
రైల్వే ట్రాక్‌పై పడి ఉన్న వైద్యురాలి మృతదేహం
బరంపురం: పట్టణ శివారు పంచమా రైల్వే గేట్ సమీపంలో రైల్వే ట్రాక్‌పై యువతి మృతదేహాన్ని స్థానికులు ఆదివారం గుర్తించారు. దీనిపై బరంపురం జీఆర్‌పీ పోలీసులకు సమా చారం అందించగా.. వారు ఘటనా స్థలానికి చేరుకొని, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమి త్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ట్రాక్ సమీపంలో ఉన్న ఆధారాల ప్రకారం మృతి చెందిన యువతి కటక్ ఎస్‌డీబీ మెడికల్ కళా శాలలో వైద్యురాలిగా పని చేస్తున్న కుముదిని గా గుర్తించినట్లు తెలిపారు. యువతి వద్ద ఉన్న రైల్వే టికెట్ ఆధారంగా కటక్ నుంచి బరంపురం వస్తున్నట్లు గుర్తించామన్నారు. అయితే... మృతికి గత కారణాలు తెలియలేద ని, అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తామని జీఆర్‌పీ పోలీసులు వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment