సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం : టీడీపీ నాయకుల దీక్షాదక్షత తేలిపోయింది. అధినేతపై ఉన్న అభిమానం స్పష్టమైపోయింది. దీక్షలకు జనం రాక, నిరసనలు చేసే ఓపిక లేక ఆ పార్టీ నాయకులు టెంట్లు ఎత్తేస్తున్నారు. పార్టీ అధినేత చంద్రబాబు కోసం చేపడు తున్న దీక్షా శిబిరాలు నిర్వహించలేక చేతులెత్తేశారు. అటు ప్రజల నుంచి, ఇటు కేడర్ నుంచి స్పందన లేకపోవడంతో రిలే నిరాహార దీక్షలు చేయడం టీడీ పీ నాయకులకు తలకు మించిన భారంగా మారింది. ధనమైతే ఎంతైనా పెట్టగలం గానీ జనాలను తీసుకురాలేకపోతున్నామని వారంటున్నారు. ప్రస్తుతం ఎక్కడికక్కడ టెంట్‌లు తొలగించి, కుర్చీ లు టెంట్ హౌస్‌కు పంపించి తమకున్న భారాన్ని దింపుకున్నారు.
స్కిల్ డెవలప్‌మెంట్ కుంభకోణంలో చంద్రబాబు జైలుకెళ్లిన దగ్గరి నుంచి టీడీపీ అధిష్టానం ఆ పార్టీ నాయకులకు నిత్యం ఏదో ఒక టాస్క్ ఇస్తూనే ఉంది. చంద్రబాబుకు మద్దతుగా, ప్రజలే మన వెంట ఉన్నట్టుగా బిల్డప్ ఇచ్చే కార్యక్రమాలు చేపట్టాలని ఎప్పటికప్పుడు డైరెక్షన్ ఇస్తోంది. చంద్రబాబు జైలులో ఉన్నంతకాలం ఏదో ఒకటి చేసి సానుభూతి పొందాలని, ఎన్నికల వరకు ఇదే టెంపో కొనసాగించాలన్న కృత నిశ్చయంతో టీడీపీ అధిష్టానం ఉంది. అందుకు తగ్గట్టుగానే కార్యక్రమాలకు రూప కల్పన చేస్తోంది.
చంద్రబాబు జైలుకెళ్లిన రోజు, ముందు ధర్నాలు, రాస్తారోకోలు ఆందోళన కార్యక్రమాలకు పిలుపునిచ్చారు. కానీ జనాలు ఎక్కడా స్పందించలేదు. కనీసం సానుభూతి చూపించలేదు. చివరికి పార్టీ కార్యకర్తలు సైతం సీరియస్‌గా స్పందించలేదు. దీంతో ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు సైతం ఓపెన్ అయిపోయారు. ‘అధినేత చంద్రబాబు అరైస్టెనా ప్రజల నుంచి స్పందన రావడం లేదు.. పార్టీ శ్రేణులు ముందుకు రావడం లేదు.. ఏంటీ దారుణమైన పరిస్థితి’ అని చంద్రబాబు జైలుకెళ్లిన రోజున టెలీ కాన్ఫరెన్స్ ద్వారా ఆ పార్టీ నాయకుల వద్ద ఆవేదన వ్యక్తం చేసిన విషయం తెలిసిందే.
ఆ తర్వాత చంద్రబాబు కోసం పూజలు, మీతోనే మేము వంటి కార్యక్రమాలు చేపట్టారు. వాటికీ స్పందన లేదు. తర్వాత పోస్టు కార్డుల ఉద్య మం చేపట్టారు. చంద్రబాబుకు మద్దతుగా ఉన్నట్టు సెంట్రల్ జైలుకు పోస్టు కార్డులు రాసే కార్యక్రమం చేపట్టారు. జనాలు, కార్యకర్తలు ముందుకు రాకపోవడంతో నాయకులే బల్క్‌లో కొనుగోలు చేసి, బల్క్‌లోనే రాసి పంపించేసి మమ అనిపించారు. దీంతో పోస్టు కార్డుల ఉద్యమం అట్టర్ ఫ్లాప్ అయిపోయింది. ఆ తర్వాత రిలే నిరాహార దీక్షలకు శ్రీకారం చుట్టారు. చంద్రబాబు బయటికొచ్చేంతవరకు చేపట్టాలని పిలుపునిచ్చారు.
కానీ శిబిరాల్లో కూర్చొనేందుకు జనాల్లేక దీక్షలు వెలవెలబోయా యి. గంట, రెండు గంటలు చేసేసి దీక్షలు ముగించేసిన పరిస్థితి కొనసాగింది. ఇప్పుడా గంట, రెండు గంటలు కూడా చేయలేని పరిస్థితికి వచ్చేశారు. దీంతో దీక్షా శిబిరాలు నిర్వహించడం కష్ట సాధ్యంగా తయారైంది. దానికి తోడు మధ్యలో కంచాల మోత మోగించే కార్యక్రమానికి పిలుపునిచ్చారు. నాయకులు తప్ప కార్యకర్తలు, ప్రజలు ఎక్కడా కంచాలు మోగించలేదు. కార్యక్రమం కూడా విఫలమైంది. ఆ తర్వాత ఇంట్లో లైట్లు ఆర్పేసి, కొవ్వొత్తుల వెలిగించాలని అధిష్టానం ఆదేశించింది. అది కూడా ఫ్లాప్ అయ్యింది. నాయకులు తప్ప మరెవ్వరూ కొవ్వొత్తులు వెలిగించలేదు. ఆ నాయకులు వెలిగించిన కొవ్వొత్తుల ఫోటోలనే సోషల్ మీడియాలో పెట్టుకుని తృప్తి చెందారు.
నిరసన కార్యక్రమాలకు దిగుదాం అనుకునే సరికి ప్రజల నుంచి స్పందన లేకపోవడంతో అతి కష్టం మీద సమీకరించిన ఇరవై ముప్పై మందితో కొన్నిచోట్ల అయితే పది మందికి మించి కార్యక్రమాలు చేపట్టలేని దుస్థితి నెలకొంది. చంద్రబాబు అరైస్టెన దగ్గరి నుంచి ఆ పార్టీ నాయకులకు చేదు అనుభవాలు ఎదురవుతూనే ఉన్నాయి. ఇలా ఏ కా ర్యక్రమం చేపడుదామనుకున్నా స్పందన లేక వెలవెలబోతుండటంతో చేసేదేమీ లేక చివరికి రిలే దీక్షా శిబిరాలు కూడా మూసేసే పరిస్థితికి వచ్చేశారు.
జిల్లాలో చాలా నియోజకవర్గాల్లో మంగళవారం రిలే నిరాహార దీక్షా శిబిరాలను ఎత్తేశారు. సాక్షాత్తు పార్టీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు సొంత నియోజకవర్గంలోనే రిలే నిరాహార దీక్షలు ఎత్తేశారంటే మిగతా చోట్ల ఏం జరిగి ఉంటుందో ఊ హించుకోవచ్చు. నరసన్నపేట, పలాస, పాతప ట్నం, ఎచ్చెర్ల తదితర నియోజకవర్గాల్లో ఇదే దుస్థితి. అధిష్టానం నుంచి కూడా తప్పకుండా చే యాలని ఒత్తిడి లేకపోవడంతో హమ్మయ్య అనుకుని ఊపిరిపీల్చుకున్నారు. ఒక భారం దిగిందని ఉపశమనం పొందారు.
Comments
Please login to add a commentAdd a comment