాఖ్యలు..
Tumu Mohan Rao Comments On Virata Parvam In Success Meet: రానా దగ్గుబాటి, టాలెంటెడ్ హీరోయిన్ సాయిపల్లవి జంటగా నటించిన చిత్రం విరాట పర్వం. 1990లో సరళ అనే అమ్మాయి నిజ జీవితంలో జరిగిన యదార్థ సంఘటనల ఆధారంగా ఈ చిత్రాన్ని వేణు ఊడుగుల తెరకెక్కించారు. ఈ సినిమా జూన్ 17న ప్రపంచవ్యాప్తంగా విడుదలై బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది. హౌస్ ఫుల్ కలెక్షన్స్‌తో అన్ని వర్గాల ప్రేక్షకుల నుంచి భారీ ఆదరణ లభిస్తోంది. ఈ నేపథ్యంలో చిత్ర బృందం మీడియా సమావేశం నిర్వహించింది. ఈ మీడియా సమావేశంలో చిత్ర బృందంతో పాటు.. సరళ అన్నయ్య తూము మోహన్ రావు కూడా పాల్గొన్నారు. ''సురేష్ ప్రొడక్షన్ లో తొలిసారి యదార్థ సంఘటనల ద్వారా తెరకెక్కిన చిత్రం విరాటపర్వం. దర్శకుడు వేణు కథని అద్భుతంగా చెప్పారు. సాయి పల్లవి గొప్పగా నటిచింది. విరాట పర్వం విజయం ఆనందాన్ని ఇచ్చింది. మేము కూడా ఒక మంచి బయోపిక్ చేశామనే తృప్తిని ఇచ్చింది. సరళ జీవితాన్ని సినిమాగా తీసుకునే అవకాశం ఇచ్చిన వారి కుటుంబ సభ్యులకు కృతజ్ఞతలు. ఇది స్వచ్ఛమైన ప్రేమకథ. సాయి పల్లవి, రానా, మిగతా నటీనటులు అందరూ గొప్పగా చేశారు. విరాటపర్వం గురించి అందరూ పాజిటివ్ గా చెబుతున్నారు. రానాకి ఈ సినిమా ఎందుకు చేస్తున్నావ్ ? అని అడిగితే 'ఇలాంటి కథ నేను చేయకపోతే ఎవరు చేస్తారని' చెప్పారు. కళాత్మక చిత్రాలకు ప్రేక్షకులు ఎప్పుడూ ఎక్కువ మార్కులు వేస్తూనే ఉంటారు. విరాటపర్వం టీం అంతటికి కంగ్రాట్స్'' అని నిర్మాత సురేష్ బాబు తెలిపారు. సాయి పల్లవి మాట్లాడుతూ.. ''మోహన్ రావుకి ధన్యవాదాలు. వారి ఇంటికి వెళ్లి కలసినపుడు నన్ను ఆశీర్వదించి చీర బొట్టు పెట్టి దీవించారు. సరళ గారి కుటుంబాన్ని చూసిన తర్వాత గుండె బరువెక్కింది. కన్నీళ్లు వచ్చాయి. గొప్ప మనసున్న వాళ్లు మళ్లీ పుడతారు. వాళ్లు ఏం అనుకున్నారో ఇంకో మార్గంలో సాధించుకుంటారని చెప్పా. ఈ రోజు మోహన్ రావు ఇక్కడి వచ్చి సినిమా విజయాన్ని ప్రేక్షకులతో పంచుకోవడం ఆనందంగా ఉంది. సురేష్ బాబు ఒక ఎన్సైక్లోపీడియా. ఆయన దగ్గర చాలా నేర్చుకున్నా. వెన్నెల పాత్ర పోషించినందుకు చాలా గర్వంగా ఫీలౌతున్నా. ప్రేక్షకులు సినిమాని మళ్లీ మళ్లీ చూస్తున్నామని, చూసిన ప్రతీ సారి ఇంకా గొప్పగా అనిపిస్తుందని చెప్పడం ఆనందంగా ఉంది. సినిమాను ఆదరించిన ప్రేక్షకులందరికీ కృతజ్ఞతలు.'' అన్నారు. చిత్రానికి అన్ని ప్రాంతాలు, వర్గాల ప్రేక్షకుల నుంచి యునానిమస్ గా బిగ్ హిట్ టాక్ వచ్చింది. పాజిటివ్ రివ్యూస్ వచ్చాయి. ఈ ప్రాజెక్ట్ విజయవంతం కావడానికి కారణమైన నిర్మాతలు రానా, సుధాకర్ చెరుకూరి, శ్రీకాంత్, ఒక గాడ్ ఫాదర్ గా మా అందరినీ వెనుకుండి నడిపించిన సురేష్ బాబుకు కృతజ్ఞతలు. సాయి పల్లవి లేకపోతే ఈ కథ ఉండేది కాదు. ఆమెకు కృతజ్ఞతలు. సంగీత దర్శకుడు సురేష్ బొబ్బిలి అద్భుతమైన సంగీతం అందించారు. ఎమోషనల్ గా మరో స్థాయికి తీసుకెళ్లారు. 1990 వాతావరణాన్ని క్రియేట్ చేయడంలో అద్భుత ప్రతిభ కనబరిచిన ఆర్ట్ డైరెక్టర్ నాగేంద్రకు థాంక్స్. అద్భుతమైన విజువల్స్ ఇచ్చిన డానీ, దివాకర్ మణికి కృతజ్ఞతలు. మిగతా నటీనటులు, సాంకేతిక నిపుణులందరికీ కృతజ్ఞతలు. సరళ అనే అమ్మాయి జీవితంలో జరిగిన యాదార్థ సంఘటనల ఆధారంగా తీసిన చిత్రమిది. సరళ గారి అన్నయ్య తూము మోహన్ రావు గారు ఈ ప్రెస్ మీట్ రావడం కూడా ఆనందంగా ఉంది. విరాట పర్వం చిత్రాన్ని ఇంత పెద్ద విజయం చేసిన ప్రేక్షకులకు కృతజ్ఞతలు. ఇలాంటి మీనింగ్ ఫుల్ సినిమాలు మౌత్ టాక్ ద్వారానే పబ్లిక్ లోకి వెళతాయి. ఇలాంటి మీనింగ్ ఫుల్ సినిమాని అందరూ ఆదరించాలని ప్రేక్షకులని, మీడియాని కోరుకుంటున్నాను. ఇలాంటి అర్థవంతమైన సినిమాలని నిలబెడితే మరిన్ని మంచి చిత్రాలు వస్తాయి'' అని డైరెక్టర్ వేణు ఊడుగుల పేర్కొన్నారు. తూము మోహన్ రావు మాట్లాడుతూ.. ''30ఏళ్ల క్రితం జరిగిన సంఘటన ఇది. సురేష్ ప్రొడక్షన్ లాంటి పెద్ద నిర్మాణ సంస్థ ఆ సంఘటనని ఇంత గొప్ప చిత్రంగా నిర్మిస్తుందని ఊహించలేదు. వేణు ఊడుగుల కొన్ని నెలలు క్రితం నన్ను కలిశారు. ఈ సినిమా గురించి చెప్పారు. ఎలా చూపిస్తారో అనే భయం ఉండింది. కానీ వేణు గారు చెప్పిన తర్వాత కన్విన్సింగ్ గా అనిపించింది. రానా, సాయి పల్లవి పేరు చెప్పిన తర్వాత చాలా ఆనందంగా అనిపించింది. ప్రివ్యూకి రమ్మని చాలా సార్లు అడిగారు. అయితే ఈ సినిమాని ప్రేక్షకుడిగానే అందరితో కలసి చూడాలనుందని చెప్పా. సినిమా చూసిన తర్వాత మేము ఏం అనుకుంటున్నామో అదే తీశారు. కథ విషయానికి వస్తే.. మా ఇంట్లో కమ్యునిస్ట్ వాతావరణం వుంది. మా చెల్లి విప్లవాన్ని ప్రేమించింది. తను స్టూడెంట్ ఆర్గనై జేషన్ లోకి వెళ్లడం మేము వారించడం జరిగేది. కానీ తను నక్సల్ లోకి వెళ్లిపోతుందని మేము అనుకోలేదు. దాన్ని ప్రేమించి, ఇష్టంతో వెళ్లింది. సినిమాలో రవన్న రచనలకు ప్రభావతమై వెళ్లినట్లు చూపించారు. రెండూ ఒక్కటే. ఆమె విప్లవాన్ని ప్రేమించింది. విప్లవం వల్లే చనిపోయింది. ఇందులో ఎవరినీ తప్పుపట్టడం లేదు. మా కుటుంబం అంతా కలసి సినిమా చూశాం. ఈ చిత్రానికి సంగీత దర్శకుడు ఎవరు అని నా భార్య అడిగింది. ఎప్పుడూ వినని మ్యూజిక్ విరాటపర్వంలో వినిపించిదని చెప్పింది. సంగీత దర్శకుడు సురేష్ బొబ్బిలికి కంగ్రాట్స్. మాకు తెలిసిన కథలో శంకరన్న పాత్ర నెగిటివ్. తన వల్ల చనిపోయింది కాబట్టి కోపం ఉండేది. కానీ రానా, సాయి పల్లవిని దర్శకుడు చూపించిన విధానం అద్భుతంగా ఉంది. సురేష్ ప్రొడక్షన్ లాంటి బ్యానర్లో ఇలాంటి కథని తీసుకొని ఒక ప్రయోగం చేయడమనేది చాలా గొప్ప విషయం. వారికి అభినందనలు. రానా ప్రీరిలీజ్ ఈవెంట్ లో మాట్లాడుతూ.. ప్రయోగాలు ఇక చేయనని చెప్పారు. కానీ రానా గారే ఇలాంటి ప్రయోగాలు చేయగలరు. మంచి కథ దొరికితే ఆయన ప్రయోగాలు చేయాలని కోరుకుంటున్నాను. సురేష్ ప్రొడక్షన్ లో ఇలాంటి డిఫరెంట్ మూవీ మరొకటి రావాలని కోరుకుంటున్నాను'' అన్నారు. సంగీత దర్శకుడు సురేష్ బొబ్బిలి మాట్లాడుతూ.. ''నాలో ప్రతిభని గుర్తించి సీనియారిటీ లెక్కలు వేసుకోకుండా ఈ చిత్రానికి అవకాశం కల్పించిన రానాకు కృతజ్ఞతలు. సురేష్ బాబు మా అందరికీ ఒక పెద్ద దిక్కులా ఉన్నారు. నిర్మాతలు సుధాకర్ చెరుకూరి, శ్రీకాంత్, దర్శకుడు వేణు ఊడుగులకు థాంక్స్. ఈ సినిమాని ఇంకా ప్రజల్లోకి తీసుకెళ్లాలి'' అని కొరుకున్నారు. ప్రేక్షకుల నుంచి వస్తున్న స్పందన చూస్తుంటే ఒక గొప్ప సినిమా చేసాం అనే భావన కలిగింది. ఈ సినిమాకి పని చేసే అవకాశం ఇచ్చిన దర్శకుడు వేణు, నిర్మాతలు సురేష్ బాబు, సుధాకర్ చెరుకూరి, శ్రీకాంత్‌కు కృతజ్ఞతలు. సాయి పల్లవి, రానా గారు అద్భుతంగా చేశారు. చిత్రాన్ని ఇంత పెద్ద విజయం చేసిన ప్రేక్షకులకు కృతజ్ఞతలు.'' అని ఆర్ట్ డైరెక్టర్ నాగేంద్ర తెలిపారు. చదవండి: తెలుగు అబ్బాయిని పెళ్లి చేసుకునేలా ఉన్నావని నాన్న అన్నారు: సాయి పల్లవి -
‘కరకట్ట పునర్నిర్మాణ పనులు చేపడతాం’
సాక్షి, వనపర్తి: జిల్లాలోని మదనాపురం మండలంలో ఉన్న సారళాసాగర్ ప్రాజెక్టుకు వరద నీటి ఉధృతి పెరగడంతో మంగళవారం గండిపడింది. ఈ విషయాన్ని తెలుసుకున్న వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి ప్రాజెక్టును సందర్శించారు. ఈ క్రమంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. సరళాసాగర్ కరకట్టకు గండిపడటంపై సాంకేతిక నిపుణులతో విచారణ చేయిస్తామని ఆయన తెలిపారు. కరకట్టకు గండిపడటం వల్ల ఎలాంటి ఆస్తి, ప్రాణనష్టం జరగలేదని ఆయన పేర్కొన్నారు. రబీలో సాగుకు సన్నద్దమైన రైతులకు ఎటువంటి ఇబ్బందులు కలుగకుండా చర్యలు తీసుకుంటామని మంత్రి నిరంజన్‌రెడ్డి తెలిపారు. 4, 200 ఎకరాలకు నీరందిస్తామని.. ప్రాజెక్టు పునర్నిర్మాణ పనులు వెంటనే చేపడతామని ఆయన పేర్కొన్నారు. చదవండి: సరళాసాగర్ ప్రాజెక్టుకు భారీ గండి -
సరళాసాగర్ ప్రాజెక్టుకు భారీ గండి
సాక్షి, వనపర్తి: జిల్లాలోని మదనాపురం మండలం సమీపంలో ఉన్న సరళాసాగర్ ప్రాజెక్టుకు వదర నీరు పోటెత్తటంతో మంగళవారం గండిపడింది. దీంతో కరకట్ట తెగి నీరు వృధాగా పోయింది. కరకట్ట తెగడంతో వరద నీరు రోడ్డు మీదికి చేరింది. దీంతో కొత్తకోట-ఆత్మకూరు మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. పదేళ్ల తర్వాత సరళాసాగర్ ప్రాజెక్టుకు భారీగా వదర నీరు చేరింది. సరళాసాగర్ ప్రాజెక్టు ఆసియాలోనే మొట్టమొదటి సైఫన్ సిస్టమ్ ప్రాజెక్టుగా గుర్తింపు పొందింది. విషయం తెలుసుకున్న వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి ప్రాజెక్టును సందర్శించి కొట్టుకుపోయిన ప్రాజెక్టు గండిని పూడ్చేందుకు తక్షణ చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. -
సరళాసాగర్ ప్రాజెక్ట్ కరకట్టకు గండి
-
భార్యను బలిగొన్న ధనపిశాచి
గుంతకల్లు టౌన్: పట్టణంలోని బెంచికొట్టాలకు చెందిన సరళ (33)అనే వివాహిత భర్త అబ్రహాం లింకన్ చేతిలో హత్యకు గురైందని ఒన్‌టౌన్ సీఐ ఉమామహేశ్వరరెడ్డి తెలిపారు. అదనపు కట్నం తేలేదనే సరళను భర్తే గొంతునులిమి చంపాడని చెప్పారు. సీఐ తెలిపిన వివరాలిలా ఉన్నాయి. కర్ణాటక రాష్ట్రం భద్రావతికి చెందిన సరళకు బెంచికొట్టాలకు చెందిన ఎలక్ట్రీషియన్ అబ్రహాంతో పదేళ్ల కిందట పెళ్లయింది. వీరికి ఇద్దరు పిల్లలున్నారు. అనారోగ్యంతో బాధపడుతున్న అబ్రహాం పనికి వెళ్లకుండా పుట్టింటికెళ్లి డబ్బులు తీసుకురావాలని భార్యను నిత్యం వేధించేవాడు. శనివారం మధ్యాహ్నం కూడా ఇదే విషయమై గొడవ కాగా నిందితుడు ఆమెను గొంతు పిసికి చంపేశాడు. అయితే ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుందని భర్త నాటకమాడాడు. హత్య కేసు నమోదు సరళను చంపి ఆత్మహత్యగా చిత్రీకరించే ప్రయత్నం చేశారని ఆమె కుటుంబసభ్యులు ఆరోపించారు. తాము వచ్చే వరకు సరళ మృతదేహాన్ని పోస్టుమార్టమ్ తరలించవద్దని పోలీసులకు ఫోన్ చేసి చెప్పారు. మృతురాలి తల్లి సుబ్బమ్మ ఫిర్యాదు మేరకు అబ్రహాంపై హత్యకేసు నమోదు చేసినట్లు సీఐ వెల్లడించారు. ఆదివారం సరళ మృతదేహాన్ని పోస్టుమార్టమ్ నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. -
ఎమ్మెల్యే కోటంరెడ్డి అరెస్ట్
నెల్లూరు(సెంట్రల్)/సాక్షి, అమరావతి: తన ఇంటిపై దాడి చేశారని శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా వెంకటాచలం ఎంపీడీఓ సరళ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన నెల్లూరు రూరల్ పోలీసులు ఆదివారం ఉదయం ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డిని అరెస్టు చేశారు. ప్రభుత్వ వైద్యశాలకు తరలించి, వైద్య పరీక్షలు నిర్వహించి, రూరల్ పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లారు. ఇదే కేసులో ఎమ్మెల్యేతో పాటు వైఎస్సార్సీపీ నేత బిరదవోలు శ్రీకాంత్‌రెడ్డిని కూడా అరెస్టు చేశారు. ఎమ్మెల్యేను, శ్రీకాంత్‌రెడ్డిని న్యాయమూర్తి ఎదుట హాజరుపరచగా, బెయిల్ మంజూరు చేశారు. దౌర్జన్యం చేశానని నిరూపిస్తే క్షమాపణ చెబుతా.. తాను ఏ తప్పూ చేయలేదని ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి అన్నారు. న్యాయమూర్తి బెయిల్ మంజూరు చేసిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ఎంపీడీఓ సరళ ఇంటిపై తాను దాడి చేశాననడం అవాస్తవం అని చెప్పారు. సరళ తనకు సోదరితో సమానమని పేర్కొన్నారు. ఆమె తల్లి తనకు తల్లితో సమానమన్నారు. తన సన్నిహితుడికి సంబంధించిన లేఔట్ విషయంలో మంచినీటి కుళాయి ఇవ్వాలని గతంలో అడిగాను తప్ప ఏనాడూ ఆమెను తిట్టడం గానీ, ఆమె ఇంటికి వెళ్లి దౌర్జన్యం చేయడం గానీ చేయలేదన్నారు. ప్రభుత్వం నిజనిర్ధారణ కమిటీ వేసి, విచారణ జరిపించి, బాధ్యులపై చర్యలు తీసుకోవచ్చని చెప్పారు. తాను ఎంపీడీఓ విషయంలో తప్పు చేసి ఉంటే తనను పార్టీ నుంచి షోకాజ్ నోటీసు ఇవ్వకుండా బహిష్కరించవచ్చని అన్నారు. తాను ఎంపీడీఓ ఇంటికి వెళ్లి దౌర్జన్యం చేశానని నిరూపిస్తే సరళకు క్షమాపణ చెప్పడంతో పాటు, ఆమె తల్లికి కూడా క్షమాపణ చెబుతానన్నారు. నెల్లూరు ఎస్పీ పక్షపాతంగా అర్ధరాత్రులు వచ్చి, తన ఇంటి వద్ద హడావుడి చేసి అరెస్టు చేశారని శ్రీధర్‌రెడ్డి ఆక్షేపించారు. గతంలో టీడీపీ ప్రభుత్వ హయాంలో ఉద్యోగులపై దాడులు జరిగినా బాధ్యులపై చర్యలు తీసుకోలేదని గుర్తుచేశారు. ఇప్పుడు ఉద్యోగులకు ఎలాంటి ఇబ్బంది వచ్చినా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తక్షణమే స్పందించడం అభినందనీయమని అన్నారు. ముఖ్యమంత్రి నిర్ణయాన్ని స్వాగతిస్తున్నానని వ్యాఖ్యానించారు. ప్రభుత్వంపై నమ్మకం పెరిగింది: ఎంపీడీఓ సరళ తన ఇంటిపై దాడి జరిగిన ఫలితంగా ఇకపై ఉద్యోగం చేయగలమా అనే పరిస్థితుల్లో.. ఇంకెవరికీ ఇలా జరగకూడదనే ఉద్దేశంతో పోలీసులకు ఫిర్యాదు చేశానని వెంకటాచలం ఎంపీడీఓ సరళ ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి స్పందించిన తీరు ఉద్యోగులందరికీ ఒక భరోసా, ధైర్యం, నమ్మకాన్ని కలిగించిందని తెలిపారు. స్వేచ్ఛగా పనిచేయగలిగే ధైర్యాన్ని ముఖ్యమంత్రి కల్పించారని అన్నారు. ఉద్యోగుల ఆత్మగౌరవాన్ని ముఖ్యమంత్రి కాపాడారని చెప్పారు. ప్రభుత్వంపై ఉద్యోగులకు నమ్మకం పెరిగిందన్నారు. సీఎంకు ఏపీ జేఏసీ ధన్యవాదాలు ఎంపీడీఓ సరళ ఫిర్యాదుపై స్పందించి, జరిగిన సంఘటనపై నిష్పక్షపాతంగా దర్యాప్తు చేయాలని పోలీసులను ఆదేశించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి ఏపీ జేఏసీ–అమరావతి ధన్యవాదాలు తెలిపింది. ఈ మేరకు ఏపీ జేఏసీ నాయకులు బొప్పరాజు వెంకటేశ్వర్లు, ఫణి ఆదివారం ఒక ప్రకటన విడుదల చేశారు. వెంకటాచలం ఎంపీడీఓ సరళపై ఇంటిపై దాడి ఘటనలో ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి, ఆయన అనుచరులను అరెస్టు చేయడం పట్ల ఏపీ జేఏసీ హర్షం వ్యక్తం చేసింది. అధికారం చేపట్టిన అనతి కాలంలోనే అన్ని వసతులు కల్పిస్తూ వైఎస్ జగన్ ఉద్యోగుల పక్షపాతిగా పేరొందారని వెల్లడించింది. ఉద్యోగులపై దాడి జరిగినప్పుడు అండగా నిలిచి, వెంటనే చర్యలు చేపట్టడం పట్ల ధన్యవాదాలు తెలియజేసింది. -
ఎమ్మెల్యే కోటంరెడ్డికి బెయిల్ మంజూరు
-
సీఎం నిర్ణయాన్ని స్వాగతిస్తున్నా: కోటంరెడ్డి
సాక్షి, నెల్లూరు: రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డికి బెయిల్ మంజూరు అయింది. ఎమ్మెల్యే కోటంరెడ్డి, అతని అనుచరులు తన ఇంటిపైకి వచ్చి రభస సృష్టించారని వెంకటాచలం ఎంపీడీవో సరళ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కోటంరెడ్డిని అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. స్పెషల్ జ్యుడీషియల్ కోర్టు బెయిల్ మంజూరు చేసిన అనంతరం కోటంరెడ్డి మాట్లాడుతూ.. ఆధారాలు ఉంటే చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చెప్పారని, ఆయన నిర్ణయాన్ని తాను స్వాగతిస్తున్నానని అన్నారు. విచారణ జరిపి తనపై తప్పు ఉంటే చర్యలు తీసుకోవాలని కోటంరెడ్డి పేర్కొన్నారు. కోటంరెడ్డి మాట్లాడుతూ... ‘ఎంపీడీవో సరళ నాపై అసత్య ఆరోపణలతో పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. చట్టానికి ఎవరూ అతీతులు కాదని ముఖ్యమంత్రి చెప్పారు. ఆయన మాటలకు నేను గౌరవం ఇస్తున్నా, హర్షిస్తున్నా. గత ప్రభుత్వ హయాంలో ఎమ్మార్వో, ఐపీఎస్ అధికారులపై దాడి చేస్తే రాజీ చేశారు. ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్రెడ్డి చేసిన ప్రమాణాన్ని తూచా తప్పకుండా పాటించారు. మాది నిజమైన ప్రభుత్వం. జిల్లా ఎస్పీకి నాకు వ్యక్తిగత విభేదాలు ఉన్నాయి. అది నా దురదృష్టం. నాలుగు రోజుల క్రితం కలెక్టర్‌కి ఎస్పీపై ఫిర్యాదు చేశా. ఆధారాలు ఉంటే చర్యలు తీసుకోమని ముఖ్యమంత్రి చెబితే ఎస్పీ వ్యక్తిగత కక్ష తీర్చుకునే ప్రయత్నం చేశారు. అర్థరాత్రి నా ఇంటిపై, నా అనుచరుడు శ్రీకాంత్ రెడ్డి ఇళ్లపై దాడులు చేసి ఇబ్బంది పెట్టారు. విచారణలో నా తప్పు ఉందని తెలిస్తే ఎంపీడీవో సరళకు బహిరంగంగా క్షమాపణ చెబుతా. అంతేకాదు నాపై ఆరోపణలు రుజువు అయితే షోకాజ్ నోటీసులు కాదు..ఏకంగా పార్టీ నుంచి శాశ్వతంగా సస్పెండ్ చేయండి.’ అని అన్నారు. చదవండి: ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అరెస్ట్ -
ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అరెస్ట్
-
ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అరెస్ట్
సాక్షి, నెల్లూరు : రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. వెంకటాచలం ఎంపీడీవో సరళ ఫిర్యాదు మేరకు ఎమ్మెల్యేపై కేసు నమోదు చేసిన పోలీసులు ఆయనను అదుపులోకి తీసుకుని ప్రభుత్వ ఆస్పత్రిలో వైద్య పరీక్షలు చేయించారు. కాగా ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి, అతని అనుచరులు తన ఇంటిపైకి వచ్చి రభస సృష్టించారని వెంకటాచలం ఎంపీడీవో సరళ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ సంఘటనపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సీరియస్ అయ్యారు. అధికారులతో అనుచితంగా ప్రవర్తిస్తే ఎంతటి వారినైనా ఉపేక్షించవద్దని డీజీపీ గౌతం సవాంగ్‌కు ఆయన స్పష్టం చేశారు. -
రిలీవ్ కావాలని ఒత్తిడి చేస్తున్నారు..!
లబ్బీపేట(విజయవాడతూర్పు): పదోన్నతి పొందిన తర్వాత విధుల నుంచి రిలీవ్ అయ్యేందుకు తనకు 15 రోజులు సమయం ఉన్నా తన పోస్టులో నియమితులైన వైద్యుడు, వెంటనే తప్పుకుని ఛార్జి ఇవ్వమని ఒత్తిడి చేస్తున్నారని ఈఎస్ఐ ఇన్చార్జి జాయింట్ డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్న డాక్టర్ టి. సరళ సోమవారం మాచవరం పోలీసులకు ఫిర్యాదుచేశారు. తమ కార్యాలయ సిబ్బంది ముందు అసభ్యంగా, అవమానకరంగా మాట్లాడుతున్నారంటూ ఫిర్యాదులో పేర్కొన్నారు. వివరాలు ఇలా ఉన్నాయి.. కాకినాడ ఈఎస్ఐ ఆస్పత్రిలో డెప్యూటీ సివిల్ సర్జన్ (డీసీఎస్)గా ఉన్న డాక్టర్ టి. సరళ గత ఏడాది మే నెల నుంచి విజయవాడలో ఈఎస్ఐ ఇన్చార్జి జాయింట్ డైరెక్టర్‌గా డెప్యూటేషన్‌పై బాధ్యతలు నిర్వహిస్తున్నారు. కాగా ఇటీవల ఈఎస్ఐలో డెప్యూటీ సివిల్ సర్జన్స్‌కు సివిల్ సర్జన్‌గా పదోన్నతులు ఇచ్చారు. దీంతో ఈఎస్ఐ డైరెక్టరేట్ కార్యాలయంలో డీసీఎస్‌గా పనిచేస్తున్న డాక్టర్ జగదీప్‌గాంధీ సివిల్ సర్జన్‌గా పదోన్నతి పొంది విజయవాడ జాయింట్ డైరెక్టర్‌గా నియమితులయ్యారు. అదే సమయంలో డాక్టర్ టి. సరళకు కూడా పదోన్నతి రావడంలో ఆమెకు విశాఖపట్నంలో పోస్టింగ్ ఇచ్చారు. చార్జి ఇవ్వకుండా కార్యాలయానికి ఎలా వస్తారు కాగా పదోన్నతి పొందిన మరుసటి రోజునే డాక్టర్ జగదీప్‌గాంధీ జాయింట్ డైరెక్టర్‌గా చేరుతూ డైరెక్టరేట్ కార్యాలయంలో రిపోర్టు చేశారు. కాగా ఆ స్థానంలో ఉన్న డాక్టర్ టి. సరళ తాను రిలీవ్ అయ్యేందుకు పదిహేను రోజుల సమయం ఉండటంతో అప్పటివరకూ అక్కడే కొనసాగాలని భావించారు. అయితే తాను బాధ్యతలు స్వీకరించిన తర్వాత మీరు ఉండటానికి వీల్లేదని వేధిస్తూ, సిబ్బంది ముందు అవమానకరంగా మాట్లాడుతున్నారంటూ మీడియా ఎదుట సరళ ఆవేదన వ్యక్తం చేశారు. తాను చార్జి ఇవ్వకుండా ఎలా తన కార్యాలయానికి వస్తారంటూ ప్రశ్నించారు. తాను డెప్యూటేషన్‌పై ఉన్నందున, జేడీగా డాక్టర్ జయదీప్ చేరినా జీతం విషయంలో ఇబ్బంది ఏమి ఉండదని చెప్పినా వినకుండా వేధిస్తున్నారంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కాగా మహిళా వైద్యురాలి నుంచి పిర్యాదు స్వీకరించిన మాచవరం పోలీసులు ప్రాథమిక విచారణ చేయనున్నట్లు తెలిపారు. వేధింపులకు పాల్పడలేదు: డాక్టర్ జగదీప్ గాంధీ తాను మహిళా వైద్యురాలిపై ఎలాంటి వేధింపులకు పాల్పడలేదని డాక్టర్ జగదీప్ గాంధీ తెలిపారు. పదోన్నతి వచ్చిన తర్వాత రెగ్యులర్ జాయింట్ డైరెక్టర్‌గా డైరెక్టరేట్ కార్యాలయంలో రిపోర్టు చేశానన్నారు. అనంతరం కార్యాలయానికి రాగా అప్పటి వరకు ఇన్చార్జి జేడీగా ఉన్న డాక్టర్ సరళ తనకు ఛార్జి ఇవ్వనన్నారు. అయినా నేనేమీ అనలేదని చెప్పారు. అనంతరం స్టాప్ మీటింగ్ పెట్టగా ఇద్దరూ ఉంటే మేము ఎవరి ఆదేశాలు పాటించాలని ప్రశ్నించారన్నారు. తాను రెగ్యులర్‌గా ఈ పోస్టులో నియమితులయ్యానని, డైరెక్టర్ కార్యాలయాన్ని సంప్రదించవచ్చని చెప్పడంతో సిబ్బంది ఫోన్ చేసి నిర్ధారించుకున్నారన్నారు. అంతేకాని, తాను ఎలాంటి ఒత్తిడి, వేధింపులకు పాల్పడలేదని వివరించారు. -
నిర్ణయాలను గౌరవించండి!
గృహిణి-ఉద్యోగిని.. ఇద్దరికీ చేతినిండా పని ఉంటుంది. గృహిణులు బిజీగా ఉండరనేది పెద్ద అపోహ మాత్రమే. నేను ఇది రాస్తుండగా... నా చిన్నకొడుకు వాడి బొమ్మ కనిపించడం లేదని అరుస్తున్నాడు. మా ఆయనేమో సబ్బు కనబడడం లేదని పిలుస్తున్నారు... నా ఇల్లు నా చుట్టూ భూమి తిరుగుతున్నట్టు తిరుగుతోంది. ప్రస్తుతం ఇంట్లో నా ఉద్యోగాల చిట్టా.. వంట మనిషి, వెయిటర్, డాక్టర్. ఇంకా రకరకాల పనులతో బిజీగా ఉంటాను. గృహిణి - ఉద్యోగిని రెండు పాత్రలూ పోషించినదాన్ని కాబట్టి నాకు రెండింటి గురించి పూర్తిగా తెలుసు. మా చిన్నాడు పుట్టినపుడు ఆరు నెలలు ప్రసూతి సెలవులు ఇచ్చారు. తర్వాత ఆఫీసుకెళ్లగానే అందరూ రకరకాల ప్రశ్నలు వేయడం మొదలుపెట్టారు. బోలెడన్ని సలహాలు కూడా ఇచ్చేవారు. వారి ప్రశ్నలు, సందేహాలు, సలహాలు... ఇవన్నీ నా బుర్రలో చేరడంతో బాలింత ఉద్యోగంలో చేరడం తప్పేమో అనుకునేదాన్ని. ‘పసిపిల్లాడితో ఉద్యోగం ఎలా చేస్తున్నావు...?’ అని కనిపించినవారల్లా అడుగుతుంటే చిరునవ్వుతో సమాధానం చెప్పి ఊరుకునేదాన్ని. కాని మనసులో మాత్రం ఏదో తప్పు చేస్తున్న భావన. ఆ సమయంలో కొన్ని ఆర్థిక పరిస్థితుల కారణంగా ఉద్యోగం చేయాల్సి వచ్చింది. కొన్నాళ్ల తర్వాత ఉద్యోగం మానేశాను. ఆ సమయంలో నేను ఎదుర్కొన్న ప్రశ్నలు మరింత బాధ పెట్టాయి. ‘అంత మంచి ఉద్యోగం ఎందుకు వదులుకున్నావు, అంత పెద్ద చదువు వృథా అయిపోయినట్టే కదా! నీ పరిస్థితిలో నన్ను నేను ఒక్క క్షణం కూడా ఊహించుకోలేకపోతున్నాను, అసలు నువ్వు ఖాళీగా ఇంట్లో ఎలా కూర్చోగలుగుతున్నావు?... ఇలా అందరూ నా బుర్రను తొలిచేసేవారు. వారికి ఎలా సమాధానం చెప్పాలో అర్థమయ్యేది కాదు. ఒక సందర్భంలో ఉద్యోగినిగా సమాధానాలు చెప్పలేకపోయాను. మరో సందర్భంలో గృహిణిగా సమాధానాలు చెప్పలేకపోయాను. భారతదేశంలో ఒక మహిళని ప్రతి సందర్భంలో ప్రతి ఒక్కరూ ప్రశ్నిస్తూనే ఉంటారని అర్థమైంది. పెళ్లి తర్వాత పిల్లల్ని కనాలా వద్దా, కంటే ఎలా పెంచాలి... అన్నింటిలో మరొకరి పెత్తనం ఉంటుంది. ఒకవేళ సొంత నిర్ణయాలు తీసుకుంటే పొగరుబోతు అని ముద్ర వేస్తారు. ఇంట్లో అందరూ చదువుకున్నవారే అయినా ఆ ఇంటి మహిళ ఉద్యోగం విషయంలో సొంత నిర్ణయం తీసుకునే హక్కు ఉండదు. ఉద్యోగం చేయడం ఇష్టం లేని మహిళలు కూడా ఉద్యోగం చేస్తుంటారు జీతం కోసం. చాలామంది తల్లులు ఉద్యోగం మానేసి ఇంట్లో ఉండడం వల్ల ఎంతో నష్టపోతున్నట్టు భావిస్తారు. అన్నీ వచ్చినా... ఏం చేయలేపోతున్నామనే భావన వారి ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీస్తుంటుంది. అలాగే ఉద్యోగం చేసే మహిళలు కూడా మానసికంగా చాలా ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటారు. సమయమంతా ఆఫీసుల్లోనే గడిచిపోతోందని, ఇల్లు, పిల్లలూ తమకు దూరమయిపోతున్నారనే అపరాధభావనతో ఇబ్బందిపడుతుంటారు. ఒక స్త్రీ ఇంట్లో ఉండాలని నిర్ణయించుకుంటే... ఆమె సంకల్పం లేని మహిళ అని అనుకుంటారు. కానీ ఆమె ఉద్యోగమనే ఎనిమిదిగంటల పనిని వదులుకుని ఇల్లనే 24 గంటల పనిలో చేరిందని గుర్తించాలి. పిల్లల్ని పెంచడం, ఇంటిని జాగ్రత్తగా చూసుకోవడం చిన్న విషయం కాదు. ఇక్కడ రోజంతా పని ఉంటుంది. ఎంత పని ఉంటుందంటే ఒకోసారి ప్రశాంతంగా ఒక కప్పు కాఫీ తాగే అవకాశం కూడా ఉండదు. అలాగే ఉద్యోగానికి వెళ్లాలనుకునే మహిళ 24 గంటలపనిని తక్కువ సమయంలోనే ముగించుకుని... మరో ఎనిమిది గంటల పని చేయడానికి కూడా సిద్ధపడినట్టు. మొత్తానికి గృహిణి, ఉద్యోగిని ఇద్దరూ రెండు చేతులనిండా పనులతో బిజీగా ఉంటారు. ఇంతటి భారాన్ని మోస్తున్న మహిళలకు సొంత నిర్ణయం తీసుకునే అవకాశం లేకపోవడం దురదృష్టకరం. వారిని పనులను హర్షించేవారుంటారు గాని వారి నిర్ణయాలను గౌరవించేవారు చాలా అరుదుగా ఉంటారు. కాబట్టి మగవారికి ఓ చిన్నవిన్నపం... మీ ఇంటి మహిళ ఏదైనా నిర్ణయం తీసుకున్నప్పుడు... ఆమె వైపు నిలబడి ఆలోచించండి. వీలైనంత ఎక్కువ అర్థం చేసుకోండి. - వై.సరళ, హైదరాబాద్ -
ఆస్తి అడిగే హక్కు ఉంది!
‘‘ఇలా చేస్తారని అనుకోలేదే. మా కొడుకే పోయాక నువ్వెందుకు అని మా అత్తమామలు బయటికి గెంటేశారు. ఇప్పుడు నా పరిస్థితి ఏమిటో, ఎలా బతకాలో తెలియడం లేదు’’... అని దుఃఖపడింది మాధవి. ‘‘అదే పొరపాటు. నీ భర్త పోతేనేం, అతడి ఆస్తి ఉంది కదా? దానితో ధైర్యంగా బతుకు’’ అంది సరళ. ‘‘అది మాత్రం వాళ్లు ఇస్తారా ఏంటి?’’ నిరాశగా అంది మాధవి. ఏం చేస్తే ఇస్తారో సరళకి బాగా తెలుసు. అందుకే మాధవిని తీసుకుని లాయర్ దగ్గరకు వెళ్లి, తన భర్తకు చెందాల్సిన ఆస్తిని తనకివ్వమని కోరుతూ దావా వేయించి, చట్టపరంగా ఆసరా కల్పించింది. మాధవి ఉన్న పరిస్థితుల్లో చాలామంది మహిళలు ఉంటారు. వారికి చట్టాల పట్ల అవగాహన ఉండదు. తమకు ఏయే హక్కులు ఉన్నాయన్న విషయం అంతకన్నా తెలీదు. అందుకే తమకు రావాల్సిన వాటిని, చెందాల్సిన వాటిని కోల్పోతుంటారు. మహిళలు ఆర్థికంగా ఇబ్బందిపడకుండా ఉండేందుకు, వారికంటూ ఓ ఆసరా కల్పించేందుకుగాను భారతీయ చట్టాలు మహిళలకు ఆస్తిహక్కును కల్పించాయి. తండ్రి ఆస్తిలో పిల్లలకు కూడా సమానహక్కును కల్పిస్తూ 1986లో చట్టం వచ్చింది. తాతల ఆస్తిపాస్తుల్లో కూడా మనవలతో సమానంగా మనవరాళ్లకు కూడా పూర్తి హక్కు ఉంటుంది. దానిని అమ్మాలన్నా కొనాలన్నా వీరి సంతకాలు తప్పనిసరి. అలా జరగని పక్షంలో ధైర్యంగా కోర్టుకు వెళ్లవచ్చు. అదేవిధంగా భర్త సంపాదించిన ఆస్తిపై భార్యకు సర్వహక్కులు ఉంటాయి. భర్త చనిపోతే... అతడికి వారసత్వంగా వచ్చే ఆస్తిని ఆమె అడిగిమరీ తీసుకోవచ్చు. అయితే అత్తమామల ఆస్తిలో భాగం అడిగే హక్కు ఎవరికీ ఉండదు. వాళ్లు తన భర్తకి ఏదైనా రాసి ఇస్తే, దాని మీద మాత్రమే ఆమెకు హక్కు ఉంటుంది. ఎందుకంటే తాతల నాటి నుంచి వచ్చే ఆస్తి కాకుండా తల్లిదండ్రులు తమ స్వశక్తితో సంపాదించుకుని ఉంటే... దాని మీద సర్వాధికారాలూ వారికి మాత్రమే ఉంటాయి. వారికి నచ్చితే ఇస్తారు. ఇవ్వనంటే అడిగే హక్కును చట్టం కల్పించలేదు. మహిళలకు మరింత ఆర్థిక భద్రత కల్పించేందుకుగాను... భర్త రెసిడెన్షియల్ ప్రాపర్టీలో భార్యకు సమానహక్కు ఉండేలా సరికొత్త చట్టాన్ని కూడా ఇటీవల రూపొందించారు. ఇది పూర్తిగా అమలులోకి వస్తే భర్త నుంచి విడిపోయిన భార్యలకు మరింత ఉపయోగం అవుతుంది... అంటారు న్యాయవాది ఖలీమ్. నిజానికి ఇలాంటి చట్టాలను కొందరు దుర్వినియోగపరుస్తున్నారని, ఈ విషయంలో పునరాలోచించాలనే వాదన కూడా ఉంది. ఎవరో కొందరు అలాంటివాళ్లు ఉన్నారని, నిజమైన బాధితులకు న్యాయం చేయకుండా ఉండటం సరికాదు అంటారాయన! అయితే ఆస్తి వ్యవహారాలు ఏవైనా కానీ, కచ్చితమైన రిజిస్ట్రేషన్ తో ఉండాలన్న విషయాన్ని మర్చిపోవద్దు. రిజిస్టర్డ్ పత్రాలు కాకుండా, ఏదో కాగితం మీద రాసి ఇచ్చేస్తే చెల్లదు. ఆ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. హిందూ సక్సెషన్ యాక్ట్‌లోని సెక్షన్ 6, 29 ఎ లను చదివితే... ఆస్తుల విషయంలో ఎలాంటి హక్కులు ఉన్నాయన్నది స్పష్టంగా తెలుస్తుంది. అదే ముస్లిం స్త్రీలకైతే వేరే చట్టాలు ఉన్నాయి.