సర్జికల్‌ స్ట్రైక్‌ 2 ఎఫెక్ట్‌.. కేజ్రీవాల్ దీక్ష వాయిదా | Indo Pak Tension Arvind Kejriwal Postponed His Upwas | Sakshi
Sakshi News home page

సర్జికల్‌ స్ట్రైక్‌ 2 ఎఫెక్ట్‌.. కేజ్రీవాల్ దీక్ష వాయిదా

Feb 26 2019 7:08 PM | Updated on Feb 26 2019 7:12 PM

Indo Pak Tension Arvind Kejriwal Postponed His Upwas - Sakshi

న్యూఢిల్లీ : పాకిస్తాన్‌ ఆక్రమిత కశ్మీర్‌లోని ఉగ్రవాద శిబిరాలపై భారత వైమానిక దళాలు చేసిన మెరుపు దాడుల చేపట్టిన నేపథ్యంలో.. తాను చేపట్టాలనుకుంటున్న నిరాహార దీక్షను వాయిదా వేస్తున్నట్లు ఢిల్లీ ముఖ్య మంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ ప్రకటించారు. పాకిస్థాన్, భారత్‌ మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితి దృష్ట్యా తాను ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన వెల్లడించారు. ఢిల్లీకి రాష్ట్ర హోదా కల్పించాలంటూ కేజ్రీవాల్‌ కొంతకాలం నుంచి డిమాండ్‌ చేస్తోన్న సంగతి తెలిసిందే.

ఈ నేపథ్యంలో ఢిల్లీకి రాష్ట్ర హోదా కల్పించడం కోసం వచ్చే నెల ఒకటి నుంచి ఆమరణ నిరాహార దీక్ష చేస్తానంటూ కేజ్రీవాల్ ప్రకటించారు. కానీ ప్రస్తుత ఉద్రిక్త పరిస్థితుల దృష్ట్యా... దీక్షను వాయిదా వేస్తున్నట్లు తెలిపారు. ప్రస్తుత పరిస్థితుల్లో దేశం, దేశ రక్షణ విషయంలో అందరూ కలిసి ఉండాలని.. అందుకే తన నిరాహారదీక్షను వాయిదా వేస్తున్నట్లు ట్వీట్ చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement