సామాజిక కార్యకర్త అన్నా హజారే (ఫైల్ ఫోటో)
న్యూఢిల్లీ : అవినీతి నిర్మూలన లక్ష్యంగా ఉద్యమిస్తున్న సామాజిక కార్యకర్త అన్నా హజారే మరోసారి ఆమరణ నిరాహార దీక్ష చేపట్టేందుకు సిద్ధమవుతున్నట్లు ప్రకటించారు. దీని గురించి ఆయన ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాశారు. ఈ లేఖలో అన్నా.. ప్రధాని చాలా పెద్ద పెద్ద హామీలు ఇస్తారు.. కానీ చేతల్లో మాత్రం శూన్యమంటూ ఆరోపించారు. బీజేపీ అధికారంలోకి వచ్చి నాలుగేళ్లు గడిచాయి. కానీ ఇప్పటివరకూ లోక్‌పాల్, లోకాయుక్తను నియమించలేదన్నారు. అందుకు నిరసనగా కేంద్రంలో లోక్‌పాల్, రాష్ర్టాల్లో లోకాయుక్త తీసుకురావాలన్న డిమాండ్‌పై గాంధీ జయంతి(అక్టోబర్ 2) నుంచి ఆమరణ నిరాహార దీక్ష చేస్తానని అన్నా హజారే ప్రకటించారు.
అంతేకాక కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం రైతులకు మేలు చేసే వ్యవసాయ వ్యయాలు, ధరల కమిషన్(సీఏసీపీ)కి స్వయం ప్రతిపత్తి కల్పిస్తానని హమీ ఇచ్చింది. కానీ ఇంత వరకూ అందుకు సంబంధించి ఎటువంటి చర్య తీసుకోలేదని ఆరోపించారు. సీఏసీపీకి స్వయం ప్రతిపత్తి కల్పిస్తే ఆ కమిషనే వివిధ వ్యవసాయ ఉత్పత్తుల ధరలను నిర్ణయిస్తుందని గుర్తు చేశారు. కనీస మద్దతు ధర లేకనే రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని తెలిపారు. లోక్‌పాల్, లోకాయుక్త డిమాండ్లపై ఈ ఏడాది మార్చిలో ఢిల్లీలోని చరిత్రాత్మక రామ్ లీలా మైదానంలో అన్నా హజారే నిరవధిక నిరాహార దీక్ష చేపట్టిన సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment